NewsOrbit
5th ఎస్టేట్ Featured న్యూస్

తెలుగు మీడియాకి కొత్త రంగు..! సిద్ధమైపోండి ఇక అరుపులే..!!

మొన్ననే ఒక వార్తలో చెప్పుకున్నాం… తెలంగాణాలో రాజ్ న్యూస్ అనే ఛానెల్ వచ్చేసింది.., టీవీ 9 రవి ప్రకాష్ ఆధ్వర్యంలో నడుస్తుంది అని..! అప్పుడే ఇంకో మాట కూడా చెప్పుకున్నాం.., కషాయానికి ఒకటి కాదు, మరో రెండు, మూడు చానెళ్లు చూస్తుంది అని..! అదే ఇది. తెలుగులో మీడియాకి రోజులు మారాయి. రాజకీయాలకు రోజులు మారాయి. ఎవరి సొంత మీడియా డప్పు వారికి ఉండాల్సిందే. ఎదుటి వాడ్ని తిట్టడానికి ఒక మీడియా మైక్ ఉండాల్సిందే. లేకపోతే నాయకుడి బండి నడవదు. అందుకే టీడీపీకి ఏబీఎన్, ఈనాడు, టీవీ 5 లాంటివి ఉన్నాయి. వైసీపీకి సాక్షి, ఇంకొన్ని ఉన్నాయి. తెలంగాణాలో కేసీఆర్ కి టీ న్యూస్, నమస్తే తెలంగాణ ఉన్నాయి. మరి బీజేపీకి పాపం తక్కువయ్యాయి.

ఇదీ చదవండి :

ఇక కాషాయ చానెళ్లు..! తెలుగులో మీడియా సంస్థల కోసం బీజేపీ ప్లాన్..!!

అర్నాబ్ వస్తున్నట్టే లెక్క..!!

తెలుగు మీడియాలో ఇప్పటి వరకు ఓ లెక్క. ఇప్పటి నుండి మరో లెక్క. ఆ టీవీ 5 మూర్తి.., ఏబీఎన్ వెంకట కృష్ణ, టీవీ 9 రజని కాంత్ .., సాక్షి కొమ్మినేనిలకు అరుపుల్లో ఆద్యుడు అర్నాబ్ గోస్వామి. ఆయనో వింత జర్నలిస్టు. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ గా ఉన్న అర్నాబ్ ని గత వారమే శివసేన పోలీసులు అరెస్టు చేసారు. శివసేనకు, అర్నాబ్ కి కొన్ని కయ్యాలున్నాయ్.. అందుకే అరెస్టు చేసారు, కోర్టు బెయిలిచ్చింది. ఆ కక్షని అర్నాబ్ ఇలా తీర్చుకోబోతున్నాడు. ఆ అరెస్టుతో కొంచెం పోగైన సింపతిని ఇలా వాడుకుందామని ప్లాన్ వేసినట్టున్నాడు. దేశ వ్యాప్తంగా మరో పది భాషల్లో రిపబ్లిక్ టీవీ విస్తరించనున్నట్టు అర్నాబ్ అధికారికంగా ప్రకటించేశాడు. మరి రిపబ్లిక్ టీవీ అంటేనే బీజేపీ, అర్నాబ్ అంటే బీజేపీ గొంతు. సో.., బీజేపీకి తెలుగులో ఒక ఛానెల్ రాబోతున్నట్టే లెక్క..!

బీజేపీకి సుదీర్ఘ లక్ష్యాలు..!

బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఉత్తర ప్రదేశ్, గుజరాత్ పైన ఉంటె.., ఏపీ కింద ఉంటుంది. సో.., ఏపీలో ఆ పార్టీ ఎదగాలి అంటే తమ వాని బలంగా వెళ్ళాలి. తమ గుప్పిట్లో మీడియా మైకులు ఉండాలి. తమకు డప్పులు వాయించాలి. ఇప్పుడున్న ఎల్లోలు, బ్లూలుతో పని జరగడం లేదు. అందుకే కాషాయ ఛానెల్ పెట్టాలనేది బీజేపీకి ఎప్పటి నుండి కోరిక ఉంది. అందుకే పనిలో పనిగా రిపబ్లిక్ టీవీని ముందుగా తెలుగులోనే ఆరంభించనున్నట్టు సమాచారం. తెలుగులో పడిపోతున్న ఒక పాత ఛానెల్ ని కొనేసి.. రిపబ్లిక్ అనే ట్యాగ్ తగిలించి కాషాయం రంగు వేస్తారా..? లేదా కొత్తగా మొదటి నుండి స్టార్ట్ చేస్తారా అనేది ప్రస్తుతానికి మాత్రం అనుమానమే. రాజ్ న్యూస్ ద్వారా కేసీఆర్ ని రవిప్రకాష్ ఆడుకుంటాడు. ఆల్రెడీ ఆరంభించాడు. తెలంగాణాలో మరో ఛానెల్ పెట్టించి.. ఏపీలో అర్జంటుగా రిపబ్లిక్ ని దించాలి అనేది బీజేపీ పెద్దల వ్యూహమాట. అందుకే ఇటీవల తెలుగు రాష్ట్రాల నేతల మధ్య అంతర్గతంగా మీడియా గురించి మాటలు వచ్చినప్పుడు… మార్చి వరకు ఓపిక పట్టండి అంటూ పెద్దలు చెప్పుకొచ్చారట.

 

 

author avatar
Srinivas Manem

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju