బీజేపీ వెనుక “మీడియా” బుర్ర..! సైలెంట్ గా చక్కబెడుతున్న టీవీ 9 రవిప్రకాష్..!?

బీజేపీది అధికార ఆకలి..! టీవీ 9 రవిప్రకాష్ ది ప్రతీకార దాహం..! ఈ ఇద్దరూ కలిసి టీఆరెస్ ని పడగొట్టాలి. కేసీఆర్ ని దించాలి. కేటీఆర్ కి భవిష్యత్తు లేకుండా చేయాలి అనే ఏకైక లక్ష్యం పెట్టుకుని పని చేస్తున్నారు..! ఇది ఎంత వరకు ఫలిస్తుందో ఇప్పుడే అంచనా వేయలేం కానీ.., బీజేపీ అమలు చేస్తున్న వ్యూహాలు మాత్రం గతం కంటే భిన్నంగా… ఘాటుగా ఉన్నాయి. హైదరాబాద్ ఎన్నికలు అంటే గరిష్టంగా ఐదో, ఆరో డివిజన్లలో మాత్రమే గట్టి పోటీ ఇచ్చే బీజేపీ ఇప్పుడు అరవై స్థానాల్లో గట్టి పోటీ ఇస్తుంది అంటే అది ఆ పార్టీలో కసిని, ప్రణాళికని, వ్యూహాన్ని తెలియజేస్తుంది. బీజేపీ వెనుక ఎవరున్నారు..? ప్రజాప్రయోజన మ్యానిఫెస్టో తయారీతో పాటూ.. మీడియాలో హైలైట్ అవుతున్న పాయింట్లు మాట్లాడడంలో ఎవరు సహకరిస్తున్నారు..? అనే ప్రశ్నకు ఏకైక సమాధానం టీవీ 9 రవి ప్రకాష్.

బీజేపీకి రవికి గట్టి బంధం..!!

తెలంగాణాలో పాగా వేయాలనేది బీజేపీ లక్ష్యం. అందుకే దుబ్బాక ఎన్నికను చాలా సీరియస్ గా తీసుకుంది. గెలిచినా ఉత్సాహంతో గ్రేటర్ కి సిద్ధమైంది. గ్రేటర్ లో కూడా బీజేపీ మహా మహులు చేత ప్రచారం చేయిస్తుంది. బీజేపీ ఎన్ని చేసినా.. ఇప్పుడు మేయర్ పీఠం దక్కకపోవచ్చు.., ఇప్పుడు గట్టిగా పోరాడితే 30 స్థానాలు దక్కవచ్చు.. కానీ 2024 నాటికి బీజేపీ ఒక అతీత శక్తిగా అవతరించడం మాత్రం ఖాయం. టీఆరెస్ ని తొక్కేయడం మాత్రం ఖాయం. అందుకే టీఆరెస్ ని ఓడించాలి.. కేసీఆర్ శతృవులను తమతో కలుపుకోవాలి. దానిలో భాగంగా మీడియా పరంగా కేసీఆర్ శత్రువుగా ఉన్న టీవీ 9 రవి ప్రకాష్ బీజేపీకి ఇప్పుడు తరుపుమొక్కగా మారారు. మీడియా అధినేతగా.., రాజకీయ బుర్ర బలంగా ఉన్న జర్నలిస్టుగా.., కేసీఆర్ బలహీనతలు బాగా తెలిసిన రవి ప్రకాష్ ఇప్పుడు రాజ్ న్యూస్ లో చేరారు. ఈ రాజ్ న్యూస్ బీజేపీ వాళ్లదే. అందుకే రవి కూడా బీజేపీతో కలిసిపోయారు. టీఆరెస్ ఓటమి, కేసీఆర్ పతనంలో తన పాత్ర ఉండాలనేది రవి లక్ష్యం. అందుకే గ్రేటర్ లో బీజేపీకి చేయాల్సింది అంతా చేస్తున్నారు. రాజ్ న్యూస్ లో టీఆరెస్ వ్యతిరేక ప్రచారంతో పాటూ.. కేసీఆర్ సర్కారు గడిచిన ఆరేళ్లలో హైదరాబాద్ లో ఏమి చేయలేదు అని ఒక అభిప్రాయం కలిగేలా రాజ్ న్యూస్ లో కథనాలు వండి వారుస్తున్నారు. వీటితో పాటూ…!

మ్యానిఫెస్టో.. మీడియా..!!

బీజేపీ మ్యానిఫెస్టో ప్రత్యేకంగా నిలిచింది. ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం అసాధ్యమే కానీ.., అవన్నీ జనాలకు నచ్చిన హామీలే. అందుకే వీటిని రూపొందించడంతో బీజేపీకి రవి ప్రకాష్ పూర్తిగా సహకరించారు. కిషన్ రెడ్డి రాజకీయ శిష్యుడు జయప్రకాశ్ నారాయణ్ తో పాటూ టీవీ 9 రవి ప్రకాష్ కూడా రెండు నెలల పాటూ మంచి కసరత్తు చేసి.. క్షేత్ర పరిశీలనా అనుభవాలతో ప్రజలకు బాగా చేరువయ్యే మ్యానిఫెస్టో రూపొందించారు. దీంతో పాటూ రవికి బాగా తెలిసిన మీడియా మేనేజ్మెంట్.. మీడియాలో హైలైట్ అయ్యేలా ప్రచారం చేయడం.., సమయం చూసుకుని మాట్లాడడం.. ప్రచార సరళి.. తదితర అంశాలపై రవి ప్రకాష్ బీజేపీకి పూర్తిగా సహకారంగా ఉంటున్నారు. అందుకే గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ నిర్వహిస్తున్న కొన్ని కీలక అంతర్గత సమావేశాలకు కూడా రవి ప్రకాష్ ప్రత్యేక ఆహ్వానితుడిగా వెళ్తున్నారు.