NewsOrbit
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ

ABN RK: బాబ్బాబూ… సానుభూతి బూడిద ఏమైనా ఉంటె ఇటు పడెయ్యండయ్యా..!!

ABN RK: Trying for Sympathy Share in AP Politics

ABN RK: సందట్లో సడేమియాలా… పాపం తనకూ సానుభూతి బూడిద కావాల్సి వచ్చిందేమో.. ఏపీ రాజకీయాలన్నీ (AP Politics) ప్రస్తుతం సానుభూతిపై నడుస్తున్నాయి. తమ పార్టీ ఆఫీస్ పై దడి జరిగిందని టీడీపీ (Telugu Desam Party).., తమ అధినేతను దూషించారని వైసీపీ (YSRCP) సింపతీ కోసం ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళున్నారు. మధ్యలో ఏబీఎన్ ఆర్కే(ABN Radha Krishna)  కూడా ఆ సింపతిలో, ఆ సానుభూతితో వాటా కోసం కొన్ని కిటుకులు వెతుక్కుంటున్నారు..

ఏపిలోని తెలుగుదేశం పార్టీ (TDP News) కార్యాలయాలపై వైసీపీ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (పట్టాభి) (Pattabhi Arrest) పరుష పదజాలంతో దూషించడంతో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు హర్ట్ అయి దాడులు చేశారు. పట్టాభి వ్యాఖ్యల నేపథ్యంలో తమ అభిమానులే ఈ చర్యలకు పాల్పడినట్లు ఆ పార్టీ నేతలే అంగీకరించారు. అయితే దీనిపై ఏబీఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ లో మరో కీలక విషయాన్ని బయటపెడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్కే వెరైటీ భాష్యాన్ని చెప్పారు. జగన్మోహనరెడ్డి పరిపాలన, జగన్మోహనరెడ్డి వ్యక్తిత్వం, జగన్మోహనరెడ్డి సానుభూతి, సింపతీ అంటూ ఈ విధంగా రాజకీయాలు చేస్తారని చెబుతూనే ఓ కొత్త కొణాన్ని బయటకు తీసుకువచ్చారు ఆర్కే. తెలుగు నాట బూతు రసం తెప్పలుగా పారుతుందా. డ్రైయినేజీ స్కీమ్ లేక అది డేంజర్ గా మారుతుందా అంటూ ఆర్కే ప్రశ్నలను సంధించారు. ఏపి రాజకీయాల్లో బూతులు తిట్లు సర్వసాధారణంగా మారడానికి కారణం ఎవరు. వైసీపీ అనే పార్టీ వచ్చిన తరువాతే రాజకీయాలు ఇలా హీనమయ్యాయి. టీడీపీ నేత పట్టాభి జగన్ ను ఉద్దేశించి అన్న ఒకే మాట వైసీపీకి రక్తపోటు తెప్పిస్తే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహనరెడ్డి అప్పుడు ఎన్ని మాటలు అన్నారు. టీడీపీ అభిమానులకు ఎన్ని సార్లు బీపీ రావాలి అని ఆర్కే ప్రశ్నించారు. ఇలా ప్రశ్నలను సంధిస్తూ జగన్మోహనరెడ్డి తన తల్లిని అవమానించారని అన్నారు, ఫలానా పదాన్ని బాగా హైలెట్ చేసుకున్నారు, ఏదో సానుభూతి పొందాలని చూశారు అని ఓ జర్నలిస్ట్ కోణంలో అన్నారు. అంతే కాకుండా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై కూడా దాడులు చేయాలని వైసీపీ ప్రణాళిక వేస్తుంది అని ఆర్కే ఆరోపణ చేశారు. ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన అంశం. ఏబీఎన్ పై దాడి చేయాలని భావించారని ఆయనకు ఎలా తెలుసు.

ABN RK: Trying for Sympathy Share in AP Politics
ABN RK Trying for Sympathy Share in AP Politics

ABN RK: అప్పటికప్పుడు జరిగిందే..!?

జగన్మోహనరెడ్డి ఎలా అయితే సానుభూతి పొందాలని లేని కొత్త పదాన్ని సృష్టించారో అదే విధంగా ఇక్కడ ఏబీఆర్ ఆర్కే కూడా తన పట్ల, తన మీడియా పట్ల సానుభూతి, తన పట్ల తెలుగుదేశం పార్టీలో ఆదరణ కోసం ఇలా వ్యాఖ్యానించారని పరిశీలకులు భావిస్తున్నారు. మీ పార్టీ కార్యాలయాలపైనే కాదు మా పత్రికా కార్యాలయాలపైనా వాళ్లు దాడులు చేయాలని అనుకున్నారు మీరు, మేము ఒక్కటే అని తనకు తాను హైప్ చేసుకునే ప్రయత్నం చేశారు. వైసీపీకి టీడపీ ఎంత శత్రువో తను, తన ఆఫీసులు అంతే అన్న కొత్త కోణాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు ఆర్కే. నిజానికి ఆ ఆలోచన ఉందా లేదా అనేది పరిశీలిస్తే.. వైసీపీ టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడి ఓ ప్రణాళికాబద్దంగా జరిగింది కాదు. ఏదో ఆవేశంతో అప్పటికప్పుడు అనుకుని దాడి చేసిందే కానీ దానికి ముందస్తు ప్రణాళికతో జరిగింది కాదు అని చెప్పవచ్చు. పట్టాభి ఉదయం ప్రెస్ మీట్ లో జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ మధ్యాహ్నం లేళ్ల అప్పిరెడ్డి అందుబాటులో ఉన్న కార్యకర్తలను పిలిపించారు. ఇటు బాపట్ల ఎంపి నందిగం సురేష్ తన అనుచరులను, అటు దేవినేని అవినాష్ అనుచరులను పిలిపించారు. మొత్తం 30, 40 మంది పోగయ్యి కర్రలు, రాళ్లు పట్టుకుని టీడీపీ కేంద్ర కార్యాలయం మీదకు దాడికి వెళ్లిపోయారు.

ABN RK: Trying for Sympathy Share in AP Politics
ABN RK Trying for Sympathy Share in AP Politics

ఆర్కే వారి సింపతీ గోల..!?

నిజంగా ప్రీ ప్లాన్ అయి ఉంటే ఆర్కే అనుమానించినట్లు టీడీపీ పార్టీ ఆఫీసుతో పాటు ఏబిఎన్ ఆఫీసు, ఈనాడు కార్యాలయంపై దాడులు జరిగేవేమో..! వైసీపీ దాడి మాత్రం ప్రీ ప్లాన్ కాదని ఓ ఫ్రెస్టేషన్ లో జరిగిన దాడిగా భావిస్తున్నారు. వాస్తవానికి ఏబిఎన్ ఆఫీసులపై దాడి చేయాల్సిన అవసరం వాళ్లకు లేదు. ఒక వేళ్ల వైసీపీ వాళ్లు ఏబీఎన్ పై దాడి చేయాలంటే వాళ్ల కేంద్ర కార్యాలయం హైదరాబాద్ (తెలంగాణ)లో ఉంది. జిల్లాలో ప్రింటింగ్ యూనిట్ లపై దాడి చేస్తే ఏమి ఉండదు వాళ్లకు తెలుసు. ఏబిఎన్ స్టాఫ్ జోలికి వెళ్లే అవసరం వైసీపీ శ్రేణులకు ఉండదు. వాళ్లకు కోపం ఉంటే ఏబిఎన్ ఆర్కే పై ఉంటుంది. అయితే ఈ ఎపిసోడ్ లో తన వైపు వాళ్లు చేయాలని అనుకున్నారని చెప్పి సానుభూతి పొందాలన్న ప్రయత్నం చేసి ఉండవచ్చని అనుకుంటున్నారు. అందుకే పొలిటికల్ సింపతీ బూడిద ఏమైనా మిగిలితే ఆ ఆర్కే వారికి కొంత పార్సెల్ పంపించేయండి..!

author avatar
Srinivas Manem

Related posts

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju

Pawan Kalyan – Ambati Rayudu: పవన్ అభిమానుల ఆశలపై నీళ్లు

sharma somaraju