NewsOrbit
5th ఎస్టేట్ Andhra Pradesh Telugu News ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AB Venkateswara Rao: పోస్టింగుకు ఏ.బీ.వెంకటేశ్వరరావు వెంపర్లాట! ఆయనేదో ఘనవిజయం సాధించినట్లు ఎల్లో మీడియా పాట!

AB Venkateswara Rao: సుప్రీంకోర్టు సస్పెన్షన్ ఎత్తి వేయడంతో ఆంధ్రప్రదేశ్(Andra Pradesh) మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏ.బీ. వెంకటేశ్వరరావు(AB Venkateswara Rao) రీ పోస్టింగ్ కు ఆరాటపడుతుంటే ఎల్లో మీడియా మాత్రం ఆయనేదో జగన్ ప్రభుత్వం కొమ్ములు వంచి వీరుడులా తిరిగొచ్చాడనే బిల్డప్ ఇస్తోంది.ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడికి సింగంలా తిరిగొచ్చాడనే తరహా కథనాలను వ్యాప్తిలోకి తెస్తోంది.నిజానికి సుప్రీంకోర్టు ఆయన సస్పెన్షన్ ను సాంకేతిక పరమైన,చట్టపరమైన కారణాలతో ఎత్తేసింది.ఇందులో ఏబీ వెంకటేశ్వరరావు ఘనతేమీ లేదు.ఆయనకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందీ లేదు.

Andhra IPS officer AB Venkateswara Rao seeks fresh posting after SC verdict
Andhra IPS officer AB Venkateswara Rao seeks fresh posting after SC verdict

కొద్దిగా వెనక్కు వెళితే!

చంద్రబాబు హయాంలో,ఆయన జమానాలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉంటూ అంతా తానై చక్రం తిప్పిన ఏబీ వెంకటేశ్వరరావు ను జగన్ ప్రభుత్వం( AP Government) అధికారంలోకి రాగానే పక్కన పెట్టేయడమే కాకుండా పోలీసు శాఖకు అవసరమైన నిఘా పరికరాల కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయన్న అభియోగంపై సస్పెండ్ చేయడం జరిగింది.2020 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.

హైకోర్టు తలుపుతట్టిన ఏ.బి.వి

ఈ నేపధ్యంలో ఏబీ వెంకటేశ్వరరావు(AB Venkateswara Rao) హైకోర్టులో తన సస్పెన్షన్ ను సవాల్ చేశారు.ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని ఆయన వాదించారు.అదే ఏడాది మే 22 న హైకోర్టు ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదని తీర్పు ఇచ్చింది.అందుకు తగిన గ్రౌండ్స్ లేవని పేర్కొంది.దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో(Supreme Court) స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.

సుప్రీంకోర్టులో ఏం జరిగిందంటే!

మొత్తం మీద ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరినప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారంలోనే దీనిపై పూర్తిస్థాయి విచారణ మొదలైంది.అయితే సుప్రీంకోర్టు ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ విషయంలో ఒకే ఒక సాంకేతిక అంశానికి కట్టుబడింది.ఏ అధికారిని కూడా రెండేళ్లకు మించి ఒక్క రోజు కూడా సస్పెన్షన్లో ఉంచటానికి లేదన్న సర్వీసు రూల్స్ ను సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది.తాను విచారణ చేపట్టే టప్పటికే ఏబీ వెంకటేశ్వరరావు సస్పెండ్ అయి రెండేళ్లు దాటినందున మరో వాదనకు తావులేకుండా ఆయన సస్పెన్షన్ ఎత్తివేయాలని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది.అంతేగాక ఆయనకు సస్పెన్షన్ పీరియడ్ కు సంబంధించిన జీతభత్యాలను కూడా చెల్లించాలని,వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది.

ఎల్లో మీడియా కలరింగ్ ఎలా ఉందంటే!

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆ తీర్పు ప్రతిని తీసుకొని ఏబీ వెంకటేశ్వరరావు చీఫ్ సెక్రటరీని కలవడానికి వచ్చారు.తనకు పోస్టింగ్,జీతభత్యాల బకాయిలు చెల్లించాలని కోరేందుకు రావడం జరిగింది.అయితే చీఫ్ సెక్రెటరీ లేకపోవడంతో ఆయన కార్యాలయంలో డాక్యుమెంట్లన్నీ ఇచ్చేసి వెంకటేశ్వర రావు తిరుగుముఖం పట్టారు.జరిగింది ఇది అయితే ఎల్లో మీడియా వెంకటేశ్వరరావు ను వీరుడు శూరుడు అని చూపడానికి ప్రయత్నించింది.సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టి ఆయనేదో అద్భుత విజయం సాధించి తిరిగి పోస్టింగ్ తెచ్చుకున్న బిల్డప్ ఇచ్చింది.సింగం లా తిరిగి వచ్చాడని కీర్తించింది.రెండేళ్లకు మించి సస్పెన్షన్ కుదరదన్న ఒకే ఒక్క పాయింట్ ఆధారంగా సుప్రీం కోర్టు ఆయనకు తిరిగి పోస్టింగ్ ఇవ్వమని ఆదేశిస్తే దాన్ని మాత్రం ఎల్లో మీడియా కప్పిపుచ్చింది..అంతేకాదు..పోస్టింగ్ ఇచ్చాక జగన్ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావు మీద ఉన్న ఆరోపణల పై విచారణను యథావిధిగా కొనసాగించుకోవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.అంటే ఇంకా ఆట ముగియలేదని అర్థం.ఎల్లో మీడియా ఎంత కవరింగ్ ఇద్దామని చూసినా వ్యర్థం!

author avatar
Yandamuri

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju