NewsOrbit
5th ఎస్టేట్ Featured బిగ్ స్టోరీ

ABN Andhrajyothi : వెంకట కృష్ణ – తొలగింపు వాస్తవాలు..! జంట కృష్ణులకు ఎక్కడ దెబ్బ కొట్టింది..!?

ABN Venkatakrishna : Bhajana in Social Media

ABN Andhrajyothi : నిన్న సాయంత్రం నుండి ఒకటే వార్త తెలుగు సోషల్ మీడియాని కుదిపేస్తోంది. ABN ఛానల్ లో డిబేట్ నిర్వహించే వెంకట కృష్ణని ఆ ఛానెల్ నుండి తొలగించారని.. ఆయన ఓ నాయకుడి నుండి రూ. 50 లక్షలు లంచం డిమాండ్ చేయగా.. పట్టుబడ్డారు కాబట్టి తొలగించారని కారణాలు వినిపిస్తున్నాయి. దీనిపై వాస్తవం ఏమిటి..!? ఎందుకు తొలగించారు..? ఏమైంది..? అనే కోణంలో “న్యూస్ ఆర్బిట్” నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది.

ABN Andhrajyothi : Venkata krishna removed Main Reason..?
ABN Andhrajyothi Venkata krishna removed Main Reason

ABN Andhrajyothi : చేరిక ఎంతో ఉత్సాహంగా..!!

ఏబీఎన్ ఛానెల్ లోకి వెంకట కృష్ణ ప్రవేశమే ఎంతో ఉత్సాహంగా సాగింది. 24 X 7 ఛానెల్ లో అత్యున్నత హోదాలో జర్నలిజంలోకి అడుగు పెట్టిన వెంకట కృష్ణ ఆ ఛానెల్ ని బాగానే నడిపించారు. మూడేళ్ళ పాటు ఓ వెలుగు వెలిగారు. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఛానెల్ డైరెక్టర్లు మధ్య విబేధాలు వచ్చాయి. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాలని వెంకట కృష్ణ..

వైసీపీకి అనుకూలంగా ఉండమని కొందరు పట్టుపట్టడంతో… వెంకట కృష్ణ అక్కడి నుండి బయటకు వచ్చేసారు. కొన్ని నెలలు ఖాళీగా ఉంటూ… గత ఏడాది మే నెలలో ఏబీఎన్ లో చేరారు. ఈయన చేరిక ఎంతో హడావిడిగా జరిగింది. ఏబీఎన్ లోకి వెంకట కృష్ణ రాకతో రాధా కృష్ణ కి సరైన జర్నలిస్టు దొరికాడు అంటూ టీడీపీ వర్గాల్లో… ఆ అనుకూల వర్గాల్లో చర్చ జరిగింది. వెంకట కృష్ణ డిబేట్లు కూడా అలాగే దూకుడుగా ఉండేవి. మొత్తానికి ఈ ప్రయాణం పది నెలల పాటూ సాగింది.

ABN Andhrajyothi : Venkata krishna removed Main Reason..?
ABN Andhrajyothi Venkata krishna removed Main Reason

తొలగింపు వాస్తవమే.. లంచం అనేది ప్రచారం మాత్రమే..!?

నిన్న ఉదయమే వెంకట కృష్ణని ఏబీఎన్ నుండి తొలగించారు. ఆంధ్రజ్యోతి హెచ్ ఆర్ సిబ్బంది వెంకట కృష్ణ ని పిలిపించి.. బలవంతంగా రిజైన్ లెటర్ తీసుకున్నారు. ఈయన మారు మాటలేకుండా రిజైన్ చేసేసారు. అక్కడ వరకు వాస్తవమే… ఏబీఎన్ నుండి వెంకట కృష్ణ తొలగింపు వరకు అంతర్గతంగా ఖరారు చేస్తున్నారు. కానీ కారణాలు మాత్రం రకరకాలుగా ప్రచారంలో ఉన్నాయి.

ఏబీఎన్ లో మొత్తం తానై వెంకట కృష్ణ డామినేటింగ్ గా వ్యవహరిస్తున్నారని… రాధా కృష్ణ ఆదేశాలు కూడా పాటించడం లేదని.., కొందరు ఉద్యోగులు, మహిళా ఉద్యోగులతో ఇబ్బహ్ది కరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇవేమి వాస్తవాలు కాదు, పుకార్లు మాత్రమే. మరోవైపు ఆయన అమరావతి ప్రాంతానికి చెందిన ఓ నాయకుడి నుండి రూ. 50 లక్షలు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు కాబట్టి తొలగించారని ప్రచారం జరుగుతుంది. కారణాలు ఏమిటి అనేది స్పష్టత లేదు. దీనికి ముందు మూడు రోజుల కిందట ఎండీ రాధాకృష్ణతో వెంకట కృష్ణ భేటీ జరిగింది అని అంటున్నారు.

ABN Andhrajyothi : Venkata krishna removed Main Reason..?
ABN Andhrajyothi Venkata krishna removed Main Reason

ఏబీఎన్ లో బ్లాక్ మెయిలింగ్ సాధారణమే..!?

ఏబీఎన్ – ఆంధ్రజ్యోతిలో బ్లాక్ మెయిల్ చేస్తూ దొరికిపోతే తీసెయ్యడం చాల అరుదుగా జరుగుతుంది. జిల్లా స్థాయిలో పని చేసే బ్యూరోలు, మేనేజర్లు నిత్యం ఇదే చేస్తుంటారు. యాడ్లు కోసం కూడా బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. వీటిపై మేనేజ్మెంట్ కి పిర్యాదులు వెళ్లినా సీరియస్ గా స్పందించిన దాఖలాలు లేవు. ఏబీఎన్ రాధాకృష్ణ పై కూడా బ్లాక్ మెయిలింగ్ ఆరోపణలు అనేకం ఉన్నాయి. జర్నలిజం – తెలుగు మీడియాలో ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి విలువలు వేరు. నడిపే విధానం వేరుగా ఉంటుంది. “మీరు ఎవరినయినా బ్లాక్ మెయిలింగ్ చేసుకోండి. కానీ విషయం బయటకు రాకుండా చూసుకోండి” అంటూ మేనేజ్మెంట్ నుండి సలహాలు కూడా వస్తుంటాయి.

అయితే వెంకట కృష్ణ విషయంలో ఏం జరిగింది అనేది మాత్రం ప్రస్తుతానికి పుకార్లు మాత్రమే. నిజంగా ఈయన బ్లాక్ మెయిల్ చేస్తే.. ఎంతో ఇష్టంగా వెంకట కృష్ణని తన ఛానెల్ లోకి తీసుకున్న రాధాకృష్ణ రాజీ చేసి.. కంటిన్యూ చేసే రకం. రాధా కృష్ణ – వెంకట కృష్ణ మధ్య ఈ విషయం కాకుండా ఇంకా ఏదో అంతర్గత అంశం రగులుతుంది… అదే ఈ కారణం అనేది మాత్రం స్పష్టం. అది ఏమిటనేది కొన్ని రోజుల్లో తెలియనుంది. ఈ అంశంపై వెంకట కృష్ణ కూడా స్పందించారు. “ఒక ప్రయాణం.. ఎన్నో మజిలీలు, సవాళ్లు వుంటాయి..ప్రస్తుతానికైతే సెలవు మాత్రమే.. అంతకు మించి ఏమైనా వుంటే త్వరలో నేనే చెప్తా.. నన్ను అమితంగా ప్రేమించే కొందరు శునకానందంతో ఏదో ట్రోల్ చేస్తోవుంటారు.. పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అంటూ ట్వీట్ చేశారు.

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju