NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Politics: వైసీపీలో బాబు కోవర్టులు..! లోకేష్ తో టచ్ లో ఆ నేతలు..?

AP Politics: రాజకీయాల్లో కోవర్టులు సహజమే..! ప్రతి పార్టీలోనూ ప్రత్యర్ధి పార్టీల కోవర్టులు ఉంటారు. సినిమాల్లో చూస్తుంటాం..! కోవర్టులు అంటే స్లీపర్ సెల్స్. సినిమాలు చూసి నేర్చుకున్నారో.. లేక రాజకీయ వ్యూహాల్లో భాగంగానో ప్రత్యర్ధి పార్టీల్లో కోవర్టులను పంపుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్ట్రాటజీలు, వ్యూహాలు, డ్రామాలు ఎక్కువ కాబట్టి స్లీపర్ సెల్స్, కోవర్టులు ఎక్కువ అయిపోయారు. సాధారణంగా అధికార పార్టీ కోవర్టులు ప్రతిపక్ష పార్టీలో ఉండటం సహజం. అది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు తెలిసింది. ఏరివేత కార్యక్రమం మొదలు పెట్టారు. ఇప్పటికే నలుగురిని సస్పెండ్ చేశారు. ఇప్పటికే పార్టీ ఇన్ చార్జిలుగా ఉన్న 20 మందిపై నిఘా పెట్టారు. వాళ్లను ఏ క్షణమైనా సస్పెండ్ చేసే అవకాశం ఉంది. సో.. టీడీపీలో ఏరివేత కార్యక్రమం జరుగుతోంది.

YS Jagan: CM Risky Games Will Decide..

AP Politics: లోకేష్ , చంద్రబాబుతో సంప్రదింపులు

అయితే అధికార పార్టీలోనూ కోవర్టులు ఉన్నారని టాక్ నడుస్తోంది. అధికార పార్టీలో ఉంటూ ఓ పక్క ప్రతిపక్ష మీడియాలకు సమాచారాలను లీక్ చేస్తూ, నారా లోకేష్ తో, చంద్రబాబుతో సంప్రదింపులు జరుపుతున్న నాయకులు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి సమాచారం అధిష్టానం వద్ద రిపోర్టు ఉన్నట్లు సమాచారం. అందుకే చాలా మంది అధికార పార్టీలోని నాయకులు అంత స్వేచ్చగా ఫోన్ లో మాట్లాడటం లేదట. వాట్సాప్ కాల్స్ అయితేనే మాట్లాడుతున్నారుట. నేరుగా ఫోన్ చేస్తే మాట్లాడకుండా వాట్సాప్ కాల్ చేయమని అంటున్నారుట. అది కూడా వాళ్లు ఐఫోన్ తోనే మాట్లాడతారు. ఎందుకంటే ఐ ఫోన్ ను అంత ఈజీగా టాప్ చేసే అవకాశం గానీ కాల్ రికార్డు చేసే అవకాశం ఉండదు. దానికి సంబంధించి సెక్యురిటీ వ్యవస్థ ఎక్కువ. అందుకే ఫోన్ చేస్తే మీది ఏ ఫోన్ అని అడుగుతారు, ఐ ఫోన్ అయితే నిరభ్యంతరంగా మాట్లాడతారు. సాధారణ ఫోన్ అని చెబితే మాత్రం వాట్సాప్ కాల్ చేయమని చెబుతారు. అందుకే అధికార పార్టీలో కొంత మంది మీద ఈ అనుమానాలు ఉన్నాయని సమాచారం.

ఆ నాయకుడిపై అనుమానాలు

ముఖ్యంగా ఇటీవల మూడు నాలుగు రోజుల నుండి జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే … కృష్ణా జిల్లాలో ఓ నాయకుడిపై అనుమానాలు వచ్చాయట. అందుకే ఆయనపై నిఘా పెట్టగా ఆ నాయకుడు లోకేష్ తో టచ్ ఉన్నట్లు తెలిసిందట. పార్టీలో ఉండడు, వెళ్లిపోతారు అని కన్ఫర్మ్ చేసుకున్నట్లు సమాచారం. ఆ విషయం తెలిసిన తరువాత ఆయనను పార్టీ నుండి బయటకు పంపాలా..? లేక అతన్ని ఇబ్బంది పెట్టి ప్రతిపక్ష పార్టీ నేతలను తింటించాలా..?  అన్న ఆలోచన చేస్తుందట. అతన్ని పార్టీ నుండి తరిమివేయాలంటే తరిమివేయవచ్చు కానీ అతన్ని పిలిచి తప్పు చేశావు కాబట్టి ఆ తప్పు సరిదిద్దుకో, ఆ పార్టీని తిట్టు అని చెప్పడం. ఇదొక స్ట్రాటజీ, వ్యూహం. ఇతను ఒక్కడే కాదు, కొన్ని జిల్లాల్లో ఇంకొందరు ఉన్నారు. పది నుండి 12 మంది నేతలను జగన్ అనుమానిస్తున్నారుట. వీళ్లు పార్టీలో ఉండరు అనే నిర్ణయానికి వచ్చారుట. వాళ్లందరినీ గుర్తించిన పార్టీ అధిష్టానం ఇంకా ఎక్కువ మంది పెరగకుండా ఉండేందుకు సీక్రెట్ ఆపరేషన్ జరుగుతున్నట్లు సమాచారం. అయితే వీళ్లపై ఆరు నెలలు లేదా సంవత్సరం తరువాత సస్పెండ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీ ప్రక్షాళనలో భాగంగా కోవర్టుల గుర్తింపు, గెంటివేతల కార్యక్రమం ఉండవచ్చు. దీనిపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

author avatar
Srinivas Manem

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju