NewsOrbit
5th ఎస్టేట్ Featured న్యూస్

Chandrababu Scam ; ఇవీ చంద్రబాబు పారిశ్రామిక పాపాల చిట్టా..! ఏం జగనూ మీకు ఉత్తమ స్థానం కావాలా..!?

TDP ; Municipolls Winning Analysis

Chandrababu Scam ; ప్రగతి అంటే పారిశ్రామికం.. ప్రగతి అంటే ఉపాధి కల్పించడం.. ప్రగతి మాటున ప్రభుత్వ పరిశ్రమలను ప్రైవేట్ పరం చేస్తే అది అప్పటికప్పుడు నష్టం చేయకపోవచ్చు.. కానీ దీర్ఘకాలికంగా ఆ పరిశ్రమ ఉనికికి నష్టమే కలిగిస్తుంది. ఆ నష్టం పాపంగా మారుతుంది. దీర్ఘ కాలిక పాపాల జాబితాలోకి చేరుతుంది. రాష్ట్రాన్ని 14 ఏళ్ళ పాటూ సీఎంగా ఉద్ధరించిన చంద్రబాబు ఎన్నో పరిశ్రమలను తెచ్చారు.. మరెన్నో పరిశ్రమలను కొట్టారు..! తెచ్చినవి ప్రైవేట్ పరిశ్రమలు.. కొట్టినవి ప్రభుత్వ పరిశ్రమలు..! తద్వారా బయటకు తెలియని కొన్ని కోట్ల స్కాములు నడిపించారు. ఇప్పుడు జగన్ / మోడీల వంతు వచ్చిందా..!? విశాఖ ఉక్కు పరిశ్రమ కూడా దీని కోవలోకే వస్తుందా..!?

Chandrababu Scam here is full list of
Chandrababu Scam here is full list of

Chandrababu Scam ; బాబు గారి చిట్టా ఇదీ..!!

చంద్రబాబు పారిశ్రామిక పాపాల చిట్టా పెద్దదే ఉంది. తను సీఎంగా ఉన్నప్పుడు తన మాటకు తిరుగులేకుండా.., ఏం చేసినా అవుననేలా వ్యవస్థలను దగ్గర పెట్టుకుని 14 ఏళ్ళు పరిపాలించారు. ఆ కాలంలో రాష్ట్రంలోని అనేక కీలక పరిశ్రమలను ప్రైవేట్ పరం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలుగా ఉన్న వాటిని సులువుగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసిన ఘనత చంద్రబాబుదే. వాటి మార్కెట్ విలువకు ఏ మాత్రం సంబంధం లేకుండా… అతి తక్కువ ధరలకు కట్టబెట్టారు. చీకటి బేరాలు కుదుర్చుకుని.. అనేక కోట్లు కొల్లగొట్టారు. అయితే ఇవేమి పెద్ద సంచలనాలు కాలేదు. ఎందుకంటే ఇవి విశాఖ ఉక్కు అంత పెద్దస్థాయి పరిశ్రమలు కాదు..! ఉదాహరణలు చూసుకుంటే…

ఇదీ చదవండి ; ఏపీ రాజకీయంలో న్యూస్ స్ట్రాటజీ..! తెలుగు మీడియా బకర అవుతుంది..!!

Chandrababu Scam here is full list of
Chandrababu Scam here is full list of

* హైదరాబాద్ లోని సనత్ నగర్ లో ఉన్న ఆల్విన్ సంస్థ అప్పట్లో మార్కెట్ విలువ రూ. 150 కోట్లు ఉండగా.., రూ. 8 కోట్లకు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు.
* హైదరాబాద్ లోని మౌలాలీలో ఉన్న రిపబ్లిక్ ఫోర్జి సంస్థని అప్పట్లో మార్కెట్ విలువ రూ. 32 కోట్లు ఉండగా.., దాన్ని రూ. 16 కోట్లకు కట్టబెట్టారు.
* నిజం సుగర్స్ కంపెనీని రూ. 55 కోట్లకు అమ్మేశారు. నిజానికి దీని మార్కెట్ విలువ అప్పట్లో రూ. 120 కోట్లు ఉండేది. ప్రైవేట్ పరం చేసిన తర్వాత ఈ కంపెనీ అడ్రెస్స్ లేకుండా పోయింది. ప్రభావం కోల్పోయింది.
* మధురానగర్ షుగర్స్ మార్కెట్ విలువ రూ. 42 కోట్లు ఉండగా.. తన దగ్గరి వాళ్లకు రూ. 22 కోట్లకు కట్టబెట్టారు.
* మంత్తోజి నగర్ డిస్టిలర్ కంపెనీని రూ. 20 కోట్లు మార్కెట్ విలువ ఉండగా రూ. 15 కోట్లకు కట్టబెట్టారు.
* చాగల్లు నగర్ డిస్టిలర్ కంపెనీని రూ. 16 కోట్లు మార్కెట్ విలువ ఉంటె.. దీన్ని రూ. 9 కోట్లకు ఇచ్చేసారు.

* హనుమాన్ జంక్షన్ సుగర్స్ ని రూ. 38 కోట్లు మార్కెట్ విలువ ఉన్న సమయంలో రూ. 18 కోట్లకు.. నంద్యాల సుగర్స్ రూ. 20 కోట్లు మార్కెట్ విలువ ఉండగా.., రూ. 6 కోట్లకు.., పాలకొల్లు సుగర్స్ కంపెనీని రూ. 10 కోట్లు మార్కెట్ విలువ ఉండగా.. దీన్ని రూ. మూడున్నర కోట్లకు అమ్మేశారు. గురజాల సుగర్స్, ఇందూపూర్ షుగర్, ఆదిలాబాద్ కాటన్ మిల్లు… ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆయన 14 ఏళ్ళ పాలనలో సుమారుగా 70 ప్రభుత్వ రంగ కంపెనీలను ప్రైవేట్ మయం చేశారు. వీటిలో ఒక్కటి కూడా మార్కెట్ విలువకి పొంతన లేదు.

Chandrababu Scam - Nizam Sugars
Chandrababu Scam Nizam Sugars

ఇప్పుడు చెప్పండి..! ఇదే బాటని విశాఖ ఉక్కుని అమ్మేద్దామా..!?

ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ వంతు వచ్చింది. ఇది దేశంలోనే అతి పెద్ద ఉక్కు పరిశ్రమ. ఆంధ్ర ప్రదేశ్ లో దీని కంటే పెద్ద పరిశ్రమ ఇంకోటి లేదు. ప్రత్యక్షంగా 32 వేల కుటుంబాలకు.., పరోక్షంగా 25 వేల కుటుంబాలను ఈ పరిశ్రమ పోషిస్తుంది. అంటే దీనిపై ఆధారపడి సుమారుగా 2 లక్షల మంది జీవిస్తున్నారు.
చంద్రబాబు.. టీడీపీలు చేస్తున్న గోల పక్కన పెట్టేస్తే… చంద్రబాబు నాడు చేసిన తప్పులకు ఎప్పటికీ ప్రాయశ్చిత్తం ఉండదు. ఆయన హయాంలో అమ్మేసిన కంపెనీల్లో వేలాది మంది ఉపాధి కోల్పోయారు. తర్వాత ఆ కంపెనాలను కొనుగోలు చేసిన ప్రైవేట్ యాజమాన్యాలు నష్టాల పేరిట కార్మికులను తొలగించారు. మరి ఇప్పుడు విశాఖ ఉక్కు పరిస్థితి ఏమిటి..? నష్టాలు వస్తున్నాయని ఇప్పుడు అమ్మేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించలేమా..!? విశాఖ ఉక్కు జోలికి వెళ్లి ప్రైవేట్ పరం చేయాలని చూస్తే.., నాడు చంద్రబాబు చేసిన పాపాలకు… వంద రేట్లు అధికం అవుతుంది. ఇప్పటికే జగన్ ఆల్రెడీ పోస్కో ప్రతినిధులతో భేటీ అవ్వడం.., ఆ కంపెనీ వారే విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయడంలో కీలక పాత్రధారులుగా ఉండడం.., ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చే వ్యవహారంగా మారింది. ఈ పేరు అవసరమా..!? ఆలోచన, ఆచరణ సీఎం జగన్ చేతిలోనే ఉంది. బీజేపీ తీసుకున్న నిర్ణయంలో వెనకడుగు ఉండదు. కానీ అది ఏపీలో ఉంది. ఏపీలో జగన్ ఉన్నత స్థానంలో ఉన్నారు. జగన్ కి ప్రజాబలం ఉంది. ఈ విశాఖ ఉక్కు విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటే ఆయనకు అక్కడి మద్దతు శతశాతం ఉంటుంది. ఆయన ప్రజాబలం, శాసనబలం చూపిస్తే బీజేపీ తోకముడవక తప్పదు..!

 

 

 

 

 

 

 

author avatar
Srinivas Manem

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju