NewsOrbit
5th ఎస్టేట్ Featured బిగ్ స్టోరీ

“రాజకీయ గణితం” తెలియకపోతే బీజేపీ ముందు బకరాలే..! బీహార్ సాక్ష్యం..!!

లెక్కలన్నీ చూడు అంకెల్లా ఉండు..!
లోతుకెళ్ళి చూస్తే మజా ఉండు..!
గణితమందు రాజకీయ గణితం వేరయా..!
ఇది బీజేపీ స్కెచ్ రా మామ..!!

ఇది చదవటానికి కామెడీగా అనిపిస్తుంది కానీ, సీరియస్ అంశమే. బీహార్ లో “రాజకీయ గణితం” తెలుసుకోలేదు కాబట్టే ఆర్జేడీ ఓడింది, నితీష్ దెబ్బతిన్నారు, చివరికి ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేయలేకపోయాయి. వీటిని బాగా ఒంటపట్టించుకుంది కాబట్టి చక్రం తిప్పింది. అనుకున్నది సాధించింది. ఇవేమిటో, బీహార్ లో ఏం జరిగిందో కాస్త లోతుగా వెళ్లి తెలుసుకుందాం..!!

ఓట్లు.., సీట్లు లెక్క ఇదీ..!!

అందరి కంటే ఎక్కువ ఓట్లు (23 శాతం) వచ్చిన ఆర్జేడీకి 76 సీట్లు వచ్చాయి. బీజేపీకి 19 శాతం ఓట్లు వస్తే సీట్లు మాత్రం 73 వచ్చాయి. ఓట్ల శాతం 4 ఉంటే, సీట్లు తేడా 3 ఉంది. నిజానికి ఈ ఓటింగ్ శాతం అంటే ఆర్జెడీకి కనీసం 88 స్థానాలు రావాలి. కానీ చాలా నియోజకవర్గాల్లో తక్కువ తేడాతో కోల్పోయింది. ఈ పార్టీకి రావాల్సిన ఓట్లు చీలిపోయాయి. ఆ ఫలితమే సీట్లు తగ్గడం. ఆ ఫలితమే ఆర్జెడీకి దెబ్బ పడి, బీజేపీ అనుకున్నది సాధించడం. ఆర్జేడీ కోసం బీజేపీ ఎమ్ఐ ఎమ్ అస్త్రాన్ని వాడింది అంటే నమ్మగలరా..!? ఎంఐఎం కి బీజేపీకి అసలు పడదు కదా..? ఈ పార్టీ బీజేపీకి ఎలా సాయపడింది అనేది తెలుసుకోవాల్సిందే..!

వ్యతిరేక ఓట్లు చీలితే బీజేపీకి లాభమేగా..!!

అయోధ్య రామమందిర నిర్మాణం నేపథ్యంలో బీజేపీకి ముస్లింలు పూర్తిగా దూరమయ్యారు. ఆ ఓట్లు ఆ మందిర భూమి పూజ తర్వాత వచ్చిన మొదటి ఎన్నిక కావడంతో “ముస్లింల ఓట్లు తమకు రావు అని గ్రహించిన బీజేపీ.. మాకు రానివి.., ప్రత్యర్థికి కూడా దక్కకూడదు అనే ప్లాన్ వేసింది. ఇక్కడ బీజేపీని ఓడించాలి అని లక్ష్యంతో దిగిన ఎంఐఎం మహాకూటమితో కలవకుండా సొంతంగా పోటీ చేసింది. ఒకటిన్నర శాతం ఓట్లు వచ్చాయి.., కానీ 5 స్థానాలు గెలిచింది. ఇక్కడే 5 శాతం ఓట్లు వచ్చిన ఎల్జీపి మాత్రం ఒక్క స్థానమే గెలిచింది. ఇదే రాజకీయ గణితం అంటే.

Modi amit shah file photo

కొన్ని కీలక పాయింట్లు..!!

* ముస్లిం ఓట్లు చీల్చిన ఎంఐఎం బాగా లాభపడింది. ఇదే పార్టీ ఆర్జేడీ నేతృత్వంలోని ఎంజీబీతో జత కట్టి ఉంటే కనీసం మరో పది, పదిహేను స్థానాలు ఆ కూటమికి వచ్చేవి. ఎంఐఎం శత్రువుగా ఉన్న బీజేపీ కి అధికారం కాస్త దూరమయ్యేది. కానీ అలా జరగలేదు. ఇదే లాజిక్కు.
* ఎల్జేపీ దళితుల ఓట్లు చీల్చింది. 28 నియోజకవర్గాల్లో జేడీయూ కి దెబ్బ వేసింది. ఒక్కో నియోజకవర్గంలో సగటున 20 వేలు ఓట్లు చీల్చి జేడీయూని గెలవకుండా చేసింది.


* అంటే ఇక్కడ ఎంఐఎం ద్వారా ఆర్జెడీకి పడాల్సిన ఓట్లని దూరం చేసి.., ఇటు ఎల్జేపీ ద్వారా నితీష్ కి పడాల్సిన ఓట్లని దూరం చేసి.. ఓట్లు – సీట్లు లాజిక్కుల్లో బీజేపీ విజయం సాధించింది. తమకు పాడనీ ఓట్లు ప్రధాన ప్రత్యర్థికి పడకూడదు.. ఏవో చిన్న పార్టీలకు పడాలి అనేది బీజేపీ లక్ష్యం. అది నెరవేరి.., ఎంఐఎం కి బాగా కలిసి వచ్చింది.
* సో.. ఈ పాయింట్లు అన్ని ఎగ్జిట్ పోల్స్ ముందే అంచనా వేయలేవు. ఇవి చీకట్లో జరుగుతాయి. ఎగ్జిట్ పోల్స్ వెలుతురులో మాత్రమే అభిప్రాయం సేకరణ చేస్తాయి. బీజేపీ లాంటి పార్టీలు ఉన్నప్పుడు.., అటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఇలా ఎగ్జిట్ పోల్స్ చేసినా యూజ్ ఉండదు. సుకుమార్ సినిమాలాగా ముందే ఊహించి రెమెడీ ఆలోచించుకుని, సిద్ధం చేయాలి. అది సినిమాల్లో సాధ్యం అవుతుంది. రియాలిటీలో బీజేపీకి ఎదురొడ్డే, రెమెడీగా అడుగులు వేసే పార్టీ లేదు. అందుకే బీజేపీ గాలి అంతగా ఉంది..!

 

 

 

 

 

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju