NewsOrbit
5th ఎస్టేట్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా చాపకింద నీరులా బీజేపీ విస్తరించింది.. దేశంలో బలమైన ప్రత్యర్థులను బలహీనపర్చి.. బలహీన ప్రత్యర్థులను లొంగదీసుకుని.. లొంగిపోయిన ప్రత్యర్థులను బొమ్మల్లా ఆడిస్తూ.. దేశంలో కొత్త రాజకీయ శకానికి ఆరంభం పలికింది..! అటువంటి బీజేపీ బలం, బలగం ఉత్తర భారతాన ఉన్నంతగా దక్షిణాన లేవు.. అందుకే ఇప్పుడు దక్షిణ భారతంలో బీజేపీ బలం పుంజుకునే భారీ ప్రణాళికలు వేస్తుంది.. దక్షిణాన కర్ణాటక మినహా.., ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ బలం పెద్దగా లేదు. అందుకే తెలంగాణాలో అధికారంలోకి వస్తే.. ఆ గాలి, ఆ బలంతో ఏపీ, కేరళ, తమిళనాడులో కొంత పుంజుకోవచ్చనే బీజేపీ ఆశలు నెరవేర్చుకునే పనిలో పడింది.. తెలంగాణాలో అయిదు భారీ ప్రణాళికలు ద్వారా కేసీఆర్ ని ముప్పుతిప్పలు పెట్టేందుకు రంగం సిద్ధం చేసిందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది..!

ఆ వైరం భారీ స్థాయికి..!

తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీకి మధ్య వైరం తారా స్థాయికి చేరుకుంది. ఎలాగైనా సరే రాష్ట్రంలో టీఆర్ఎస్ ను అధికారంలో నుండి దించేసి బీజేపీ అధికారంలోకి రావాలనేది ఆ పార్టీ పెద్దల వ్యూహం. తెలంగాణ ద్వారా పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచనలో బీజేపీ ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటక మినహా ఏ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకూ బీజేపీ పప్పులు ఉడకడం లేదు. తెలంగాణలో అధికారంలోకి వస్తే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లోనూ పాతుకుపోవచ్చు, నెమ్మదిగా తమిళనాడు, కేరళలో ఓటింగ్ పెంచుకోవాలన్నది ఆ పార్టీ ఆలోచనగా ఉంది. ఇప్పటి వరకూ ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉంది. ఇప్పుడు తెలంగాణలో వారు అధికారంలోకి రావడానికి వేస్తున్న ఎత్తులు ఏమిటి..? ఒక వేళ ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాలు పోయినా దక్షిణాదిలో బలోపేతం అవ్వడం వల్ల కేంద్రంలో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవచ్చు అనేది బీజేపీ వ్యూహం. ఇప్పుడు తెలంగాణలో అయిదు పకడ్బందీ ప్రణాళికలతో వాళ్ల చేతిలో ఉన్న వ్యవస్థలతో, వాళ్ల చేతిలో ఉన్న అధికారంతో బీజేపి పవర్ గేమ్స్ ప్లాన్ చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసిఆర్ ను అధికారంలో నుండి దించి బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అయిదు ఎత్తుగడలు సిద్దం చేసుకుంది. అయితే అవి ఏమిటి..? వాటి ఫలితం ఎలా ఉంటుంది..? అనేది తెలియాలి అంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.

త్రిముఖ పోటీ నుండి.. ద్విముఖానికి..!

తెలంగాణలో ఇప్పుడు త్రిముఖ పోటీ ఉంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ నడుస్తొంది. మూడు పక్షాలు బలంగానే ఉన్నాయి. వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది కాబట్టి టీఆర్ఎస్ మిగిలిన రెండు పార్టీల కంటే బలంగా ఉండే అవకాశం ఉంది. గతంలో అధికారంలో ఉండి శాంసించింది కాబట్టి కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉండవచ్చు. కేంద్రంలో వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్నందున రాష్ట్రంలో బీజేపీ పుంజుకుని రెండో స్థానానికి వచ్చేయవచ్చు. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న బీజేపీ అధికారంలోకి రావడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి..? అనేది ఒక సారి పరిశీలిస్తే..


ప్లాన్ నెం – 1: కాంగ్రెస్ ని చీల్చి రేవంత్ ని ఒంటరి చేయడం..!

కాంగ్రెస్ పార్టీని చీల్చడం. ఆ పార్టీ శ్రేణులను కకావికలం చేయడం. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్ ల మధ్య అగాధం సృష్టించడం. కాంగ్రెస్ లో చీలిక తీసుకువచ్చి ప్రజల్లో పట్టు ఉన్న నాయకులను రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మార్చి పార్టీ నుండి బయటకు వచ్చేలా చేయాలి. పార్టీ నుండి సైలెంట్ గా బయటకు వచ్చి బీజేపీ చేరితో పని కాదు. రేవంత్ రెడ్డిని తిట్టాలి, రేవంత్ రెడ్డిని విమర్శించాలి, కాంగ్రెస్ పార్టీలో విభేధాలు సృష్టించాలి ఇది బీజేపీ లక్ష్యం. ఇప్పటికే కాంగ్రెస్ లో రెండు మూడు వర్గాలు ఉండగా, వాటిని ఇంకా పెరిగేలా చేసి అవసరమైనప్పుడు వాళ్లను పార్టీలో చేర్చుకోవాలి. పార్టీలో చేర్చుకోనప్పటికీ కాంగ్రెస్ లోనే వాళ్లను ఉంచి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడించాలి. ఇవన్నీ బీజేపీ మొదటి ప్లాన్ లో భాగం. ప్రస్తుతం రాష్ట్రంలో మూడవ స్థానంలో ఉన్న బీజేపీ ఏకంగా మొదటి స్థానంలోకి రావడం కష్టం. అందుకు రెండవ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి ఆ స్థానంలోకి రావాలి. ఆ తరువాత మొదటి స్థానం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తుంది. అందులో భాగంగానే రెండవ ప్లేస్ లో ఉన్న కాంగ్రెస్ ను బీజేపీ టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రావణ్ లతో రాజీనామా చేయించింది. దాసోజు శ్రావణ్ ను ఇప్పటికే పార్టీలో చేర్చుకోగా, రాజగోపాల్ రెడ్డి కొద్ది రోజుల్లో పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద నాయకులను చేర్చుకునేందుకు ప్లాన్ చేసింది. వీటి ఫలితంగా రేవంత్ రెడ్డిని ఒంటరిని చేయవచ్చు, కాంగ్రెస్ పార్టీని బలహీన పర్చవచ్చు.

ప్లాన్ నెం – 2: వ్యవస్థలతో ముప్పేట దాడి..!

కేంద్రంలో అధికారంలో ఉన్నందున సీబీఐ, ఈడీ, ఐటి లాంటి వ్యవస్థ లను ఉపయోగించి గీత దాటే వాళ్లను, పార్టీని ఇబ్బంది కల్గించే వాళ్లను ముప్పుతిప్పలు పెట్టి లోబర్చుకునే యత్నం చేస్తుంది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే 2019 ఎన్నికలకు ముందు ఏపిలో టీడీపీ నాయకులపై ఐటీ రైడ్స్ జరిగాయి. ఇప్పుడు తెలంగాణలోనూ టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల ఆస్తులపై ఐటీ రైడ్స్ జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈడీ కేసులు నమోదు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. సో.. ఈ వ్యవస్థల ద్వారా రాజకీయాలను కంట్రోల్ చేయడం. దీని వల్ల టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీకి ఆర్ధిక స్తంబాలుగా ఉన్న నేతలను ఇరుకున పెట్టడంతో వారు సైలెంట్ అవుతారు. జూపల్లి రామేశ్వరరావు, మేఘా కృష్ణారెడ్డిలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇలా కార్పోరేట్ శక్తులపై ఈడీ నిఘా పెడితే వారు సైలెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గతంలో టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న జూపల్లి రామేశ్వరరావు ఇప్పుడిప్పుడే వెనక్కు మళ్లుతున్నారు. బీజేపికి సపోర్టుగా మారుతున్నారు. మేఘా కృష్ణా రెడ్డితో పాటు మరి కొందరిని కంట్రోల్ చేస్తే టీఆర్ఎస్ ఆర్ధిక మూలాలను దెబ్బకొట్టవచ్చు. అప్పుడు కేసిఆర్ కు కష్టమవుతుంది.

