BJP Janasena: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో సూన్యం. ఆ పార్టీకి బలం లేదు. ఏపిలో ఆ పార్టీకి ఎన్నికల్లో ఒక శాతం లోపు మాత్రమే ఓట్లు వచ్చాయి. పార్టీ పరంగా చూసుకుంటే ఆ పార్టీకి ఓట్లు లేవు. సీట్లు లేవు. రాష్ట్రంలో బీజేపీ (BJP) స్వతంత్రంగా పోటీ చేసి ఒక్క స్థానం కూడా గెలుచుకునే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఒక్క నియోజకవర్గంలోనూ ఆ పార్టీకి డిపాాజిట్ రావడం కష్టం. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే.. అటువంటి బీజేపీ.. ఈ రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తామని గాంభీర్యం ప్రదర్శిస్తుండటం ఆశ్చర్యకరం. రాజకీయ పార్టీ అన్న తరువాత కాన్ఫిడెన్స్ ఉండవచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తోంది. సోము వీర్రాజు (Somu Veerraju), జీవీఎల్ నర్శింహరావు (GVL Narsimharao) లాంటి వాళ్లు మీడియా ముందుకు వచ్చారంటే వైసీపీ (YCP) పని అయిపోయింది. టీడీపీ (TDP) పని అయిపోయింది. టీడీపీ ప్లేస్ లోకి మేము వచ్చేస్తున్నాం అని చెబుతున్నారు. వైసీపీ పరిపాలన బాగోలేదు కాబట్టి అధికారం బీజేపీ కూటమిదేనని, అధికారంలోకి వచ్చేస్తున్నామని అంటున్నారు. ఈ విషయాలు అలా ఉంచితే.. బీజేపీ అంతర్గత లక్ష్యాలు, వ్యూహాలు ఏమిటి.. పవన్ కళ్యాణ్ ను బీజేపీ ఏ విధంగా వాడుకోవాలి అనుకుంటుంది అనే విషయాలను పరిశీలిస్తే…
బీజేపీ అంచనాలు. లక్ష్యాలు రెండు. ఆ పార్టీ రెండు సామాజికవర్గాలపై ఫోకస్ పెట్టాయట. ఈ రెండు సామాజికవర్గాల ఓట్లు వస్తే కనీసం 40 నుండి 45 స్థానాలు జనసేన – బీజేపీ కూటమి గెలుచుకోవచ్చు అని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటుందట. అదే జరిగితే కింగ్ మేకర్ అవతారం ఎత్తవచ్చు. అవసరమైతే కేంద్రంలో అధికారంలో ఉంటుంది కాబట్టి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. కర్ణాటక తరహాలో గేమ్ ప్లే చేసి అధికార పీఠం ఎక్కేయవచ్చు అనేది బీజేపీ ప్లాన్. అందుకు పవన్ కళ్యాణ్ ద్వారా పూర్తి కాపు సామాజికవర్గాన్ని ఉపయోగించుకోవాలని చూస్తొంది బీజేపి. పవన్ కళ్యాణ్ కు ఉన్న చరిష్మా. యూత్ ఫాలోయింగ్, ఆ సామాజిక వర్గానికి వాడుకోవాలని బీజేపీ చూస్తొంది.
నిజానికి బీజేపీ – జనసేన పొత్తు వల్ల జనసేనకు పెద్ద గా ప్రయోజనం ఏమి ఉండదు. కేవలం కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి అధికార పక్షంతో ఉన్నామన్న సంతృప్తి తప్ప జనసేన బలపడేది అంటూ ఏమి ఉండదు. పైగా బీజేపీతో పొత్తు వల్ల జనసేనకే నష్టం ఎక్కువ. ఎందుకంటే ఈ రాష్ట్రానికి బీజేపీ అడుగడుగునా నష్టం చేస్తొంది. పోలవరం ప్రాజెక్టుకు పూర్తిగా నిధులు ఇవ్వడం లేదు. ప్రత్యేక హోదా విషయంలో మాట మార్చింది. అమరావతి రాజధాని విషయంలో డబుల్, త్రిబుల్ గేమ్ ఆడుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అన్యాయం చేస్తొంది. రాష్ట్రానికి బీజేపీ మంచి కంటే మోసాలు ఎక్కువ చేసింది కాబట్టి ఈ పార్టీకి ఓట్లు ఉండవు. సీట్లు ఉండవు. ఇటువంటి పార్టీతో పొత్తు ఉండటం వల్ల జనసేన కూడా వాస్తవ బలాన్ని కోల్పోతుంది. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన చాలా బలంగా ఉంది. కానీ బీజేపీ పొత్తు వల్ల ఆ పార్టీ వ్యతిరేక వర్గాలు చాలా ఉన్నాయి కాబట్టి జనసేనకు ఓట్లు వేయడానికి ఆలోచిస్తారు. పవన్ కళ్యాణ్ ను వాడుకోవాలని మాత్రం బీజేపీ చూస్తొంది. కానీ ఆయనకు పవర్స్ ఉండకూడదు. బీజేపీ ఆలోచన ఏమిటంటే.. తమ తరపు నాయకుడు అధికారంలో ఉండాలి. కానీ వాళ్లకు పవర్స్ ఉండకూడదు. స్టీరింగ్ తమ చేతిలో ఉండాలి అన్నది బీజేపి లెక్క.
పవన్ కళ్యాణ్ బీజేపీ ట్రాప్ లో పడ్డారా అని కొన్ని వర్గాలకు అనుమానం వస్తొంది. పవన్ కళ్యాణ్ బీజేపీ పట్ల ఇదే ధోరణిలో ఉంటే విశాఖపట్నం లాంటి జిల్లాలో జనసేన బాగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. వెళితే జనసేన సింగిల్ గా బీజేపీతో పొత్తు లేకుండా ముందుకు వెళ్లాలి. లేకపోతే టీడీపీతో పొత్తుతో వెళ్లాలని విశాఖ ప్రాంత జనసేన నాయకుల అభిప్రాయంగా ఉంది. బీజేపీని వదిలి బయటకు వస్తే కేంద్రం, వ్యవస్థల సహాకారం ఉండదన్న భయం జనసేనలో నెలకొని ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎటువంటి అవినీతి కేసులు లేవు. కేంద్ర వ్యవస్థల గురించి భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి స్వతంత్రంగా బరిలో దిగవచ్చని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…
బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…
ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…
దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…
ఆగస్టు 9 – శ్రావణమాసం - మంగళవారం మేషం చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి వృథాఖర్చులు పెరుగుతాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ పూరీ జాగన్నాథ్ తెరకెక్కించిన…