NewsOrbit
5th ఎస్టేట్ Featured న్యూస్

ఫేస్ బుక్ ద్వారా “దరువే”శారు..! పోలీసులు పెట్టేసారు – సీఎంలు వదిలేశారు..!!

మీడియా మారిపోయింది. పార్టీ రంగుల ముసుగు తగిలించుకుంది. జర్నలిజం విలువలు కోల్పోయింది. అందుకే డిజి మీడియా దూసుకొచ్చింది. ఇదేమైనా సక్కగా ఉందా..? అంటే ఇది కూడా కాస్త పలుకుబడి వస్తే చాలు విలువలు తాకట్టు పెట్టేస్తుంది. తోచినోళ్ళకి “దరువు” కొడుతోంది. అటువంటి ఓ వెబ్ సైట్ యజమాని పరిస్థితి ఇప్పుడు తెలుగునాట పెద్ద చర్చకు దారితీస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో బాగా పేరొందిన వెబ్ సైట్లలో దరువు ఒకటి. దాని యజమాని కరణ్ రెడ్డి. తెలంగాణాలో కేసీఆర్ కి, ఏపీలో జగన్ కి బాగానే భజనలు చేస్తూ వార్తలు రాస్తుంటారు. ఇద్దరి ఉమ్మడి శత్రువు చంద్రబాబుపై పగపడుతూ రాస్తుంటారు. అటువంటి దరువు రెడ్డి ఇప్పుడు కష్టాల్లో పడ్డారు. పోలీసులు అరెస్టు చేసారు. అతని కార్యాలయాల్లో తరచూ సోదాలు చేస్తున్నారు. కానీ ఎందుకో తెలుగు రాష్ట్రాల సీఎంలు పెద్దగా పట్టించుకోవడం లేదు. మీడియాతో తమకు భజన చేసిన కరణ్ రెడ్డిని రెండు రాష్ట్రాల అధికార పార్టీలు వదిలేశాయి. ఇంతకూ ఆయన చేసిన ఘనకార్యం ఏమిటంటే..!?

Daruvu MD

ఫేస్ బుక్ తో యువతికి వల..!!

అంత మీడియా సంస్థ అధిపతి. మరోవైపు కరణ్ కాన్సెప్ట్స్ అంటూ కొత్త వేదిక నిర్వహిస్తున్నారు. ఫేస్ బుక్ లో యాక్టీవ్ గా ఉంటూ ఓ యువతితో మాట కలిపారు. పరిచయం పెంచుకున్నారు. ప్రేమ వల వేశారు. కార్యాలయానికి రప్పించుకున్నారు. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో ఆమె పోలీసులకు పిర్యాదు చేసారు. ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి. కరణ్ రెడ్డి అధనపు కళలు పోలీసులు నిర్ధారించుకున్నారు. కార్యాలయంలో లైంగిక కార్యకలాపాల ఆరోపణలు ఉండడంతో సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. పోలీసులు ఈ కేసుని సీరియస్ గా తీసుకుని, లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

సీఎంలు వదిలేసినట్టేనా..!?

నాయకులకు భజనలు కావాలి. ఎన్నాళ్లయినా భజనలు చేయించుకుంటారు. అందుకు ఫలితంగా చిన్న చిన్న ప్రతిఫలాలు ఆశించవచ్చు..! కానీ “మీకు భజనలు చేస్తా… నా పెద్ద పెద్ద తప్పులను మన్నించండి” అంటూ కళ్ళు మూసుకుని గుడ్డిగా ఇలా చేస్తే ఏ నాయకులూ వంత పాడరు. ఇప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా చాలా చురుకుగా ఉంది. పైగా కరణ్ రెడ్డిపై నమోదయిన కేసు పెద్దదే. ఆ యువతీ కూడా పదే పదే పోలీసుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ ఒత్తిడి చేస్తున్నారు. అందుకే దీనిలో నాయకులూ ఎవరూ పట్టించుకోవడం లేదు. సీఎంలూ వదిలేసారు. పోలీసులు పట్టు బిగించేసారు. అలా ఆ “దరువు” శృతిమించిందన్నమాట..!!

 

 

 

 

author avatar
Srinivas Manem

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N