KBR attack: హైదారాబాద్ మరో దారుణం.. KBR పార్క్ వద్ద సినీ హీరోయిన్ పై అటాక్..

Share

KBR attack: చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న నటీనటులకు సేఫ్టీ కొంచెం తక్కువే అని చెప్పుకోవచ్చు. ఒక్కోసారి ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చాక చుట్టూ భద్రత లేకపోతే వారి పట్ల కొందరు వింతగా ప్రవర్తిస్తారు. ఇక ఏదైనా ఈవెంట్, మాల్స్ ఓపెరింగ్ సందర్భంగా అభిమానుల కంట పడితే ఇక అంతే. ఫోటోల కోసం ఒక్కసారిగా మీద పడిపోతారు. ఇటువంటి టైంలో చుట్టూ సెక్యూరిటీ లేకపోతే నెక్ట్స్ మినట్ ఆస్పత్రి బెడ్ మీద దర్శనం ఇవ్వాల్సిందే.

AP Municipal Elections 2021: కుప్పంలో దొంగ ఓట్ల కలకలం..! పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత..!!
పెరిగిపోతున్న పోకిరీల ఆగడాలు..

సెలబ్రిటీలకు రానురాను పోకిరీల బెడద ఎక్కువవుతోంది. ఈ మధ్య పోకిరీలు సోషల్ మీడియా (social media) వేదికగా హీరోయిన్లను వేధిస్తున్నారు. లైవ్ లో తక్కువే అని చెప్పువచ్చు. కారణం సెలబ్రిటీల చుట్టూ పర్సనల్ బాడీ‌గార్డ్స్ నిత్యం వారికి రక్షణగా నిలుస్తున్నారు. ఒకప్పుడు సెలబ్రిటీలపై దాడులు పెరగడం, ఆడియో ఫంక్షన్స్‌లో ఫ్యాన్స్ మీద పడటంతో అప్పట్లో కొందరికి గాయాలు కూడా అయ్యాయి. దీంతో వారు బహిరంగ ప్రదేశాలు, షూటింగ్ స్పాట్స్‌లో(shooting spots) కూడా బాడీ గార్డ్స్‌ను వెంట బెట్టుకుంటున్నారు. ఆ మధ్యలో రామ్‌చరణ్, ఉపాసన కారును కొందరు పోకిరీలు ఫాలో అయ్యారు. హీరోయిన్లను కూడా అసభ్యంగా తాకడాలు, బట్టలు లాగేయడం వంటి వార్తలు కూడా అనేకం వచ్చాయి. తాజాగా నగరంలో బాగా రిచ్ పీపుల్ ఉండే ఏరియా అయిన కేబీఆర్ పార్క్(KBR park) వద్ద ఓ హీరోయిన్‌పై దుండగుడు అటాక్ చేశాడు.

Radhe shyam: పీరియాడికల్ వింటేజ్ లవ్‌స్టోరిగా ప్రభాస్ రాధే శ్యామ్..హిట్ అయితే అందరూ ఇదే ఫార్ములా ఫాలోవుతారేమో..!

ఈవినింగ్ వాక్ వెళ్లిన చౌరాసియాపై..

సినీ నటి చౌరాసియా ఈవినింగ్ వాక్‌‌కు వెళ్లిన టైంలో గుర్తుతెలియని దుండగుడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. నటి సెల్‌ఫోన్ లాక్కుని పారిపోయాడు. నిన్న రాత్రి 8:30 గంటల ప్రాంతంలో కేబీఆర్‌ పార్క్‌ వద్ద ఈ ఘటన వెలుగుచూసింది. దాడి నుంచి తేరుకున్న నటి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. బంజారా హిల్స్ పోలీసులు(police) అక్కడకు చేరుకున్నారు. బాధిత నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ దాడిలో ఆమెకు గాయాలైనట్టు తెలుస్తోంది.


Share

Related posts

Corona Vaccine: ఏపీ టీకాల్లో తిక్క తిక్క పనులు..! ఇదేమి లెక్క బాసూ..!?

Srinivas Manem

నందమూరి అభిమానులకు జోష్ ఇవ్వటానికి ముహూర్తం ఫిక్స్ చెయ్యబోతున్న బాలయ్య..??

sekhar

గుంటూర్ లో కరోనా గురించి ప్రజలకు అవగాహన కల్పించిన ఆర్‌టి‌సి ఉద్యోగులు

Siva Prasad