NewsOrbit
5th ఎస్టేట్ Featured బిగ్ స్టోరీ

Eenadu Corona: “ఈనాడు” శవాలకు సాక్ష్యమెవరు…! పెద్దరికం ఎటు వెళ్ళింది..!?

Covaxine Bharath Biotech: vaccine issues in india

Eenadu Corona: మొదటి ప్రశ్న:
ఇండియాలో విజయవంతంగా విడుదలైన మొదటి కరోనా వాక్సిన్ ఏది..!? కోవాక్జిన్

కోవాక్జిన్ ఎవరిది..!? – భారత్ బయోటెక్ అనే ఫార్మా కంపెనీది..!

భారత్ బయోటెక్ కంపెనీ ఎవరిది..!? – కృష్ణ ఎల్లా అనే ఒక ఫార్మా శాస్త్రవేత్త- వైద్య పరిశోధకుడిది..!

ఈ కృష్ణ ఎల్లా కుమారుడు ఎవరు..!? – వీరేంద్రదేవ్ రాచెస్..!

ఈ వీరేంద్రదేవ్ రాచెస్ ఎలా పరిచయం..!? – రామోజీ మనవరాలు .. ఈనాడు ఎండీ కిరణ్ కుమార్తె సహారి భర్త.

ఈ ఈనాడులో కరోనా మరణాలకు కోవక్జిన్ కి, భారత్ బయోటెక్ కీ.. మాత్రం సంబంధం లేదు. వారికి టీకా వేయలేదు. వేసే అదృష్టానికి కూడా ఆ సిబ్బంది నోచుకోలేదు. ఈనాడుకీ కోవక్జిన్ కీ సంబంధం ఉంది. ఈనాడుకు సిబ్బందికి సంబంధం ఉంది. ఈనాడుకీ ఈ సిబ్బంది కరోనా మరణాలకు సంబంధం ఉంది..!

Eenadu Corona: Staff Dying Management Sleeping
Eenadu Corona Staff Dying Management Sleeping

Eenadu Corona: 2017 జూలై 28 న ఈ ఇద్దరి వివాహం జరిగింది. రెండు పెద్ద కుటుంబాలు ఒక్కటయ్యాయి. రామోజీ – కృష్ణలు వియ్యంకులయ్యారు. అక్కడితో ఆగలేదు. అలా అలా బంధం బలపడింది. ఎంతగా అంటే..! భారత్ బయోటెక్ కోవాక్జిన్ కి ప్రయోగాలు మొదలు పెట్టినప్పటి నుండి.. ప్రయోగాలు పూర్తయి జనంలోకి విడుదల చేసే వరకు ఎక్కడా ఏ మాత్రం వెనుకాడకుండా.., నిత్యం ఫోటోలు, వార్తలు వేస్తూ భారత్ బయోటెక్ ని ఈనాడు విపరీతంగా ప్రమోట్ చేసింది. మంచి మంచి వార్తలు, ఇంటర్వ్యూలు, పెట్టుడు వార్తలు, కట్టుకు వార్తలు, వండిన వార్తలు.. ఎలాగోలా ఇరికించి, ఇరికించి అయినా హైలైట్ చేసింది. అదేం తప్పు కాదు. వారి వ్యాపారం.., వారి ఇష్టం. ఈ కోవాక్జిన్ అనే ప్రాజెక్టులో ఈనాడు ఎండీ కిరణ్ తరపున కొంత పెట్టుబడి కూడా పెట్టారని ఒక పుకారు ఉంది. ఏమో.. ఇది ఆ రెండు కుటుంబాల వ్యాపార అంశం.. బయట మనకు సంబంధం లేదు… కాకపోతే ఇక్కడ మనకు సంబంధం ఉన్న అంశమేమిటంటే..!!?

కరోనా తో జర్నలిస్టులు మరణిస్తున్నారు. గడిచిన 20 రోజుల్లో 16 మంది మరణించారు. యాజమాన్యాలకు ఈ పాణాలంటే పట్టింపు ఉండదు. ఈ కుటుంబాలంటే లెక్క ఉండదు. ఈ కన్నీటికి విలువ ఉండదు. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, హెచెంటీవీ, టీవీ 9 , ఎన్టీవీ వంటి పెద్ద సంస్థలకు తప్ప చిన్న చిన్న పత్రికలూ, సంస్థలకు సిబ్బంది అంటే ఏ మాత్రం పట్టింపు ఉండదు. ఇక్కడ పేర్కొన్న సంస్థలన్నీ తమ సిబ్బందిని ఉద్ధరిస్తాయని కాదు. ఇవి కాస్త జాగ్రత్తలు చెప్తాయి. కానీ స్కోరింగ్, బ్రేకింగ్ కోసం వెంపర్లాడతాయి. అసలు పట్టించుకోని సంస్థల కంటే ఘోరంగా పట్టించుకుని పీక్కుతినే రకాలు ఈ సంస్థలు. వీటిలో ఈనాడు పాత్ర పూర్తి భిన్నం. “ప్రత్యేక వార్త.. ప్రత్యేక ఫోటో, ప్రత్యేక కోణం, ప్రత్యేక కవరేజీ అంటూ రిపోర్టర్లను ముప్పుతిప్పలు పెడుతుంటుంది..! ఇప్పుడు ఈ ప్రాణ సంకటం ఈ సంస్థలన్నిటికీ వచ్చింది. కానీ ఈనాడుదే ఎందుకు బాధ్యతంటే..!?

Eenadu Corona: Staff Dying Management Sleeping
Eenadu Corona Staff Dying Management Sleeping

Eenadu Corona: ఈనాడులో మరణం మృదంగం వినిపిస్తుందా..!?

కరోనాతో గడిచిన రెండు వారాల్లో 16 మంది జర్నలిస్టులు మరణించారు. దీనిలో ఈనాడు వాటనే అధికం. తాజాగా “ఈనాడు” ఆదిలాబాద్ డెస్క్ సబ్ ఎడిటర్ రంజన్ అలీ (56 ) కరోనాతో మరణించారు. అదే ఆదిలాబాద్ డెస్కులో మరో అయిదుగురు కరోనా పాజిటివ్ తో బాధ పడుతున్నారు. ఇద్దరికీ పరిస్థితి కొంచెం ఆందోళన కరంగానే ఉంది. సిద్ధిపేటలో పని చేసే ఒక రిపోర్టర్ (కంట్రిబ్యూటర్) నాగరాజు కూడా గత వారం మరణించారు. ఈనాడు యజమాన్యానికి కంట్రిబ్యూటర్లు మరణిస్తే పెద్ద లెక్క కాదు. ఆ విషయం బయట ప్రపంచానికి తెలియనీయరు. వార్త కూడా వేయరు. దేశం మొత్తం మీద జర్నలిస్టులు మరణిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఇది ఎక్కువగానే ఉంది. మిగిలిన సంస్థలను పక్కన పెడితే “మేము ప్రత్యేకం.. మాకు తోకలున్నాయి.. మేము నిజాయతీ.. మేము నిప్పు.., మేము ఆదర్శం.. మేము నంబర్ వన్…”…  అది చాలక భారత్ బయోటెక్ వాక్సిన్ మంచిది.. భారత్ బయోటెక్ వాక్సిన్ వేయించుకోవచ్చు… కొవాక్జిన్ వలన సైడ్ ఎఫెక్ట్స్ లేవు.. కోవక్జిన్ కి అంతర్జాతీయ ఖ్యాతి” అంటూ నానా రకాలుగా భజనలు కొట్టిన ఈనాడుకు ఇప్పుడు ఆ సిబ్బంది మరణ మృదంగం వినిపించడం లేదా..!? ఆ కుటుంబాల కన్నీటి ధార కనిపించడం లేదా..!?

Eenadu Corona: Staff Dying Management Sleeping
Eenadu Corona Staff Dying Management Sleeping

సిబ్బంది పట్ల నిర్లక్యం ఎందుకో..!?

ఈనాడు కి మొదటి నుండి తమ సిబ్బంది అంటే విపరీత నిర్లక్ష్యం. కులాలను బట్టి సిబ్బందిని చూసే విధానం అంతర్గతంగా ఉంటుంది. భజనలు, డప్పులు, అంతర్గత అవినీతి వ్యవహారాలు బోలెడు ఉంటాయి..! ఇవన్నీ పక్కన పెడితే భారత్ బయోటెక్ విడుదల చేసిన కోవక్జిన్ వాక్సిన్ రెండు నెలల నుండి వేస్తున్నారు. 45 ఏళ్ళు పైబడిన వారికి వేస్తూనే ఉన్నారు. కానీ ఈనాడు తమ సిబ్బందికి ఎందుకు వేయించలేదు…!? ప్రభుత్వంతోనూ.., భారత్ బయోటెక్ యాజమాన్యం(తమ వాళ్ళేగా) మాట్లాడి ఎందుకు సిబ్బందికి ప్రత్యేక వాక్సిన్ డ్రైవ్ నిర్వహించలేదు.. పోనీ.. 45 ఏళ్ళ లోపు అంటే నిబంధనలు ఒప్పుకోవు.. మరి 45 ఏళ్ళు పైబడిన వారికి కూడా ఎందుకు వాక్సిన్ విషయంలో చొరవ తీసుకోలేదు. నెల రోజుల కిందట ఒక అంతర్గత సమావేశంలో “అందరికీ వాక్సిన్ వేయించే విషయమై మాట్లాడుతున్నాం” అని నమ్మకం కల్పించి ఆ తర్వాత ఎందుకు చేతులెత్తేసినట్టు..!? దాని ఫలితమే ఈ మరణ కాండ..! ఎంత దౌర్భాగ్యం అంటే…!! ఆ కొవాక్జిన్ వార్త రాసిన వాడికీ.. ఆ వార్త దిద్దిన వాడికీ.. ఆ వార్త పెట్టిన వాడికీ.. ఆ వార్తకి మేకప్ చేసిన వాడికీ 45 ఏళ్ళు పైబడినప్పటికీ వాక్సిన్ అందించలేదు. యాజమాన్యాలు చొరవ తీసుకోలేదు. ఆ ఫలితమే ఇప్పుడు ఈనాడులో కరోనా తాండవం. ఈనాడులో ఇప్పుడు చాల మంది ఉద్యోగులకు కరోనా సోకుతుంది. రామోజీ ఫిలిం సిటీలోని ప్రధాన కార్యాలయం డెస్కులోనే మొదటి ఫ్లోర్ లో ఆరుగురికి, రెండో ఫ్లోర్ లో 12 మందికీ కరోనా పాజిటివ్ ఉంది..! ఇక జిల్లాల డెస్కుల్లోనూ.. క్షేత్రస్థాయి సిబ్బందికి లెక్కే లేదు..! దీనికి బాధ్యులెవరు..!? ఈ కన్నీటిని తుడిచేదెవరు..!?

author avatar
Srinivas Manem

Related posts

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju