BJP Politics: బీజేపీ ‘సౌత్’ డ్రామా ..గేమ్ ఫెయిల్..!? న్యూట్రల్ ప్రముఖులపై బీజేపీ కన్ను..కానీ..!?

Share

BJP Politics: బీజేపీ రాష్ట్రపతి నామినేటెడ్ కోటాలో నలుగురు రాజ్యసభ సభ్యులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఎప్పుడు బీజేపీ ఉత్తరాది వాళ్లకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. కానీ ఈ సారి ఆశ్చర్యకరంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నలుగురికి ప్రాధాన్యత ఇచ్చింది కేంద్రంలోని బీజేపీ. సినీ సంగీత దర్శకుడు ఇళయరాజాది తమిళనాడు రాష్ట్రం అయినప్పటికీ దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. దేశ వ్యాప్తంగా ఆయనంటే తెలుసు. దాదాపు 30 ఏళ్లుగా ఆయన సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారు దేశ ప్రజలు.  విజయేంద్ర ప్రసాద్ మంచి కథా రచయితగా పేరు తెచ్చుకున్నారు. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకున్నారు. మంచి మంచి కథలు రాశారు. ఈయన తెలుగు వ్యక్తి. ఇక పీటీ ఉష, కేరళకు చెందిన పరుగుల రాణి. ఇక మరో వ్యక్తి కర్ణాటకకు చెందిన వీరేంద్ర హెగ్డే. ఈ నలుగురు దక్షిణాదికే చెందిన వేరువేరు రాష్ట్రాలకు చెందిన వారు.

BJP Politics in south India

BJP Politics: ఈ అయిదు రాష్ట్రాలపై బీజేపీ కన్ను

బీజేపీ ఈ నలుగురికి రాజ్యసభ ఎందుకు ఇచ్చింది అంటే..? బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ (తెలంగాణ) లో జరిగాయి. ఈ సమావేశాల్లో మోడీ.. దక్షిణాది (సౌత్ ఇండియా)లో బీజేపీ బలపడాలి అని స్పష్టంగా చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి రావాలి. కేరళ, ఏపి, తమిళనాడులో ఓటింగ్ పెంచుకోవాలి. కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవాలి. ఇవి బీజేపీ టార్గెట్. ఆ లక్ష్యంలో భాగంగా ఈ అయిదు రాష్ట్రాలపై బీజేపీ కన్ను వేసింది. కాబట్టి బీజేపీ రాజకీయ అడుగులు అన్నీ ఈ రాష్ట్రాల చుట్టూనే ఉంటాయి. ఇప్పటికే ఉత్తరాదిన బీజేపీకి బలం ఉంది. బీహార్, యూపి, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ గుజరాత్ తదితర రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉంది. పెద్ద పెద్ద రాష్ట్రాల్లో అధికారంలో ఉండటంతో కషాయానికి అక్కడ ఢోకా లేదు. దక్షిణాది రాష్ట్రాల్లోనే బీజేపీని ప్రజలు పట్టించుకోవడం లేదు.

 

ఉత్తరాదిన మతపరమైన రాజకీయం

ఈ వ్యత్యాసానికి కారణం ఏమిటంటే..? ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా మతం పరంగా రాజకీయం నడుస్తుంది. ఏపిలో కులం ఆధారంగా రాజకీయం జరుగుతుంటుంది. తమిళనాడులో భాష, ప్రాంతం ఆధారంగా రాజకీయం జరుగుతుంది. తెలంగాణలో మూడు రకాలుగా భాష, ప్రాంతం,కుల పరంగా రాజకీయం ఉంటుంది. అందుకే తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. తమిళనాడులో బీజేపీకి అవకాశం లేదు. అక్కడ ఉంటే డీఎంకే, లేదా ఏఐడీఎంకే. ఈ రెండు పార్టీలే ఒకటి తరువాత మరొకటి అధికారంలోకి వస్తుంటాయి. తమిళనాడు ప్రజలు జాతీయ పార్టీలను ఆదరించరు. ఇక ఏపి విషయానికి వస్తే కుల రాజకీయాలు వేళ్లురుకుపోయాయి. అందుకే ఏపిలో మత రాజకీయాలు చేయాలని బీజేపీ ప్రయత్నించినా కుదరలేదు. మతపరంగా రాజకీయాలు నడుస్తున్న ఉత్తరాదిన బీజేపీ బలంగా ఉంది. వివిధ రకాలుగా రాజకీయం నడుస్తున్న దక్షిణాదిన బీజేపీ బలపడలేకపోతుంది.

 

ఈ రాష్ట్రాల్లో బీజేపి పప్పులు ఉడకవు..పాచికలు పారవు

అందుకే ఇప్పుడు బీజేపీ దక్షిణాదిన చరిష్మా ఉన్న ప్రముఖుల వెంట పడుతోంది. వీళ్లు మా పార్టీ వాళ్లు అన్న సంకేతం ఇవ్వడం కోసం వివిధ రంగాల్లో ప్రముఖులను అత్యున్నత పదవులను ఇచ్చి గౌరవిస్తొంది బీజేపీ. ఇటీవల భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125 జయింతి వేడుకలకు మెగా స్టార్ చిరంజీవిని అహ్వానించారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆయన అభిమానులు, ఆయన సామాజికవర్గ ప్రజలను ఆకట్టుకోవాలన్నది ప్లాన్. సమాజంలో సంఘంలో గుర్తింపు ఉన్న న్యూట్రల్ వ్యక్తుల వెంట బీజేపీ పడుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకూ ఏ పార్టీ ముద్ర లేని ఇళయరాజా, విజయేంద్ర వర్మ, పిటి ఉష, వీరేంద్ర హెగ్డేలను తమ బుట్టలో వేసుకుంది బీజేపీ. దక్షిణాదిన బలపడేందుకు కొంత మంది పెద్ద వ్యక్తులను ముందుకు నెట్టి వాళ్ల ద్వారా రాజకీయం చేసి ఓట్లు దండుకోవచ్చు అన్నది బీజేపీ వ్యూహం. కానీ బీజేపీ  పప్పులు ఉడకవు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఆటలు సాగవు. పాచికలు పారవు. ఒక్క తెలంగాణలో మాత్రం బీజేపీ లాభపడే అవకాశాలు ఉంటాయి.


Share

Recent Posts

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

47 mins ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

3 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

3 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

4 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

4 hours ago

బాలకృష్ణకు చెల్లి అనగానే బోరున ఏడ్చేసిన హీరోయిన్ లయ.. ఎందుకంటే!

ఒకప్పటి హీరోయిన్ లయ స్వయంవరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ ముద్దుగుమ్మ 2000 కాలంలో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కెరీర్ పీక్…

5 hours ago