NewsOrbit
5th ఎస్టేట్ Featured

ఏబీఎన్ ఆర్కే అక్షర “రోగానికి”.! సోమూ సరైన “మందు”.!! ఏం లేఖ రాశారంటే.!!

కొందరుంటారు…! ఎదుటి వారికి చురక కోసం గడ్డి మోపుని తగలబెడతారు…!
ఇంకొందరుంటారు…! మంట లేకుండా ఎదుటి వారికి చురకలు పెడతారు..!

ఇక్కడ ఏబీఎన్ ఆర్కే మొదటి రకం..! సోము వీర్రాజు రెండో రకం..! ఈ ఇద్దరికీ చురకలు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది..? ఎవరు పెట్టిన చురక ఏమిటో..? ఆర్కే తగలబెట్టిన మంటతోనే సోము పెట్టిన చురక ఏమిటో చూద్దాం…!!

ఏబీఎన్ ఆర్కే బాధ సోము బాగానే పట్టించుకున్నారు…!!

పర్వాలేదు. ఏమో అనుకున్నాం కానీ…, సోము వీర్రాజు ఫుల్ ఫామ్ లో ఉన్నారు. బాగానే నెట్ ప్రాక్టీస్ చేసినట్టున్నారు. గ్రౌండ్ లో దిగింది మొదలు బౌండరీలు బాదుతున్నారు. సొంత పార్టీ వాళ్ళతోనే ఆడుకుంటున్నారు. ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. బాధలు, రోగాలు ఉన్న వారికి గోళీలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏబీఎన్ ఆర్కే జబ్బుకి కూడా సోము తరహాలోనే మందు వేసేసారు. పెద్దగా ఆలోచించకుండా, పెద్దగా ప్రాక్టీస్ లేకుండా, సింపుల్ గా.., సామరస్య పూర్వకంగా ఆర్కేకి మందులు తాగించారు.., మాత్రలు మింగించారు.

ఆర్కే బాధ ఏమిటంటే..!! “బీజేపీలో జీవీఎల్ వ్యాఖ్యలు వలన రాష్ట్రంలో బీజేపీ బలపడడం లేదు సరికదా బలహీన పడుతుంది. ఆయన వ్యాఖ్యలు వైసిపికి అనుకూలంగా ఉంటున్నాయి. ఆయన వైసిపి తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నట్టు బీజేపీ నాయకులే వాపోతున్నారు. ఏపీలో బీజేపీ బలపడాలి అనుకుంటే ఆయనను పార్టీ పెద్దలు అదుపు చేయాలి, మా పార్టీ మా ఇష్టం అనుకుంటే మీ ఇష్టం” అంటూ మంట రగిలించారు.

సోము వేసిన మందు ఏమిటంటే…! “అయ్యా రాధాకృష్ణ గారు మీ సంపాదకీయం చదివాను. మా జీవీఎల్ గారు చంద్రబాబుని విమర్శించడం మాకే మంచిది కాదు అంటూ అమోఘమైన విశ్లేషణ రాశారు. బీజేపీపై పుట్టిన ప్రేమ కాదు, ఇది పతనానికి చేరువలో ఉన్న చంద్రబాబుకి రక్షించే ప్రయత్నం అని అర్ధమవుతుంది. ఇంత పబ్లిక్ గా, నిర్లజ్జగా పత్రికను అడ్డం పెట్టుకుని మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగునా..? మీ రాజకీయ సలహాలు చంద్రబాబుకి ఇవ్వని. మీరు మా జాతీయ నాయకులకు సలహాలిచ్చారు. మీ విశ్లేషణలో మతలబు ఏమిటో, మీ తాపత్రయం ఏమిటో… వారికి వివరిస్తాను, మీరేమి దిగులు పడవద్దు” అంటూ రెండు మందుబిళ్లలు, రెండు టానిక్కులు పంపించారు.

ABN RK: Trying for Sympathy Share in AP Politics

పాపం ఆర్కే…! వారానికో తాపత్రయం..!!

పాపం ఏబీఎన్ ఆర్కే… ఆయనను ఎవరూ పట్టించుకోవట్లేదు..! వారానికి ఒకరికి మంచి సలహాలు ఇస్తుంటారు. కానీ ఎవరూ ఆయనను గుర్తించడం లేదు. ఈరోజు సోము గుర్తించినంతగా వైసిపి జగనూ.., తెలంగాణ కేసీఆర్ కూడా పట్టించుకోవట్లేదు. ఆయన బాధని అర్ధం చేసుకుని స్పందించి, మాత్రలో, టానిక్కులో ఇచ్చేస్తే ఆయన రోగం తగ్గుతుంది. లేకుంటే ఇలా వారం వారం కొన్ని పలుకులు వస్తుంటాయి. అందులో ప్రపంచము అమూల్యమైన వింతలు, విడ్డూరాలు.., కొత్త రాజకీయ అంశాలు, ఆయనకే సాధ్యమయ్యే కొన్ని రాజకీయ విశ్లేషణలు.., ఆమూలాగ్రం చంద్రబాబుని పైకి లేపే ఉద్దేశం ఉంటాయి. పాపం…! ఆయన ఆశయం నెరవేరడం లేదు, ఆయన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. సోమూ లాగా ఎవరైనా ఏమైనా చేయండయ్యా.., వైద్యం చేయించండయ్యా..!!

author avatar
Srinivas Manem

Related posts

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Cyber Crime: లోన్ apps బెదిరింపులకి భయపడకండి – ఈ సంస్థ మిమ్మల్ని కాపాడుతుంది

siddhu

Mehraan Pirzada New Series: సుల్తాన్ అఫ్ ఢిల్లీ వెబ్ సిరీస్ లో మెహ్రీన్ పిర్జాదా సీన్స్ తమన్నా లస్ట్ స్టోరీస్ ని మించిపోయిందిగా!

sekhar

World Anesthesia Day: అనస్థీషియా ని కనుగొన్నది ఎవరు, అంతకముందు సర్జరీ పరిస్థిథి ఎలాఉండేది, అనస్థీషియా హెల్త్ కేర్ ని ఎలా మార్చేసింది, అనస్థీషియా రకాలు ఇంకా అనస్థీషియా గురించి పూర్తి వివరాలు

siddhu

August 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఆగస్టు 28 నిజ శ్రావణమాసం రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగం పొందే మార్గం ఏది?

siddhu

Valentine’s Day 2023: మీ భాగస్వామితో వాలెంటైన్ డే జరుపుకోవాలని అనుకుంటున్నారా? ఈ రొమాంటిక్ ప్లేసులపై ఓ లుక్కేయండి!

Raamanjaneya

శీతాకాలంలో వెకేషన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? సౌత్ ఇండియాలోనే ఉత్తమ పర్యాటక ప్రదేశాలు.. వాటి వివరాలు!

Raamanjaneya

Niranthara Ranga Utsava: నేటి నుంచి థియేటర్ ఫెస్టివల్ ప్రారంభం. ఒక్కో రోజు ఒక్కో నాటక ప్రదర్శన!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau