NewsOrbit
5th ఎస్టేట్ Featured న్యూస్ బిగ్ స్టోరీ

ABN RK : ఏబీఎన్ ఆర్కేది జర్నలిజమా..? శాపనార్ధమా..? శాడిజమా..!?

ABN RK : Doing Journalisam or Any other..!?

ABN RK : ఏబీఎన్ రాధాకృష్ణ మంచి నిఖార్సయిన ఫక్తు కమర్షియల్ జర్నలిస్టు..! జర్నలిజంతో వ్యాపారం ఎలా చేయాలో ఆయనకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు..! సంచలన రాజకీయ కథనాలతో.. ఎవరికీ అందని ఎత్తులతో రాతలు ఉంటాయి. ABN RK కు తెలిసింది పాతిక అయితే.. ఊహించి రాసేసి డెబ్బై అయిదు ఉంటుంది..! షర్మిల పార్టీ విషయంలో కూడా అదే చేస్తున్నారు. షర్మిల పార్టీ పెడతారన్న విషయం తెలుసు… కానీ ఎందుకు? అజెండా ఏమిటి..? అనేది మాత్రం స్పష్టంగా తెలియదు. కాకపోతే తనలోని “చంద్రబాబు భజనపరుడిని” బయటకు తీసుకొచ్చి.. జగన్ విద్వేషిగా తన సంప్రదాయ రథాలను రాసి.. షర్మిల పార్టీ విషయాన్నీ బ్రేక్ చేశారు. కానీ ఒకటే కోణం చూస్తున్నారు.. దీనిలో అనేక కోణాలున్నాయి..! షర్మిల పార్టీ వెనుక జగన్ పై ద్వేషాన్ని మాత్రమే ఆయన చూస్తున్నారు, హైలైట్ చేస్తున్నారు. కానీ ఇంకా అనేక అవకాశాలు, మార్గాలు, విశ్లేషణలు ఉన్నప్పటికీ ఆర్కే వాటి జోలికి వెళ్లడం లేదు..!!

ABN RK : Doing Journalisam or Any other..!?
ABN RK Doing Journalisam or Any other

ABN RK : జర్నలిజం అంటే..? అనుకున్నది, తెలిసింది చెప్పడమేనా..!?

ఆర్కే వారు ఈరోజు రాసుకున్న “కొత్త పలుకు” లో తనను తాను ప్రెజెంట్ చేసుకున్నారు. విజయసాయిరెడ్డికి చిన్నపాటి సవాల్ చేశారు. “కంటికి కనిపించనివి.. చెవులకు వినిపించనివి ఎన్నో జరుగుతుంటాయి. వాటిని తెలుసుకుని ప్రజలకు చేరవేయడం జర్నలిస్టు బాధ్యత” అంటూ రెండు లైన్లు రాశారు. దీన్నే కాసేపు మాట్లాడుకుందాం..!!

* షర్మిల పార్టీ వెనుక జగన్ పై ద్వేషం మాత్రమే ఆర్కే కంటికి కనిపిస్తుందా..? చెవులకు వినిపిస్తుందా..? సింగిల్ అజెండా.., సింగిల్ స్టాండ్, సింగిల్ పార్టీ, సింగిల్ నాయకుడు భజనతో సాగే ఆర్కే సిసలైన జర్నలిస్ట్ అని ఎలా అణగలరు..!? షర్మిల పార్టీ వెనుక అనేక కారణాలు, విశ్లేషణలు వస్తున్నాయి. అవేమి కనిపించడం లేదు.., వినిపించడం లేదా..!? షర్మిల పార్టీ వెనుక ప్రధానంగా మూడు కారణాలు, అవకాశాలు వినిపిస్తున్నాయి. షర్మిల రాజకీయ ప్రవేశం ఆమె స్వతంత్రంగా మాత్రం జరగలేదు. ఆమె వెనుక బీజేపీ లేదా..? కాంగ్రెస్ లేదా..? జగన్ – కేసీఆర్ కలిపి ఉన్నారనేది రకరకాల విశ్లేషణలు. నిఖార్సయిన జర్నలిజంతో “న్యూస్ ఆర్బిట్” ఆ అవకాశాలు, ఆ విశ్లేషణలు ప్రత్యేకంగా అందిస్తుంది.

ఇదీ చదవండి : మార్చి 5 లోగా.. జగన్ భవిత తేలిపోనుందా..!?

ABN RK : Doing Journalisam or Any other..!?
ABN RK Doing Journalisam or Any other
షర్మిల పార్టీ నంబర్ 1 : షర్మిల బీజేపీ వదిలిన బాణం అనేది ఒకటో వాదన. తెలంగాణాలో క్రిష్టియన్, మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. క్రిష్టియన్ ఓట్లు దాదాపు 4 శాతం ఉండగా.., ముస్లిం ఓట్లు 9 శాతం వరకు ఉన్నాయి. ఈ ఓట్లు కేసీఆర్, లేదా ఎంఐఎం ఖాతాలోనే ఉంటున్నాయి. అంతకు ముందు ఈ వర్గాల మద్దతు దివంగత రాజశేఖర్ రెడ్డికి ఉండేది. ఏపీలోనూ ఈ రెండు వర్గాలు 85 శాతం జగన్ కె అండగా ఉంటాయి. సో.., తెలంగాణాలో బలపడాలి అనుకుంటున్న బీజేపీ షర్మిల పార్టీ ద్వారా ఆ ఓట్లను చీల్చాలి అనుకుంది. కాంగ్రెస్ లో ఉన్న కొన్ని సంప్రదాయ రెడ్డి ఓట్లు, బీజేపీ విధానాలు నచ్చని రెడ్డి వర్గాలు కూడా షర్మిలకు దగ్గరైతే కాంగ్రెస్, ఎంఐఎం, టీఆరెస్ ఓట్లు చీలిక ద్వారా బీజేపీ లాభపడింది. సో… షర్మిల బీజేపీ వదిలిన బాణమే అనేది ఒకటో వాదన/ విశ్లేషణ. అందుకు జగన్ కూడా ప్రణాళికలో ఉన్నారని.., జగన్ – బీజేపీ బంధం దృష్ట్యా ఇది జరిగి ఉండొచ్చని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి.
* షర్మిల పార్టీ నంబర్ 2 : ఇక షర్మిల పార్టీ వెనుక కాంగ్రెస్ పార్టీ ఉన్నదీ అనేదే మరో వాదన. తెలంగాణలోని మైనారిటీ ఓట్లు కేసీఆర్ కి, ముస్లిం ఓట్లు ఎంఐఎంకి దగ్గరగా ఉన్నాయి. రెడ్డి ఓట్లు కాంగ్రెస్ పై నమ్మకం లేక ఇప్పుడిప్పుడే బీజేపీ వైపునకు మళ్లుతున్నాయి. సో.. వాటికి గాలం వేసేందుకు బీజేపీ, టీఆరెస్, ఎంఐఎం ల ఓట్లు దెబ్బ తీసేందుకు కాంగ్రెస్ సహకారంతో షర్మిల పార్టీ పెడుతున్నారని.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ షర్మిలతో మాట్లాడారని.. ఒక ప్రణాళిక ప్రకారమే షర్మిల రంగంలోకి దిగారని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి.
ABN RK : Doing Journalisam or Any other..!?
ABN RK Doing Journalisam or Any other
* షర్మిల పార్టీ నంబర్ 3 : ఇక షర్మిల పార్టీ వెనుక ఉన్న మూడో కారణం పరిశీలిస్తే ఆమె కేసీఆర్ – జగన్ ల ఉమ్మడి వ్యూహం. అంటే బీజేపీ తెలంగాణాలో ఇప్పుడిప్పుడే బలోపేతం అవుతుంది. కాంగ్రెస్ వైపు ఉన్న రెడ్డి సామజిక వర్గ ఓట్లు బీజేపీకి వెళ్తున్నాయి. టీఆరెస్ వ్యతికరేకులకు బీజేపీ ఆసరా కేంద్రంగా మారింది. సో.., షర్మిల ద్వారా బీజేపీ ఓట్లను డైవర్ట్ చేయాలి అనేది కేసీఆర్ వ్యూహం. అందుకే జగన్ – కేసీఆర్ కలిసి షర్మిలను రంగంలోకి దించారని భావిస్తున్నారు. జగన్ కి తెలియకుండా.., జగన్ కి ఇష్టం లేకుండా షర్మిల లోటస్ పాండ్ వేదికగా రాజకీయం నడపడం సాధ్యమా..!? షర్మిల పార్టీ సమావేశాల మొదటి రోజున టీఆరెస్ నేతలు కొందరు చేసిన వ్యాఖ్యలను / సోషల్ మీడియా పోస్టులను ఆ పార్టీ పెద్దలు డిలీట్ చేయించారు.. సో.. షర్మిల వెనుక జగన్ – కేసీఆర్ ల ఉమ్మడి ప్రణాళిక ఉండొచ్చు అనేది కూడా వినిపిస్తున్న మరో వాదన/ విశ్లేషణ.

“న్యూస్ ఆర్బిట్” ఏం చెప్తుంది..!?

జర్నలిజం అంటే తాను అనుకున్నది జనాలపైకి రుద్దేయడం కాదు. రకరకాల వర్గాలు ద్వారా వస్తున్నది విశ్లేషించి ప్రజలకు అందించడం. షర్మిల రాజకీయ పార్టీ పెడుతున్నట్టు తాను ముందే చెప్పి ఉండొచ్చు కానీ.. ఆమె పార్టీ వెనుక ఉన్న జెండా, అజెండా మాత్రం ఆర్కే సొంత వ్యవహారాలు/ సొంత అజెండా రాతలే తప్ప వాస్తవాలకు దగ్గరగా లేవు. ఆర్కే జగన్ ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి… మిగిలిన అందరూ వ్యతిరేకించాలి అనుకోవడం జర్నలిజమా..? శాపనార్ధమా..? శాడిజమా..!? సో.. చివరిగా చెప్పేదేమిటంటే.. షర్మిల పార్టీ ఒక వ్యూహం. ఆమె ఒకరు వదిలిన బాణం అనేది మాత్రం ఫిక్స్. ఆ వెనుక ఎవరి అజెండా ఉంది అనేది తెలియాలి/ స్పష్టత రావాలి అంటే షర్మిల పార్టీ పూర్తిగా రూపుదిద్దుకుని.., విధానాలు ఖరారై.. ఆమె కొన్ని రాజకీయ పర్యటనలు/ ప్రసంగాలు చేసిన తర్వాత బయటకు వస్తుంది..! ఈలోగా వచ్చేవాణ్ణి ఊహాగానాలే..!!

author avatar
Srinivas Manem

Related posts

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk