AP News: యాక్టివ్ అవ్వనున్న మాజీ సీఎం..! త్వరలో ఇంపార్టెంట్ మీటింగ్..?

Share

AP News: ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పని చేసిన ఆ నేత ఇకపై రాజకీయంగా యాక్టివ్ కావాలని యోచిస్తున్నారు. ఆయనకు ఇంకా వయసు అయిపోలేదు.. ఆయనకు రాజకీయలంటే ఆసక్తి కోల్పోలేదు.. ఆయనకు ఏమీ ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల విరక్తి కలగలేదు.. కానీ రాజకీయంగా తప్పుకోవాల్సి వచ్చింది..! తప్పలేదు..! ఆయన ఎవరో ఇప్పుడు అర్ధం అయ్యి ఉంటుంది కదా..?  ఆ నాయకుడే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసి ఎటువంటి అవినీతి ఆరోపణలు, అవినీతి మరకలు లేకుండా స్వచ్చమైన ఇమేజ్ తో తప్పుకున్న నాయకుడుగా కిరణ్ కుమార్ రెడ్డికి పేరు ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో అవినీతి ఆరోపణలు రాలేదు. సంక్షేమ పథకాలు బాగానే అమలు చేశారన్న పేరూ ఉంది. ఆయన హయాంలోనే ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు మీ సేవాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రజాపథం లాంటి మంచి కార్యక్రమాలను నిర్వహించారు. పేద వర్గాలకు కిలో రూపాయి బియ్యాన్ని అమలు చేయడంతో రేషన్ కార్డుదారులకు పలు నిత్యావసర వస్తువులతో సంక్రాంతి కిట్ లను పంపిణీ చేశారు. ఇలా అనేక మంచి పనులు చేసిన పేరు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జవసత్వాలు కోల్పోవడంతో రాజకీయంగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టినప్పటికీ ప్రజలు పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన జరగకుండా కూడా ఆయన కేంద్ర నాయకత్వంతో గట్టిగా పోరాడారు.

AP News: విశాఖ నుండి రాహుల్ గాంధీ..?

ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్ కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అందుకు కారణంగా ఏమిటంటే కాంగ్రేస్ పార్టీ రాష్ట్రంలో ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ క్రమంలో భాగంగా రాహుల్ గాంధీని విశాఖ లోక్ సభ స్థానం నుండి పోటీకి దింపాలన్న ఆలోచన కూడా చేస్తున్నారుట. ప్రస్తుతం 15 మంది మంది సీనియర్ నేతలను ఆ పార్టీ గుర్తించింది. చాలా కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని టీడీపీ లో చేర్చుకుని ఆయనను యాక్టివ్ చేయాలన్న ప్రయత్నంలో చంద్రబాబు ఉండగా.. శైలజా నాథ్, తులసి రెడ్డి వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో వ్యూహాత్మక అడుగులు వేయడానికి సిద్ధం అవుతున్నారని వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం టీడీపీ, వైసీపీలలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు రాహుల్ గాంధీని రాష్ట్రంలోని విశాఖ నుండి పోటీ చేయించడం ద్వారా రాష్ట్రంలో అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ పార్టీని పైకి లేపాలని ప్రయత్నం చేస్తున్నారు.

 

కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో పెద్ద పాదయాత్ర..?

ఇప్పుడు ఆ చర్యలు ఎందుకంటే..? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించింది. రాష్ట్ర విభజన తరువాత ఏపి తీవ్రంగా నష్టపోయింది తప్ప ఏమీ మేలు జరగలేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. ప్రత్యేక హోదా రాలేదు. రాష్ట్రంలో అభివృద్ధి పదంగా చాలా వెనుకబడి పోయింది. ఇవన్నీ తమ తప్పులే కాబట్టి, ఆ పాపాలను మేమే కడుక్కుంటాం, టీడీపీ పాలన చూశారు. వైసీపీ పాలన చూశారు. ఇప్పుడు మాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నాడు ప్రత్యేక హోదాతో సహా ఏవైతే హామీలు ఇచ్చామో అన్నీ తాము నేరవేరుస్తామని ప్రజలకు చెప్పేందుకు కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఓ పెద్ద పాదయాత్రకు సన్నాహం చేయాలని యోచన చేస్తుందట. ఆ పాదయాత్రలో రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారని అంటున్నారు. ఇదే క్రమంలో వైసీపీ, టీడీపీలో ఉన్న పలువురు పూర్వ కాంగ్రెస్ కీలక నేతలు రీ ఎంట్రీ అవుతారని సమాచారం. దీనిపై ప్రస్తుతానికి అధికారిక సమాచారం అయితే వెలువడలేదు కానీ ఢిల్లీ స్థాయిలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది జూన్, జూలై నాటికి కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Share

Related posts

Khiladi : టీజర్‌తో ఖిలాడి వచ్చేస్తున్నాడు..!

GRK

Ayyappanum koshiyum : అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో పవన్ కళ్యాన్ లుక్ లీక్ ..! ఇది మళ్ళీ వాళ్ళే చేశారా ..?

GRK

రామ్ కొత్త దర్శకులని నమ్మడం లేదా ..?

GRK