Corona Vaccine ; వారానికి అరకోటి అద్దె..! దేశంలో ఫార్మా అంటే అంతే బాసూ..! ఈ వార్తలో షాక్ లేదు..!!

Corona vaccine ; 50 Lakhs rent for One week..!?
Share

Corona Vaccine ; ఈ రోజు పత్రికల్లో పేజీలన్నీ తిరగేస్తుంటే ఇదిగో ఓ వార్త కనిపించింది. దీనిలో వింత, విడ్డురం, విశేషం ఏమి లేదు. కానీ అది వార్తే.., కొంచెం లోతుగా ఆలోచించాల్సిన వార్తే..! దేశంలో ఫార్మా పరిశ్రమ ఎంతగా ఉంటుందో..? ఇండియాలో టాప్ టెన్ బిలీనియర్లలో ఏడుగురు ఫార్మా వాళ్ళే ఎందుకు ఉన్నారో..!? దేశంలో జనం భయంతో ఫార్మా రంగం ఎలా బతికేస్తుందో..? ఈ వార్త సాక్ష్యంగా నిలుస్తుంది.

Corona vaccine ; 50 Lakhs rent for One week..!?
Corona vaccine ; 50 Lakhs rent for One week..!?

Corona vaccine ; తెలిసి తెలిసి.. మునిగేది ఇక్కడే..!!

సోషల్ మీడియా విపరీతం అయ్యాక ఎక్కడా ఏది ఆగట్లేదు. అన్ని రంగాల్లో లోతైన అంశాలు బయటకు వచ్చేస్తున్నాయి. అలాగే ఫార్మా రంగంలో కూడా మాఫియా ఎప్పుడో బయటకు వచ్చేసింది. మనం రూ. పది పెట్టి కొనే టాబ్లెట్ తయారీ కంపెనీ నుండి ఒక్క రూపాయికే బయటకు వస్తుందని తెలుసు.., దీనిపై రూపాయిన్నర రూపాయల కమీషన్ వేసుకుని డిస్ట్రిబ్యూటర్ సరఫరా చేస్తాడని తెలుసు… దీనిపై ఇంకో రూపాయిన్నర లాభం వేసుకుని డీలర్ మెడికల్ దుకాణాలకు వేస్తాడని తెలుసు.., మొత్తం రవాణా కలుపుకుని అది మెడికల్ దుకాణాలకు ఆరు రూపాయలకు చేరుతుందని తెలుసు… మెడికల్ దుకాణ దారుడు నాలుగు రూపాయలు లాభం వేసుకుని ఎమ్మార్పీకి మనకు అమ్ముతాడని తెలుసు..!! మెడికల్ లో మాఫియా మొత్తం తెలుసు. ఎవరికీ ఎంత మిగులుతుందో మొత్తం బయటకు తెలుసు. సోషల్ మీడియా వచ్చాక ఎన్నోసార్లు పోస్టులు, ఆధారాలతో సహా వచ్చాయి. కానీ.. ఇన్ని తెలిసినా బేరం ఆడకుండా రూ. పది ఇచ్చి కోనేసేది ఇక్కడే, కేవలం ఈ ఫీల్డ్ లోనే చెప్పినంత ధర ఇచ్చేసి కొనేసి ఇంటికి తీసుకెళ్లి.. గబా గబా మింగేసేది కేవలం ఫార్మా ఫీల్డ్ లోనే. ఎందుకంటే అది భయం. సుస్తీ తగ్గాలి.., త్వరగా బాగైపోవాలనే భయం. ఆ భయంతో ఎవరికీ ఎంత కట్టబెడుతున్నా ఆలోచించలేం. ఇండియాలో ఇదే బలహీనత. అందుకే దేశంలోని టాప్ టెన్ బిలీనియర్లలో ఏడుగురు ఫార్మా పరిశ్రమల వాళ్ళు ఉన్నారు.

Corona vaccine ; 50 Lakhs rent for One week..!?
Corona vaccine ; 50 Lakhs rent for One week..!?

కోవిడ్ వాక్సిన్ తయారు చేసి పైపైకి..!!

మామూలు రోగం వస్తేనే మనసు ఆందోళనగా ఉంటుంది. అదే ప్రాణాంతక కరోనా వస్తే విలవిలలాడుతోంది కదా..! అందుకే కరోనాకి విరుగుడు టీకాని దేశంలో రెండు కంపెనీలు విడుదల చేశాయి. ఒక భారత్ బయోటెక్ వారి కొవాక్జిన్ .., రెండోది సీరం ఇన్స్టిట్యూట్ వారి కోవీషిల్డ్. ఇప్పుడు దేశం, ప్రపంచం వీటి కోసమే ఎదురు చూస్తుంది. ఈ వాక్సిన్ తయారీతో ఆ రెండు కంపెనీల చరిత్ర మారిపోయింది. నిజానికి ఈ వాక్సిన్ తయారీ వ్యయం ఎంత..? ఒక్కో డోసుకి ఎంత ఖర్చు చేసారు..? ఎమ్మార్పీ ఎందుకు అంతగా పెట్టారు..? అని ఎవ్వరైనా ప్రశ్నించగలరా..!? అలా ప్రశ్నించే స్థాయిలో ఉన్నవాళ్లు సైలెంట్ గా ఉన్నాక.. ఇంకెవ్వరూ అడగలేరు. అందుకే ఆ కంపెనీలు వెలిగిపోతాయి. అనుహ్యంగా షేర్ ధరలు పైపైకి చేరిపోయాయి. అందుకే సదరు కోవీషిల్డ్ తయారు చేసిన కంపెనీ ఓనర్ వారానికి అరకోటి.. కాకపోతే వారానికి కోటి రూపాయల అద్దె చెల్లించైనా భవనాలు తీసుకుంటారు..!!


Share

Related posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌‌, వీర్రాజు భారీ ప్లాన్‌… అంత‌లోనే ఢిల్లీ షాక్‌? 

sridhar

ఆయోధ్యలో ప్రధాని మొదట ఈ గుడిలోనే పూజ నిర్వహించారు !

Sree matha

Sweet corn : మంచి స్కిన్ టోన్ సొంతం చేసుకోండిలా..

bharani jella