NewsOrbit
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

తన పత్రిక నిత్యం చదివే వాళ్ళకి బిగ్ షాక్ ఇచ్చిన ఏ‌బి‌ఎన్ ఆర్‌కే !

రెండు తెలుగు రాష్ట్రాల పాఠకులకు ఆంధ్రజ్యోతి ఓనర్ రాధాకృష్ణ కొత్త పలుకులు కొత్తేమీకాదు. అతని పత్రికలో వెలువడే వ్యాసం ఎప్పుడూ చంద్రబాబు ని పొగుడుతూ జగన్ ను కించపరుస్తూ నవ్యాంధ్ర, అమరావతి అంటూ వాటి చుట్టూనే తిరుగుతుంది. అయితే మొట్టమొదటిసారి ఒక నిఖారసైన జర్నలిస్టు లాగా రాధాకృష్ణ వ్యాసం రాశాడు అంటే ఎవరైనా నమ్మగలరా…??

 

వివరాల్లోకి వెళితే…. ఎక్కడా సంయమనం కోల్పోకుండా…. నేలవిడిచి సాము చేయకుండా దుబ్బాక ఉప ఎన్నికను అన్ని కోణాల్లో టచ్ చేస్తూ రాధాకృష్ణ పూర్తిగా తెలంగాణ రాజకీయాల పై ఒక వ్యాసం రాశారు. ఇతర మీడియా సంస్థల గా తెలంగాణలో కేసీఆర్ ను తెగ పొగిడేసింది లేదు…. అలాగని తెలంగాణ ముఖ్యమంత్రి పై గుడ్డి వ్యతిరేకత కనబరిచింది కూడా లేదు. జరుగుతున్న పరిణామాలపై పూర్తిస్థాయి విశ్లేషణను సూటిగా నిష్పక్షపాతంగా చెప్పడమే హైలైట్. ఇక ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒక మెయిన్ స్ట్రీమ్ పత్రిక నుండి ఈ మాత్రం ఆశించడం నిజంగా ఎక్కువే…. అది కూడా మన రాధాకృష్ణ నుండి.

ఇక ఎంతో సాఫీగా మంచినీళ్లు తాగినంత సులువుగా ఉప ఎన్నికలలో జనాలను తమ వైపు తిప్పుకునేందుకు అన్నీ ప్లాన్ చేసుకునే టిఆర్ఎస్ కు మొట్టమొదటిసారి దుబ్బాక రూపంలో ప్రతిఘటన ఎదురు పడుతోంది. ఎవరైనా ఎమ్మెల్యే మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఎన్నికను రాజకీయ పార్టీలు సహకరించుకోవాలి ఒక ఆనవాయితీ కి టిఆర్ఎస్ గతంలో గండి కొట్టింది. అయితే ఇప్పుడు అదే వారికి దిక్కయింది. రామలింగారెడ్డి భార్యను అభ్యర్థిగా ఎంపిక చేసి అతని కొడుకును దూరంగా పెట్టారు. ఇక ఈ వ్యవహారం మొత్తం హరీష్ రావు దగ్గరుండి నడిపించారు. జనంలో వ్యతిరేకతను తప్పించుకునేందుకు ఒక పెద్ద పన్నాగం వేశారు. బిజెపి ని వేటాడి అన్ని వ్యవస్థలను ఉసిగొల్పారు. అయితే గతంలో లాగా బీజేపీ ఈసారి ఏమి బలహీనంగా లేదు…. చాలా ఏళ్ల తర్వాత సై అంటే సై అన్నట్లు నిలబడింది.

ఇదంతా పక్కన పెడితే టిఆర్ఎస్ వ్యతిరేక ఓటర్లు కాంగ్రెస్ వైపు కాకుండా బిజెపి వైపు మళ్ళేందుకు కూడా హరీష్ రావ్య్ స్వయంకృతాపరాధమే కారణమని అంటున్నారు. అంతిమంగా టిఆర్ఎస్ గెలవచ్చు కానీ తమకు మంచి బలమును నియోజకవర్గాల్లో మరి ప్రత్యేకించి హరీష్ సిద్దిపేట నియోజకవర్గం, కేసీఆర్ గజ్వేల్ పక్కనే ఉండే వాటి ప్రభావం కనిపించే దుబ్బాకలో కూడా వారికి భారీగా నెగిటివిటీ వచ్చేసింది. పార్టీ నాయకులు లోగుట్టు వ్యవహారాలు, వరద సహాయం పంపిణీలో చేతివాటం, డబల్ బెడ్ రూమ్ ఇళ్ల చాలెంజ్ ఇప్పుడు టిఆర్ఎస్ గ్రేటర్లో ఎన్నో డౌట్లు రేకెత్తిస్తున్నాయి.

ఇలా రాధాకృష్ణ పాయింట్లు పాయింట్లు రాసుకుంటూ పోతున్నాడు…. ఎటొచ్చి మళ్ళీ ఏపీ గురించి రాయడానికి ప్రయత్నిస్తే తెలుగు దేశం వీర విధేయుడు మేల్కొంటాడు. అది జనాలకు నచ్చట్లేదు…. ఇక ఆర్కె మాత్రం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఇలా నిష్పక్షపాతంగా రాయడం పాఠకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది అనే చెప్పాలి..!

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju