NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Cabinet: తమ్మినేనికి స్థానం మార్పు.. కానీ..!? కొత్త మంత్రి/ స్పీకర్ ఎవరు..!?

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనా వ్యవస్థ, రాజకీయ వ్యవస్థలో కూడా భారీ ప్రక్షాళన చేయడానికి వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సిద్ధం అవుతున్నారు. ఉగాది నాటికి వైసీపీ క్యాడర్ కూడా ఊహించలేని మార్పులు అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఒకటి మంత్రివర్గ ప్రక్షాళన, మంత్రి పదవుల విషయంలో ఎవరి ఊహాగానాల్లో వారు ఉన్నారు. ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఉన్నారు. మంత్రివర్గ ప్రక్షాళన నేపథ్యంలో ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారామ్ కు మంత్రి వర్గంలో స్థానం లభిస్తుందా.. లేదా.. ఒక వేళ మంత్రి పదవిలో ఆయన స్థానం కల్పిస్తే స్పీకర్ గా ఎవరికి అవకాశం లభించనుంది అనే విషయాలను పరిశీలిస్తే….

 

ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా

తమ్మినేని సీతారామ్ శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆరవ సారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన అంతకు ముందు టీడీపీ తరపున వరుసగా గెలుస్తూ వచ్చారు. ఎన్టీఆర్ క్యాబినెట్ లో ఆ తరువాత చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా పని చేశారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పని చేసిన ఆయన ఆ జిల్లాలో టీడీపీలో అగ్రనేత ఎర్రంనాయుడుతో ఉన్న విభేదాల కారణంగా 2009 లో టీడీపీని వీడి పీఆర్పీలో చేరారు. ప్రజారాజ్యంలో ఓడిపోయిన తరువాత మళ్లీ టీడీపీలోకి వచ్చారు. అయితే టీడీపీలో ఇమడలేక 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తమ్మినేని 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన సీనియర్ నాయకుడు, మంత్రి పదవి ఇవ్వాల్సిన అర్హతలు ఉన్నాయి.

AP Cabinet: ధర్మాన ప్రసాదరావుకు అవకాశాలు తక్కువ

వైసీపీ సర్కార్ లో తమ్మినేనికి మంత్రి పదవి ఇచ్చే అర్హతలు ఉన్నప్పటికీ ప్రధాన అడ్డంకి ఏమిటి అంటే..? అదే జిల్లాలో పక్కనే ఉన్న ధర్మాన ప్రసాదరావు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి ఇవ్వాలంటే కేబినెట్ లో ఉన్న ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ ను తొలగించాల్సి ఉంటుంది. ఒక వేళ కృష్ణదాస్ ను తొలగించి ప్రసాదరావుకు ఇవ్వాలన్నా ధర్మాన కుటుంబానికే పదవులు ఇస్తున్నారనే అపవాదు వస్తుంది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే..? కృష్ణదాసు వైసీపీ ఆవిర్భావం నుండి జగన్మోహనరెడ్డి తో కలిసి అడుగులు వేశారు. ధర్మాన ప్రసాదరావు మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిన్న తరువాత వేరే ప్రత్యామ్నాయం లేక వైసీపీలో చేరారు. ఆయన వైసీపీలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో జగన్మోహనరెడ్డిపై కేసులకు సంబంధించి చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. అందుకే ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు.

AP Cabinet: నాలుగు దశాబ్దాలుగా బద్ద విరోధులు

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే 1980 దశకం నుండి శ్రీకాకుళం జిల్లాలో తమ్మినేని, ధర్మాన ప్రసాదరావులు భద్ద వ్యతిరేకులుగా ఉన్నారు. తమ్మినేని టీడీపీలో క్రియాశీలకంగా ఉండగా, ధర్మాన కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల నేతగా ఉన్నారు. ఇప్పుడు తమ్మినేని సీతారామ్ ను మంత్రివర్గంలో తీసుకుంటే ధర్మాన వర్గం హర్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రసాదరావుకు అవకాశం ఇస్తే తమ్మినేని వర్గం హర్ట్ అవుతుంది. వీళ్ల ఇద్దరికీ ఇవ్వకుండా ధర్మాన కృష్ణదాస్ నే కొనసాగిద్దామని అనుకుంటే తమ్మినేని సీతారామ్ చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు.

 

తమ్మినేని సీతారామ్ కు బెర్త్ కన్ఫర్మ్..?

ధర్మాన, తమ్మినేని లు ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నప్పటికీ దశాబ్దాల కాలంగా బద్ద వ్యతిరేకులుగా రాజకీయాలు చేసినందున వారి మధ్య గ్యాప్స్ అలానే కొనసాగుతున్నాయి. ఒకరికి మంత్రిపదవి ఇస్తే మరొకరిలో అసంతృప్తి కారణం అయ్యే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సీఎం జగన్మోహనరెడ్డి ఏ విధంగా సమస్య పరిష్కరిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం తమ్మినేని సీతారామ్ కు మంత్రివర్గంలో బెర్త్ కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ఒక వేళ తమ్మినేనికి మంత్రి పదవి ఇస్తే డిప్యూటి స్పీకర్ గా ఉన్న కోన రఘుపతికి ప్రమోషన్ ఇచ్చి స్పీకర్ పదవి ఇవ్వనున్నారని వార్తలు వినబడుతున్నాయి. సామాజికవర్గాల సమీకరణల నేపథ్యంలో జగన్మోహనరెడ్డి ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూద్దాం.

author avatar
Srinivas Manem

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju