CM YS Jagan: రాష్ట్రంలో రాజధాని వికేంద్రీకరణ (పరిపాలనా వికేంద్రీకరణ) అంశం మళ్లీ తెరపైకి వస్తుంది. ఇటీవల మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకున్నారు కదా ఇక దాని ఊసు ఎత్తరు అని చాలా మంది అనుకున్నారు. అయితే ఆ బిల్లు ఉపసంహరణ సమయంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాజధాని వికేంద్రీకరణకు మెగురైన బిల్లు తీసుకువస్తామని వెల్లడించారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలన్న వైసీపీ అభిలాషకు ప్రభుత్వం ఫిక్స్ అయ్యింది. ఏప్రిల్ నాటికి విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి షిప్ట్ చేయాలన్న ప్లాన్ లో ప్రభుత్వం ఉంది. అందుకు గానూ అన్ని రకాల వ్యవస్థల తెరవెనుక ఉండి ఏమి చేయాలో అన్నీ చేస్తున్నారు. ఇప్పటి వరకూ మూడు రాజధానుల అంశంపై ప్రత్యక్షంగా గేమ్ మొదలు పెట్టారు. అయితే చట్ట పరంగా నిలవలేదు. రాజధాని విషయంలో రైతులు తమ పట్టు వదలడం లేదు. గతంలో తీసుకువచ్చిన బిల్లు చట్ట ప్రకారం ఆమోదం పొందలేదు.
ఇవన్నీ గమనించిన ప్రభుత్వం ప్రత్యక్షంగా రాజధాని వికేంద్రీకరణ చేయాలంటే ఇప్పట్లో అయ్యే పని కాదు అని తెలుసుకుని పరోక్ష పద్ధతిలో అడుగులు వేస్తోంది. వికేంద్రీకరణకు సంబంధించి తెరవెనుక మార్గం ద్వారా ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. న్యాయస్థానం నుండి చిక్కులు రాకుండా ఉండేందుకు గానూ ముందుగా ఆందోళన చేస్తున్న అమరావతి ప్రాంత రైతుల్లో విభజన తీసుకువచ్చి వారిలో కొందరిని ఏదో రకంగా పరిపాలనా వికేంద్రీకణకు ఒప్పించి పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం చేయాలి. ఏప్రిల్ లేదా మే మొదటి వారం నాటికి విశాఖ నుండి పరిపాలన మొదలు పెట్టాలని వైసీపీ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీనికి గానూ మార్చి మొదటి వారం నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు తీసుకురానున్నారు అనేది ఒక కచ్చితమైన సమాచారం.
విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని వైసీపీ ఎందుకు అంత పట్టుదలగా ఉంది అంటే.. గత రెండు సంవత్సరాలుగా విశాఖలో రాజధాని వచ్చేస్తుందంటూ ప్రచారం జరగడంతో భూముల ధరలు పెరిగిపోయాయి. భూముల అక్రమ లావాదేవీలు జరిగిపోయాయి. పరిపాలనా రాజధాని అవ్వకపోవడంతో ఇప్పుడు భూముల ధరలు తగ్గుతున్నాయి. పరిపాలనా రాజధాని వస్తుందని ఆశలు కల్పించిన ప్రభుత్వం ఇప్పుడు అది నెరవేర్చకపోవడంతో వైసీపీకి ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతోందట. దీనితో పాటు రాజధాని వికేంద్రీకరణ అన్నారు. రెండేళ్లు దాటి పోయినా ఏమీ జరగలేదు. ఇప్పుడు బిల్లు వెనక్కు తీసుకోవడంతో ప్రజల్లో ప్రభుత్వంపై ఒక అపనమ్మకం వచ్చే పరిస్థితి ఏర్పడింది.
దీంతో అసెంబ్లీలో చెప్పిన విధంగా రాజధాని వికేంద్రీకరణ చేసి తీసి తీరాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. గతంలో బిల్లు తీసుకువచ్చిన సందర్భంలో తప్పులు జరిగాయి. ఇప్పుడు ఆ తప్పులు ఏమి లేకుండా కోర్టులు తప్పుబట్టకుండా వికేంద్రీకణ బిల్లును తీసుకువచ్చి విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. అందుకే బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి సీనియర్ మంత్రులు అందరూ పదేపదే విశాఖపట్నం రాజధానిగా చేస్తామనే చెబుతున్నారు. బిల్లు వెనక్కు తీసుకున్నప్పటికీ పరిపాలనా రాజధానిగా విశాఖను చేస్తామని చెబుతున్నారు. అందుకు ప్రభుత్వం గ్రౌండ్ వర్క్ కూడా చేస్తోంది.
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…
ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…
"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…
అల్లు వారి కోడలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. బన్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…
దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…