Somu Veerraju: సోముపై చిర్రుబుర్రు..! ఏపీ బీజేపీలో కస్సుబుస్సు..!

Share

Somu Veerraju: తాము అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ క్వార్టర్ రూ.50లకే అమ్ముతామంటూ ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటన తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కొంత మంది నాయకులకు పెద్ద సంఖ్యలో జనాలు ఉన్నప్పుడు మైక్ ఇస్తే ఏమి మాట్లాడుతున్నారో వారికే తెలియని విధంగా మాట్లాడేస్తుంటారు. అదే విధంగా సోము సారు కూడా రీసెంట్ గా విజయవాడలో జరిగిన బీజేపీ ప్రజాగ్రహ సభలో అనర్గళంగా గంట సేపు ఉపన్యాసం ఇచ్చారు. అయితే పార్టీ విధానాలకు భిన్నంగా సోము సారు చీప్ లిక్కర్ పై మాట్లాడటం ఆ పార్టీ జాతీయ నాయకత్వాన్ని చిక్కుల్లో పడేసింది. సోము వీర్రాజు ప్రకటనపై ఏపిలోని రాజకీయ పార్టీలే కాక ఇతర రాష్ట్రాలలోని రాజకీయ పార్టీలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికపై సెటైర్ లు పేలుతున్నాయి. పార్టీ జాతీయ విధానాలకు భిన్నంగా మాట్లాడిన సోము వీర్రాజుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపిలోని కొందరు బీజేపీ సీనియర్ నాయకులు పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ap bjp leaders fires on Somu Veerraju comments
ap bjp leaders fires on Somu Veerraju comments

 

Somu Veerraju: సోము ప్రసంగంపై సెటైర్ లు

ఏపిలో సీఎం వైఎస్ జగన్ రెండున్నరేళ్ల పాలనపై విజయవాడలో బీజేపీ నిర్వహించిన ప్రజాగ్రహ సభ ఆ పార్టీ ఊహించిన స్థాయిలో విజయవంతం కావడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి సుమారు మూడు వేల మంది హజరయ్యారు. అయితే ఈ సభలో పార్టీ అధ్యక్షుడైన సోము వీర్రాజు తన ప్రసంగంలో పార్టీ విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలపై సూటిగా, స్పష్టంగా మాట్లాడకుండా ఇష్టానుసారంగా ప్రసంగించి పార్టీ పరువు తీశారని ఆ పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు. సోము ప్రసంగంపై వివిధ జిల్లాల నుండి వచ్చిన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారుట. సీపీఐ, వైసీపీ నేతల విమర్శలపైన, ప్రత్యేక హోదాపైన సోము వీర్రాజు అనవసరంగా ఈ వేదికపై మాట్లాడటంతో పాటు కోడిగుడ్డు, చీప్ లిక్కర్ వంటి అంశాలు మాట్లాడి సమయాన్ని వృధా చేశారని ఆ పార్టీ నేతలే అంటున్నారు. సోము వీర్రాజు గంటకు పైగా మాట్లాడటంతో జాతీయ నేత సత్యకుమార్, పురందీశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి వంటి నేతలకు ఎక్కువ సమయం మాట్లాడే అవకాశం దక్కకుండా పోయిందని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. సోము వ్యాఖ్యల అనంతరం సోషల్ మీడియాలో ఆయనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన చీప్ లిక్కర్ అమ్మేలా గ్రాఫిక్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సోము వీర్రాజు టంగ్ స్లిప్

మరో పక్క సోము చేసిన చీప్ లిక్కర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటిఆర్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రం సంధించారు. వావ్ ఏమి పథకం ? ఎంత అవమానకరం ?  చీప్ లిక్కర్ రూ.50లకే అమ్ముతామన్నబీజేపీ జాతీయ విధానం ఏపికేనా లేక నిరాశ అధికంగా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ ఉందా అంటూ కేటిఆర్ ట్వీట్ చేసి బీజేపిని అడ్డంగా ఇరికించారు. సోము వీర్రాజు టంగ్ స్లిప్ కావడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో అనాలోచితంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సోము తీరుపై గతంలోనూ హైకమాండ్ కు ఏపి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆ నేపథ్యంలో ఏపి బీజేపీలో ఏకపక్ష నిర్ణయాలకు స్వస్తిపలికేలా కోర్ కమిటీని పార్టీ హైకమాండ్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు తాజా ఫిర్యాదులతో హైకమాండ్ ఆయనకు తలంటడం ఖాయమని వార్తలు వినబడుతున్నాయి.


Share

Related posts

విశాఖలో పెరుగుతున్న కరోనా కేసులు

Siva Prasad

Mahesh Babu : మహేష్, రామ్ చరణ్ మిస్ చేసుకున్నారు వరుణ్ తేజ్ హిట్ అందుకున్నాడు…!!

sekhar

Kathika Deepam Soundarya: త్వరలో పోలీస్ ఆఫీసర్ గా మనముందుకు వస్తుందట ఫేమస్ అత్తమ్మ ??

Naina