Amith Shah: ఇదేం స్ట్రాటజీ బాబోయ్..!? అమిత్ షా బిగ్ టార్గెట్..!

Share

Amith Shah: భారత దేశంలో ప్రస్తుతం ఓ పెద్ద వ్యవస్థీకృతమైన మైండ్ ఏదైనా ఉంది అంటే గుర్తుకు వచ్చేది కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన అమిత్ షా. బీజేపీని 2019 ఎన్నికల్లో గద్దెను ఎక్కించడంలో, అంతకు ముందు 2014 ఎన్నికల్లో రాజకీయం చేయడంలో, అనేక రాష్ట్రాల్లో బీజేపీ గెలవడంలో మోడీ, షా ద్వయం వ్యూహాలే కారణం అనేది అందరికీ తెలిసిందే. వాస్తవానికి అమిత్ షా పొలిటికల్ స్ట్రాటజీ ఎవరి ఊహాలకు అందదు. అయితే ఇప్పుడు అమిత్ షా చూపు ఆంధ్రప్రదేశ్ మీద పడిందా ? లేదా, ఆంధ్రప్రదేశ్ లో గడచిన పది పదిహేను రోజుల నుండి బీజేపీ వైఖరి కారణాలు ఏమిట ?. అమిత్ షా ఏపి మీద దృష్టి పెట్టడం వల్లనే జగన్మోహనరెడ్డి సీబీఐ కేసులో బెయిల్ రద్దు, ఆయన వ్యక్తిగత హజరు ఇప్పుడు తెరమీదకు వచ్చాయా ? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. వాటిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికమైన చర్చ జరుగుతోంది. ఈ అంశాల గురించి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూసుకున్నట్లైయితే….

Amit Shah political strategy in ap

Amith Shah: ఉత్తరాదిలో బీజేపీకి హవా తగ్గుతున్న నేపథ్యంలో..

అమిత్ షా ఏపి మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే బీజేపీకి మొదటి నుండి గట్టి పునాదులు ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో బీటలు వారుతోంది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్, రాజస్థాన్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో బీజేపీ హవా తగ్గుతూ వస్తోంది. యూపిలో మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బీజేపీ మళ్లీ గెలవడం అనేది చాలా కష్టమే. ఉత్తరాదిలో బీజేపీకి కొంత హవా తగ్గుతున్న నేపథ్యంలో దక్షిణాదిపై అమిత్ షా ఫోకస్ పెట్టారు. దక్షిణాదిని కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. దక్షిణాదిలో బీజేపీకి లొంగని రాష్ట్రాలు చూసుకున్నట్లయితే కేరళ, తమిళనాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉండగా వీటిలో తమిళనాడు, కేరళలో బీజేపీ ఎదిగేందుకు అవకాశమే లేదు. ఇక బీజేపీ ఎదగడానికి అవకాశాలు ఉన్నది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మాత్రమే. ఇప్పటికే తెలంగాణ మీద పోకస్ పెట్టేసింది. అక్కడ ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించింది. వివిధ పార్టీలలోని నాయకులను చేర్చుకుంటోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఉద్యోగుల సంఘ నేత విఠల్, జర్నలిస్ట్ తీన్ మార్ మల్లన్న తదితరులను పార్టీలో చేర్చుకోంది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలను చేర్చుకుంటోంది. ఇంకా పలువురు ముఖ్య నేతలను చేర్చుకునేందుకు బీజేపి గేట్లు తెరిచింది.

ఏపిలో రాజకీయం మొదలు

ఇక ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం మొదలు పెట్టింది బీజేపీ. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. దానిలో భాగంగా జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసులో రోజు వారి హజరు విషయంలో సీబీఐ ట్విస్ట్ ఇచ్చింది. నాలుగు నెలల క్రితం జగన్మోహనరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ విషయంలో సానుకూల వైఖరి ప్రదర్శించిన సీబీఐ.. తాజాగా హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో జగన్మోహనరెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తారు. కేసుల విచారణ త్వరగా పూర్తి చేయాల్సి ఉన్నందున వ్యక్తిగత హజరు మినహాయింపు ఇవ్వవద్దని పేర్కొంది. దీనికి తోడు జగన్మోహనరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ విచారణకు వచ్చింది. వీటితో పాటు ఏపి బీజేపీ నాయకులు జగన్మోహనరెడ్డి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇవన్నీ చేయడం ద్వారా ఏపీలో బీజేపీ రాజకీయం మొదలు పెట్టింది. కానీ క్లైమాక్స్ లో ఒ ట్విస్ట్ ఉంది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. బీజేపీ ఎన్ని జిమ్మిక్కులు చేసి రాజకీయాలు చేసినా తల్లకిందులుగా తపస్సు చేసినా ఏపీలో బీజేపీకి ఓట్లు రాలవు. కనీసం 3-4 శాతం ఓట్లు కూడా రావు,. ఈ విషయం అమిత్ షా, మోడీకి, బీజేపీ పెద్దలందరికీ తెలుసు. తమకు ఓట్లు రావు కాబట్టి ఇక్కడి ప్రాంతీయ పార్టీల ద్వారా తమ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం బీజేపీ లక్ష్యం. వాళ్ల ఉద్దేశం వైసీపీ లొంగి ఉండాలి. ఇప్పుడిప్పుడు వైసీపీ తాము ఏ కూటమి కాదు, తమకు బీజేపీ వద్దు, కాంగ్రెస్ వద్దు మేము వేరేది ఆలోచిస్తున్నామని ఎప్పుడైతే మాట్లాడటం మొదలు పెట్టారో బీజేపీ అస్త్రాలు అన్నీ బయటకు వస్తున్నాయి. ఏపిలో రాజకీయాలను, జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని తమ కంట్రోల్ లో ఉంచుకోవాలన్నది వాళ్ల ఉద్దేశం. జగన్మోహనరెడ్డి బెయిల్ రద్దు చేయరు. జైలుకు పంపించరు. ప్రస్తుతం జగన్మోహనరెడ్డి సీఎంగా ఉన్నారు. ఆయన సాక్షులను ప్రభావితం చేస్తున్నారు అనేదానికి ఆధారాలు లేవు. కాకపోతే ఏపిలోని వైసీపీ తమ హ్యాండ్ నుండి జారిపోకుండా చూసుకుంటూ ఉంటుంది.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

36 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

38 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago