AP Politics: జగన్ బలంపై బాబు ఫోకస్..! ఆ ఓట్ల కోసం టీడీపీ కొత్త ప్లాన్స్..!

Share

AP Politics: ఏపిలో జగన్మోహనరెడ్డి బలాన్ని చంద్రబాబు లాక్కోవడం, కొన్ని స్ట్రాటజీలు, కొన్ని వ్యూహాలు వేసి జగన్మోహనరెడ్డి బలంగా ఉన్న చోట టీడీపీ బలోపేతం చేయడం అంత ఈజీనా..? అసలు జగన్మోహనరెడ్డి బలం ఎక్కడ ఉంది..?  దాన్ని టీడీపీ లాక్కోవడం సాధ్యమా..? కాదా అనే సున్నితమైన అంశాలను పరిశీలన చేస్తే.. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు అవును కాదు అన్నా సామాజికవర్గాల పరంగానే రాజకీయం జరుగుతోంది. కొన్ని సామాజిక వర్గాలు కొన్ని రాజకీయ పార్టీలకు ఫిక్స్ అయ్యాయి. కొన్ని సామాజికవర్గాలు న్యూట్రల్ (తటస్థం)గా ఉంటాయి. కొన్ని సామాజికవర్గాలు ఒక్కో ఎన్నికకు ఒక్కో రాజకీయ నిర్ణయం తీసుకుంటాయి. దురదృష్టవశాత్తు సామాజిక వర్గాల పరంగానే మన రాష్ట్రంలో రాజకీయాలు జరుగుతున్నాయి.

AP Politics ysrcp tdp

AP Politics: వైసీపీకి 70 శాతం పైగా మద్దతు

మన రాష్ట్రంలో కీలకమైన సామాజిక వర్గాల్లో కాపు కమ్యూనిటీ ఒకటి. ఈ వర్గానికి 13 శాతం ఓటింగ్ ఉంది. వీళ్లు తటస్థంగా ఉన్నారు. ఈ వర్గం ఒక్కో ఎన్నికకు ఒక్కో పార్టీకి, వ్యక్తికి సపోర్టు చేస్తుంటుంది. 2019 ఎన్నికలకు ముందు ఈ వర్గంలో సుమారు 70 శాతం వైసీపీకి సపోర్టు చేసింది. మిగిలిన 30 శాతం జనసేన, టీడీపీికి డివైడ్ అయ్యాయి. ఆ తరువాత బీసీ సామాజికవర్గంలో అనేక వర్గాలు ఉన్నాయి. వీళ్లు కూడా గతంలో టీడీపీకి ఉండే వాళ్లు ఆ తరువాత వైసీపీకి మారారు. ఇప్పుడు కొంత న్యూట్రల్ గా మారింది. వైసీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి ఎస్సీ, మైనార్టీ, రెడ్డీ సామాజికవర్గాల్లో 70 శాతం పైగా మద్దతుగా నిలుస్తూ వచ్చింది.

తరచు బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో

టీడీపీ తొలి నుండి బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నందు వల్ల ముస్లిం మైనార్టీ వర్గాలు టీడీపీకి దూరమై వైసీపీకి దగ్గర అయ్యారు. దానికి తోడు వైఎస్ఆర్ హయాంలో ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు ఇతర పథకాలు తీసుకురావడంతో ఈ వర్గం జగన్ కు సపోర్టుగా నిలుస్తోంది. 70 శాతం పైగా వైసీపీకి మద్దతుగా ఉన్న ఈ వర్గాల్లో టీడీపీ పాగా వేయడం సాధ్యమా…అంటే కొంత కష్టమే. టీడీపీకి మద్దతు ఇచ్చే సామాజికవర్గాల్లో కమ్మ, వెలమ, క్షత్రియ, ఆర్యవైశ్య ఉన్నాయి. అలానే బీసీల్లో కొన్ని ఉప కులాలు, కాపుల్లో కొంత టీడీపీకి మద్దతు ఇస్తూ వస్తున్నాయి. సామాజిక వర్గ పరంగా చూసుకుంటే టీడీపీ కంటే వైసీపీకే ఎక్కువ.

AP Politics: వైసీపీకి బలంగా ఉన్న ముస్లిం సామాజిక వర్గాన్ని

అయితే వైసీపీకి బలంగా ఉన్న ముస్లిం సామాజికవర్గాన్ని దూరం చేయడం కోసం టీడీపీి ఓ రాజకీయ ఎత్తుగడ వేసిందని అంటున్నారు. అది ఏమిటంటే.. కేంద్రంలోని బీజేపీతో వైసీపీ మద్దతు ఇస్తొందనీ, కీలకమైన బిల్లులు పాస్ అయ్యేందుకు రాజ్యసభలో వైసీపీ మద్దతు ఇస్తోందని తెలియజేయడంతో పాటు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన రంజాన్ తోఫాను వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇవ్వడం లేదని చెబుతోంది. వీటికి తోడు ముస్లిం బాలికల వివాహ సమయంలో ఇచ్చే నగదు ప్రోత్సాహకాలను అందజేయడం లేదని చెప్పనుంది. ప్రభుత్వం పలు కార్పోరేషన్లు అయితే ఏర్పాటు చేసింది కాని వాటి వల్ల మేలు ఏమి జరగడం లేదని ప్రచారం చేయనున్నది. అయితే టీడీపీకి దూరమైన వర్గాలను దగ్గరకు చేసుకునే ప్రయత్నంలో ఆ పార్టీ ఉందట.


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

44 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

2 గంటలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

4 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

5 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

5 గంటలు ago