ప్లాన్ నెం – 3: టీడీపీతో అవగాహనా పొత్తు..!?

తెలంగాణలో టీడీపీతో పొత్తు. తెలంగాణలోని 12 నుండి 15 నియోజకవర్గాల్లో పదివేలకు పైగా ఓట్ బ్యాంక్ ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో 25వేలకు పైగా కూడా ఓటు బ్యాంక్ ఉంది. కుత్‌బుల్లాపూర్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, ఖారితాబాద్, జూబ్లిహీల్స్, ఖమ్మం, సత్తుపల్లి తదితర నియోజకవర్గాల్లో టీడీపీ ఓటు బ్యాంకు ఉంది. తెలంగాణలో టీడీపీకి 3 – 4 స్థానాలు పొత్తులో భాగంగా ఇస్తే ఇతర నియోజకవర్గాల్లో టీడీపీకి 2-3 శాతం ఉన్న ఓటు బ్యాంక్ బీజేపీకి కలిసి వస్తుందన్న ఆలోచన కూడా ఉంది. దీని వల్ల బీజేపికి రాజకీయ ప్రయోజనం ఉంటుంది. టీడీపీ కూడా వాళ్లకు ఉన్న అవసరాలు, కష్టాల మేరకు బీజేపీకి తలొగ్గే అవకాశాలు ఉన్నాయి.

ప్లాన్ నెం – 4: ఎంఐఎంని వాడేసుకోవడం..!

ఇది అన్నింటి కంటే ముఖ్యమైనది, నమ్మశక్యం కానిది. ఎంఐఎం పార్టీ పక్కా ముస్లిం భావజాల పార్టీ. ముస్లిం పార్టీ అంటే యాంటీ బీజేపీ అని అందరూ అనుకుంటారు. కానీ ఎంఐఎం పార్టీని కూడా తమ రాజకీయ అవసరాలకు వాడుకోవడంలో బీజేపీ ఆరి తేరింది. ఉదాహారణకు 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ఒక సారి పరిశీలిస్తే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా చీలి ఆర్జేడీకి, కాంగ్రెస్ కి వెళ్లకుండా ఆ ఓట్లు ఎంఐఎంకు వచ్చేలా ఎంఐఎంను తెరవెనుక నుండి ప్రోత్సహించి బీహార్ లో పోటీ చేయించడంలో కొన్ని శక్తులు ఉన్నాయి. ఇలా బీహార్ లో పోటీ చేసి ఎంఐఎం అయిదు స్థానాలు గెలుచుకుంది. అటువంటి ఎంఐఎం తెలంగాణలో ఏడు, ఎనిమిది స్థానాలకే పరిమితం అయ్యింది. హైదరాబాద్ లో చార్మినార్, ఫలన్ నామా, ఓల్డ్ సిటీ ఏరియాకే పరిమితం అయ్యింది. అటువంటి ఎంఐఎంను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి. నిజామాదాబాద్ జిల్లాలో నిజామాబాద్ సిటీ, ఆర్మూరు, కామారెడ్డి, మహబూబా బాద్, కరీంనగర్ లాంటి నియోజకవర్గాల్లో ముస్లిం ఓటు బ్యాంక్ 25వేలకు పైగా ఉంటుంది. ఆయా నియోజకవర్గాల్లో తెరవెనుక ప్రయత్నాలతో ఎంఐఎంను దించడం ద్వారా టీఆర్ఎస్ ఓటు బ్యాంకు చీలి ఎంఐఎంకు ఓటింగ్ పడుతుంది. ఇదే క్రమంలో హిందూ ముస్లిం వివాదాలు సృష్టించడం ద్వారా ఆ నియోజకవర్గాల్లో బీజేపికి లబ్దిజరుగుతుంది. లేని విషయాన్ని, లేని గొడవలను సృష్టించి ఎంఐఎంను పోటీ చేయించడం ద్వారా బీజేపీ లాభపడే ఎత్తుగడ వేస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలనే చూసుకుంటే ముస్లిం కమ్యూనిటీకి ప్రతినిధిగా ఎంఐఎం ఉంటే, హింధువులకు బాసగా తాము ఉన్నామంటూ బీజేపీ ప్రచారం చేసుకుంది. తద్వారా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ బాగా లాభపడింది.

ప్లాన్ – 5: టీఆరెస్ లో చీలికలు..!?

టీఆర్ఎస్ లో చీలికలు తీసుకురావడం. ఇది అంత ఈజీ కాదు. కానీ అంత కష్టమూ కాదు. తెలంగాణలో రెండు సార్లు అధికారంలో ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది ఆర్ధికంగా ఎదిగారు. వాళ్లు చేసిన తప్పులను ఎత్తిచూపడం లేదా వాళ్ల మీద వ్యవస్థలతో దాడి చేయించడం ద్వారా వాళ్లను గుప్పిట్లో పెట్టుకోవడం. టీఆర్ఎస్ లో ఉన్న 40 – 50 మంది ఎమ్మెల్యేలు మళ్లీ గెలవరు అన్న నివేదికలు ఉన్నాయి. వాళ్లకు సీట్లు ఇస్తే డౌటే అని కేసిఆర్ కూడా ఆలోచిస్తున్నారు. ఒక వేళ అదే జరిగితే టీఆర్ఎస్ లో అసమ్మతి పెరిగితే దాన్ని బీజేపీ ఏ విధంగా వాడుకోవాలో ఆ ప్రణాళికలు సిద్దం చేసుకుంది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే .. తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉంటే బీజేపికి 60కి పైగా నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలు లేరు. ఆ నియోజకవర్గాల్లో కార్యకర్తల బలం లేదు. నియోజకవర్గ స్థాయి నేతలు లేరు. కానీ అధికారంలోకి వస్తామని బీరాలు పలుకుతున్నారు. ఎలా అంటే కాంగ్రెస్, టీఆర్ఎస్ లో చీలికలు జరిగి బీజేపికి వలస నాయకులు ఎక్కువగా వస్తారు. వలస నాయకుల ద్వారా రాజకీయం చేయవచ్చు. ఈటల రాజేందర్ ఒకప్పుడు టీఆర్ఎస్ నేత. ఇప్పుడు బీజేపీలో ముఖ్య నాయకుడుగా ఉన్నారు. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మొన్నటి వరకూ కాంగ్రెస్. ఇప్పుడు బీజేపీలో కీలక నాయకుడుగా మారుతున్నారు. బీజేపీకి బలం లేని నియోజకవర్గాల్లో కూడా ఇతర పార్టీ నాయకులను చేర్చుకుని అక్కడ రాజకీయం చేసి స్థిరపడటమే బీజేపీ బిగ్గెస్ట్ ప్లాన్. అందుకు టీఆర్ఎస్ ను కూడా చీల్చి, టీఆర్ఎస్ లో ఉన్న ప్రజాకర్ష నాయకులను పార్టీలో చేర్చుకుని వాళ్ల ద్వారా రాజకీయం చేయడం.

author avatar
Special Bureau

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!