NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Cabinet: ముగ్గురు నానిలు డౌటే..ఔటే..!? వారి ప్లేసులో ఎవరికి ఫిక్స్ చేసినట్టు..!?

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ మార్పులకు సంబంధించి రాజకీయ వర్గాల్లో అనేక చర్చలు జరుగుతున్నాయి. పలు ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ఉగాది నాటికి మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని వైసీపీలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో ముగ్గురు నానిలు ఉన్న సంగతి తెలిసిందే. వీరి గురించి అందరికీ తెలిసిందే. వీరిలో ఆళ్ల నాని. డిప్యూటీ సీఎం మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఈ మంత్రి ఏలూరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో మంత్రి కొడాలి నాని. గుడివాడ నుండి ప్రాతినిధ్యం వహిస్తూ పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ తరువాత మచిలీపట్నం ఎమ్మెల్యేగా ఉన్న పేర్ని నాని. సమాచార, రవాణా, సినిమాటోగ్రఫీ మంత్రి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గురు నానిలు మూడు కీలకమైన శాఖలను నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గురులో ఇద్దరు ఆళ్ల నాని, పేర్నిలు కాపు సామాజికవర్గ కోటా నుండి మంత్రులు అయ్యారు. కొడాలి నాని కమ్మ సామాజికవర్గం. కేబినెట్ మార్పులు జరిగే క్రమంలో ఈ ముగ్గురు మంత్రులుగా కొనసాగుతారా..? వీరి స్థానంలో వేరే వారికి జగన్ అవకాశం ఇస్తారా..? అనేది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా ఉంది.

AP cabinet expansion three Nani's Doute..?
AP cabinet expansion three Nanis Doute

Read More: YS Viveka Case: వైఎస్ సునీత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన సజ్జల.. చంద్రబాబు చేతిలో పావుగా మారిందంటూ సంచలన కామెంట్స్..!!

AP Cabinet: కాపు సామాజికవర్గం నుండి విపరీతమైన పోటీ

కాపు సామాజికవర్గంలో మంత్రులుగా పై ఇద్దరితో పాటు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబులు ఉన్నారు. రెడ్డి సామాజికవర్గంలో నలుగురు మంత్రులు ఉండగా, కాపు సామాజికవర్గం నుండి మాత్రం అయిదుగురు మంత్రులు ఉన్నారు. ఇప్పుడు ఈ అయిదుగురిని పక్కన పెట్టి కొత్తగా మరో అయిదుగురిని తీసుకుంటే బాగుంటుంది అని సీఎం జగన్మోహనరెడ్డి ఆలోచనగా ఉందని అంటున్నారు. ఎందుకంటే కాపు సామాజికవర్గం నుండి చాలా మంది ఎమ్మెల్యేలు వైసీపీలో ఉన్నారు. ఆ సామాజికవర్గం నుండి మంత్రి పదవులు ఇవ్వాలంటే విపరీతమైన పోటీ ఉంది. ఉదాహరణకు తూర్పు గోదావరి జిల్లాలోనే ఇద్దరు రాజాలు ఉన్నారు. ఒకరు జక్కంపూడి రాజా, మరొకరు దాడిశెట్టి రాజా ఉన్నారు. కాపు సామాజికవర్గం నుండి చూసుకుంటే గ్రంధి శ్రీనివాస్, అంబటి రాంబాబు, సామినేని ఉదయభాను, తోట త్రిమూర్తులు ఇలా చాలా మంది ఉన్నారు. ఈ సామాజికవర్గం నుండి అయిదుగురికి మంత్రిపదవులు ఇవ్వాలంటే కేబినెట్ లో ఉన్న అయిదుగురుని బయటకు పంపించాలి.

Read More: YS Viveka: వివేకా కేసులో దారుణ నిజాలు..! వైసీపీకి బిగుస్తున్న ఉచ్చు..?

AP Cabinet: పార్టీలో కీలక బాధ్యతలు..?

పేర్ని నాని అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. వివాదాస్పద అంశాలపై కూడా తెలివిగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని ఢిఫెన్స్ చేసే విధంగా సబ్జెక్ట్‌యే మాట్లాడుతున్నారు. ఉన్న మంత్రుల్లో కాస్త సబ్జెక్ట్ పరంగా వ్యంగ్యంగా మాట్లాడటంలో పేర్ని నాని దిట్ట అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వంపై విమర్శ వచ్చినప్పుడు దానిపై ప్రతి విమర్శలు చేయడం కూడా ఒక కళ. ఆ కళ పేర్ని నానిలో బాగా ఉందని అంటుంటారు. ప్రస్తుతం జగన్ మంత్రి వర్గంలో సబ్జెక్ట్ పై అనర్గళంగా మాట్లాడే నలుగురైదుగురు మంత్రుల్లో పేర్ని నాని ఒకరు. ఇప్పుడు ఆయనను పక్కన పెడితే ఆయన స్థానం భర్తీ చేయడం ఎలా..?. ఇదే జిల్లా నుండి చాలా మంది మంత్రి పదవులను ఆశిస్తున్నారు. పేర్ని నానిని ఒక వేళ పక్కన పెట్టినా మరో కీలకమైన పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే విధంగా ఆళ్ల నాని, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబులను పక్కన పెట్టినా వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

 

AP Cabinet: తలశిల రఘురామ్ లేదా వసంత

ఇక కొడాలి నాని విషయానికి వస్తే కమ్మ సామాజికవర్గం నుండి ఉన్న ఏకైక మంత్రి ఆయన. ఈ సామాజికవర్గం నుండి వైసీపీలో పోటీ ఉంది. అదే జిల్లా (కృష్ణా)లో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అలానే ఇటీవల ఎమ్మెల్సీ ఇచ్చిన తలశిల రఘురామ్ కు మంత్రి పదవి ఇస్తారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. అదే విధంగా ఈ సామాజికవర్గం నుండి మంత్రి పదవులు ఆశిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. మొదటి నుండి జగన్మోహనరెడ్డితో పాటు ఉంటూ జగన్ అన్ని కార్యక్రమాలను దగ్గర ఉండి పర్యవేక్షిస్తూ వచ్చిన తలశిల రఘురామ్ కు మంత్రి పదవి ఇస్తే మాత్రం కొడాలి నానిని బయటకు పంపడం ఖాయమనే మాట వినబడుతోంది. అప్పుడు కొడాలి నానికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ ముగ్గురు నానిలు కేబినెట్ నుండి బయటకు వచ్చేస్తున్నట్లే అన్న ప్రచారం పార్టీలో జరుగుతోంది.

author avatar
Srinivas Manem

Related posts

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri