NewsOrbit
5th ఎస్టేట్

టీఆర్పీ కుంభకోణం..! బార్క్ సంచలన నిర్ణయం..!!

barc sensational decision over trp ratings

మీడియా విస్తృతి పెరిగాక వార్తా సంస్థలు, ఎంటర్ టైన్మెంట్ చానెల్స్, భక్తి చానెల్స్.. ఇలా ప్రతి విభాగానికి ప్రత్యేకంగా కార్యక్రమాలు పెరిగాయి. ప్రజలు కూడా టీవీ కార్యక్రమాలకు బాగా అలవాటు పడ్డారు. దీంతో పుట్టగొడుగుల్లా పెరిగిపోయిన చానెల్స్.. అందులో వచ్చే కార్యక్రమాలకు దక్కే ప్రేక్షకాదరణను నిర్ధారించేదే ‘టీఆర్పీ రేటింగ్స్’. ఏ కార్యక్రమాన్ని ఎంతమంది వీక్షించారనేదానిపై టీఆర్పీ రేటింగ్ ఆధారపడి ఉంటుంది. వీటి కోసమే చానెల్స్ పోటీ పడతాయి కూడా. దేశంలో జరిగే ఎన్నో మోసాల్లో ఇదొకటి అని చానెల్స్ లైట్ తీసుకున్నాయో ఏమో.. ఇప్పుడు ఈ టీఆర్పీ రేటింగ్స్ లో కూడా మోసాలు జరగడం సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో బార్క్ తీసుకున్న ఒక నిర్ణయం దేశవ్యాప్తంగా మీడియా చానెల్స్ ను హడలెత్తిస్తోంది.

barc sensational decision over trp ratings
barc sensational decision over trp ratings

ఆరోపణలు వచ్చింది ఈ చానెల్ పైనే..

రిపబ్లిక్ చానెల్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ అర్ణబ్ గోస్వామి డిబేట్స్ ఇండియో మొత్తంలో పాపులర్. ‘వార్తలపై, వ్యక్తులపై విరుచుకు పడిపోవడం..’ అనే మాటకు ఈయన సరిగ్గా సరిపోతాడు. సుశాంత్ ఆత్మహత్య, రియా డ్రగ్స్, కంగనా రనౌత్ వ్యాఖ్యలు.. వీటిపై రోజుల తరబడి, అనేక గంటలపాటు లైవ్ డిబేట్స్ నిర్వహించారు. ఇప్పుడు ఈ చానెల్ టీఆర్పీ రేటింగ్స్ లో అవకతవకలకు పాల్పడిందని ఆరోపణలు రావడం.. పోలిస్ కేసు నమోదవం అర్ణబ్ గోస్వామి డిబేట్స్ కంటే సంచలనం రేపింది. ఇదో పెద్ద కుంభకోణం అని ముంబై పోలిసులు వ్యాఖ్యానించి రిపబ్లిక్ చానెల్ తోపాటు మరో రెండు చానెల్స్ పై కేసు కూడా పెట్టారు. దీనిపై సుప్రీంకు వెళ్లిన రిపబ్లిక్ టీవీకి షాక్ ఇచ్చింది సుప్రీం. ముందు బాంబే హైకోర్టులో పిటిషన్ వేసుకోవాలని సూచించింది. నేరుగా సుప్రీంకు రావడం తగదని తేల్చి చెప్పింది.

టీఆర్పీ రేటింగ్స్ కు బ్రేక్..

టీఆర్పీ రేటింగ్స్ చానెల్స్ అవకతవకలకు పాల్పడుతున్నాయనే నేపథ్యంలో బ్రాడ్‌కాస్ట్‌ ఆడియెన్స్‌ రీసెర్చి కౌన్సిల్‌ (బార్క్‌) స్పందించింది. మూడు నెలల పాటు దేశంలోని ఏ చానెల్ కు రేటింగ్స్ ప్రకటించబోమని స్పష్టం చేసింది. రేటింగ్స్ లో ప్రమాణాలను పరిశీలించి సరికొత్త టెక్నాలజీతో సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రణాళికలు వేస్తామని ప్రకటించింది. బార్క్ నిర్ణయానికి న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ) మద్దతు తెలిపింది. మరోవైపు.. ప్రస్తుత టీఆర్పీలను సులభంగా మార్చవచ్చని అధునాతన టెక్నాలజీ అవసరమని అధికారులు ఐటీ పార్లమెంటరీ ప్యానల్‌కు వివరించారు.

 

author avatar
Muraliak

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau