NewsOrbit
5th ఎస్టేట్ Featured న్యూస్

AP Politics : రాజకీయ “న్యూ”స్ స్ట్రాటజీ.. @ ఏపీ రాజకీయం / తెలుగు మీడియా..!!

AP Politics : News Strategy in Politics

AP Politics : పాపం తెలుగు మీడియా ఏపీలో వార్తలు రాయలేక.., విశ్లేషణలు చేయలేక.., ఒక అంశంపై దృష్టి పెట్టలేక.., ఒక అంశంపై స్పష్టత ఇచ్చేలా డిబేట్లు నిర్వహించలేక.. ఏ రోజు ఏం వివాదం తెరపైకి వస్తుందో తెలియక సతమతమవుతోంది..!! ఏపీ రాజకీయం (AP Politics) తెలుగు మీడియాని గింగిరాలు తిప్పేస్తుంది. ఒక అంశం .., ఒక గొడవ తేలాక ముందే మరో అంశం/ మరో గొడవ తెరపైకి వచ్చేస్తున్నాయి. దీంతో పాత విషయం కనుమరుగైపోతున్నాయి. కొత్త వివాదం రానంత వరకు మీడియాకు పాత అంశాలే దిక్కుగా ఉండేవి. కానీ ఏపీలో మీడియాకు అటువంటి కొరత ఏమి ఉండడం లేదు..!!

Must Read  : షర్మిల పార్టీ తెర వెనుక ప్లాన్ ఎవరు..!?

AP Politics : News Strategy in Politics
AP Politics News Strategy in Politics

మీడియాలో ఇప్పుడు హైలైట్ గా ఉంటున్నవి ఈరోజు షర్మిల పార్టీ, పంచాయతీ ఎన్నికలు.., మొన్న నిమ్మగడ్డ – పెద్దిరెడ్డి మధ్య వివాదం.., మధ్యలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం..! కానీ ఏపీలో వీటికంటే కీలక వివాదాలున్నాయ్. ఏపీని కుదిపేసిన సంఘటనలున్నాయి. వాటిపై ఇంకా స్పష్టత రాలేదు. రాష్ట్రం ఊగిపోయిన ఘటనలు, వివాదాలపై దారిమళ్లింది. ఏపీలో హిందూ విగ్రహాల ధ్వంశం కేసులు ఏమయ్యాయి..!? ఏపీలో రాజధాని గొడవ ఏమైంది..? సుప్రీమ్ ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్ రాసిన లేఖ ఎందుకు ఆగింది..!? వైఎస్ వివేకానందరెడ్డి హత్యా కేసు దర్యాప్తులో తాజా అంశాలు ఏమిటి..!? డాక్టర్ సుధాకర్ కేసు ఎక్కడ వరకు వచ్చింది..!? అంతర్వేది రథం దగ్ధం కేసు ఎక్కడ ఆగింది..!? అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయం లోతు ఏమిటి..!? ఈ మధ్య శిరో ముండనం బాధితుడు మిస్ అయ్యాడు.. అతనికి ఏమైంది..!? తిరుపతి ఉప ఎన్నిక సంగతి ఏమిటి..!? రాయపాటి పై సిబీఐ కేసు గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు..!? ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఏపీలో వివాదాలకు, సంచలన అంశాలకు కొదవేం లేదు. వారానికి రెండు, మూడు వివాదాలు వార్తా వస్తువులుగా మారుతున్నాయి. వాటిని మించేలా మరో వార్త దొరికితే అవి పక్కకు పోతున్నాయి. వీటిలో ఏది ఒక స్పష్టత లేదు, ముగింపు లేదు. అన్నీ దారి మళ్ళాయి. ఇటువంటి మీడియాని నమ్ముకుని.., రాజకీయాన్ని నమ్ముకుని ఎవరన్నా ఏం ఉద్యమం చేయగలరు..!??

Must Read Article : విశాఖ స్టీల్ ప్లాంట్ రాజకీయం నష్టం ఎవరికీ..!?

AP Politics : News Strategy
AP Politics News Strategy

AP Politics : రాజకీయాల్లో కొత్త స్ట్రాటజీ ఇదేనా..!?

ఎస్… ఇప్పుడు ఒక కీలక విషయం చెప్పుకుందాం..! ఇది ఆషామాషీ అంశం కాదు. మీడియాని రాజకీయం ఎలా శాసిస్తుందో తెలుసుకుని.. తద్వారా ఒక వివాదాస్పద వస్తువుని వార్తలుగా మలిచితే.. పాత అంశం డైవర్ట్ అయినట్టే..! అక్కడితో సేఫ్..!!? ఉదాహరణకు గత వారం కిందట వరకు రాష్ట్రంలో హాట్ టాపిక్ హిందూ దేవాలయాల విగ్రహాల ధ్వంశం..! అది మీడియాలో బాగా నలిగి ఒక స్పష్టత వస్తున్న దశలో స్థానిక ఎన్నికల వివాదం వచ్చేసింది. ఇది బాగా నలిగిన సోడాలో మూడు రోజుల కిందట రాష్ట్రంలో హాట్ తాపీ విశాఖ ఉక్కు ఉద్యమం తెరపైకి వచ్చింది. రెండు రోజుల పాటూ మీడియా మొత్తం విశాఖపై పడింది. మొన్న ఈ అంశం పూర్తిగా పక్కన పెట్టేసింది. మొత్తం పంచాయతీ ఎన్నికపై ఫోకస్ పడింది. దీనిలో కూడా నిలకడ లెకమునుపే.., షర్మిల పార్టీ ఏర్పాటుపై మళ్లింది. అంతకు ముందు కూడా ఇళ్ల స్థలాల పంపిణీ పై మీడియా ఫోకస్ ఉన్న సమయంలో రామతీర్ధం దుర్ఘటన జరిగి.. ఎలా దారిమళ్లిందో చూసిందే..!! సో.., మీడియాని శాసిస్తున్నది రాజకీయమే. వివాదమే..! ఇన్ని గొడవల మధ్య రాజధాని రైతుల ఉద్యమం పట్టించుకునే వారు లేరు.., హిందూ ఆలయాల ఘటనలపై ఆలోచించే వారు లేరు.., నిన్నటి నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం కూడా పాతదిగా మారిపోయింది..!!

AP Politics : News Strategy
AP Politics News Strategy

ఈ మీడియాని నమ్మి ఉద్యమం చేయగలరా..!?

దీనిలో యాదృచ్చికంగా జరుగుతున్నవి కొన్ని ఉంటె.. స్ట్రాటజీ ప్రకారం మీడియా ఫోకస్ మళ్లిస్తున్నవి కొన్ని ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఉండడానికి కేంద్రాన్ని దించేలా విశాఖలో ఉద్యమ రూపకల్పన జరుగుతుంది. ఉద్యమానికి మీడియా మద్దతు ఉంటేనే రాష్ట్రం / కేంద్రం స్థాయిలో ఫోకస్ ఉంటుంది. కానీ.. మీడియాకి ఈ ఉద్యమం ఒక ఐటెం మాత్రమే. దీనికి మించిన ఘటన ఇంకోటి ఉంటె దానిపైకి స్పెషల్ డిబేట్లు.., స్టోరీ బోర్డులు తరలిపోతాయి. దేశంలో రైతుల ఉద్యమానికి మొదట్లో మీడియా పెద్దగా పట్టించుకోలేదు. కానీ వారం రోజుల తర్వాత జాతీయ మీడియా మొత్తం ఆ ఢిల్లీ వైపు చూసింది. అంటే ఉద్యమకారులు మీడియాని తిప్పుకున్నారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేయాలంటే ఉద్యమం పీక్స్ లో ఉండాలి. ఈ లోగా మరో గొడవం ఏమి ఉండకూడదు. షర్మిల, నిమ్మగడ్డ, జగన్, బీజేపీ లాంటి వాళ్ళు వార్తల్లో నిలిచేలా వ్యవహరించకూడదు. వాళ్ళు అలా చేస్తే మీడియా డైవర్ట్ అయిపోతుంది. ఉద్యమానికి మద్దతు కొరవడుతోంది. సో.. మొత్తానికి మీడియా మాత్రం రాజకీయం చేతిలో ఉంది అనడానికి ఇంతకంటే ఉదాహరణలు కావాలా..!?

 

 

 

 

 

author avatar
Srinivas Manem

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju