NewsOrbit
5th ఎస్టేట్ Featured బిగ్ స్టోరీ

Corona Lockdown: కరోనా గుప్పిట్లో దేశం..! లాక్ డౌన్ లేకపోతే ఏమవుతుంది..!?

India Lockdown: Supreme and Scientists Serious Warn

Corona Lockdown: 13 నెలల కిందట దేశం మొదటి సారిగా కరోనా (Corona Virus) భయాన్ని చవి చూసింది. గత ఏడాది మార్చిలో కరోనా పేరు వణికించి.. దేశం మొత్తం లాక్ డౌన్ (Corona Lockdown)కి దారితీసింది. కానీ ఇప్పుడు దేశంలో రోజుకి రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నా ఎక్కడా లాక్ డౌన్ మాటే వినిపించడం లేదు. మహారాష్ట్రలో రోజుకి 70 వేలు వస్తున్నా సోయి లేదు.. పంజాబ్ లో రోజుకి అరలక్ష వస్తున్నా లాక్ డౌన్ మాటే లేదు.. అప్పుడెప్పుడో దీపాలు వెలిగించి.. కంచాలు బాదేసి.. గో గో కరోనా గో పాట పాడమన్న మోడీ గారేమయ్యారో తెలీదు.. కరోనా తాండవం ఇలాగే కొనసాగితే.. లాక్ డౌన్ లేకపోతే దేశం ఏమవుద్దో ఊహించగలమా..!?

Corona Lockdown: పది లక్షలకు చేరుకుంటే ఊహించగలమా..!?

గత ఏడాది దేశం మొత్తంమీద రోజుకి పది కేసులు వస్తున్న దశలో లాక్ డౌన్ విధించారు. రోజుకి 1000 కేసులు వస్తున్న దశలో లాక్ డౌన్ తీసేసారు. ఆ పై కరోనా విజృంభించింది. రోజుకి 6 వేలు, 25 వేలు.., 50 వేలు.. అలా అలా… గత ఏడాది సెప్టెంబర్ సమయానికి రోజుకి 90 వేల కేసుల వరకు చేరుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు మళ్ళీ మొదలయింది. రోజుకి లక్ష నుండి మొదలై… ప్రస్తుతానికి రోజుకి రెండు లక్షల ఎనభై వేల కేసుల వరకు చేరుకుంది. అంటే ఇదే అత్యధికం. రోజు రోజుకి దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. మూడు రేపో, ఎల్లుండో మూడు లక్షలు వస్తాయి. ఆపై అయిదు లక్షలు కష్టం కాదు. ఆపై పది లక్షలకు చేరుకుంటే దేశంలో ఎక్కడా ఆసుపత్రులు, పరుపులు, రోడ్లు కూడా ఖాళీ ఉండవు. అప్పుడు దేశం పరిస్థితి ఏమిటి..!? ఒకవేళ రోజుకి పది లక్షల కేసులు నమోదైతే దేశంలో కరోనా కరాళనృత్యాన్ని ఎవరైనా ఆపగలరా..!? ఆ దారుణ స్థితిని ఊహించగలమా..!?

Corona Lockdown: Country in Corona Hands then Lock Down..!?
Corona Lockdown Country in Corona Hands then Lock Down

లాక్ డౌన్ ఇప్పుడు ఎందుకు పెట్టరు..!?

కరోనా కేసులు పెరుగుదల అలా ఉంది. రెండో దశలో లక్షణాలు ఘోరంగా ఉంటున్నాయి. కొత్త కొత్త ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. త్వరగా తగ్గడం లేదు. మరణాల రేటు పెరుగుతుంది. గాలి ద్వారా కూడా సోకుతుంది అని చెప్తున్నారు. మరి ఇప్పుడు పరిష్కారం ఏమిటి..!? కరోనాని నియంత్రించడం ఎలా..!? లాక్ డౌన్ పెడితే ప్రయోజనం ఉండదా..!? అంటే ఉంటుంది. కచ్చితంగా ఉంటుంది. ఒక నెల రోజుల పాటూ లాక్ డౌన్ పూర్తిగా విధిస్తే.. కరోనా పేషేంట్లను నయమయ్యే వరకు ఆసుపత్రులకు పరిమితం చేస్తే.. మొదటి 14 రోజులు.. కొత్త కేసులు.. వాటి ద్వారా ట్రేస్ అయిన రెండో 14 రోజులు మరిన్ని కేసులు బయటపడతాయి.. ఆ పై లాక్ డౌన్ ఉంటుంది కాబట్టి కొత్తగా మళ్ళీ లక్షల్లో వచ్చే అవకాశం అయితే ఉండదు. సో.. ఈ స్థితి నుండి బయటపడాలి అంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గం. జనాలని బయట తిరగకుండా నియంత్రించడం ఒక్కటే మార్గం..!

Corona Lockdown: Country in Corona Hands then Lock Down..!?
Corona Lockdown Country in Corona Hands then Lock Down

మరి మార్కెట్..? ఆర్ధికం..!?

ఎస్… లాక్ డౌన్ విధించడానికి వేరే సమస్యలేమీ లేవు. అప్పటిలా మార్కెట్ పడిపోతుంది. ఆర్థికరంగం దెబ్బ తింటుంది. నాడు సుమారుగా దేశం రూ. రెండున్నర లక్షల కోట్ల ఆదాయం కోల్పోయినట్టు.. ఇప్పుడు కూడా భారీగానే కోల్పోతుంది. గత ఏడాది కరోనా లాక్ డౌన్ ఇబ్బందుల నుండి మార్కెట్లు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కొనుగోళ్లు పెరుగుతున్నాయి. అన్నీ స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ లాక్ డౌన్ అంటే మళ్ళీ వెనక్కు వెళ్ళాలి. దేశానికి పెద్ద దెబ్బ తగులుతుంది. పేదలకు ఆకలి చావులు పెరుగుతాయి. ఎన్ని లక్షల కోట్ల ప్యాకేజీలు ఇచ్చినా పేదలకు అందవు. అందుకే … “దేశ ఆర్థికరంగం దెబ్బతింటే దేశానికి, కేంద్రానికి బాధ్యత ఉంటుంది.. కానీ నీకు కరోనా వస్తే నీకే బాధ్యత ఉంటుంది.” సో.. దేశం బాధ కంటే.., కేంద్రం బాధ కంటే నీ బాధ నువ్వు పడు అనే ఏకైక ఉద్దేశంతో మోడీ వర్యులు ఈ సారి కంచాలు మోగించామని.. దీపాలు వెలిగించమని… లచ్చ కోట్ల ప్యాకేజీలను చెప్పడం లేదు..! ఈ బాధలన్నీ ఎందుకులే అనుకుని… జనాలూ మీరు ఎవరికి వారు జాగ్రత్తగా ఉండండి అని ప్రభుత్వం చేతులెత్తేసింది..! ఇప్పుడు ఒకటే పరిష్కారం.. ఎవరికీ వారు స్వతహాగా లాక్ డౌన్ ప్రకటించుకోవడమే..!!

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju