NewsOrbit
5th ఎస్టేట్

ఇదో ఎట్టి చాకిరీ…!

Eenadu ; Unit Offices to be Closer

నీటిలో గాలం వేసి చేప కోసం వేచి చూడడం… అడవిలో వల వేసి జింక కోసం చూడడం… ఆ సంస్థలో ఉద్యోగుల చిన్నపాటి తప్పుల కోసం వేచి చూడడం సహజంగా మారింది. పాపం వెట్టి చాకిరీ చేయించుకోవడం అలవాటు పడిన ఈనాడులో క్రమేణా సీనియర్లకు కోత పెడుతుంది. ఆ సంస్థలో రూ. 50 వేలు పైబడిన జీతం ఉన్న ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతుంది. ఏ క్షణాన ఎవర్ని పక్కన పెడతారో తెలియక ఉద్యోగులు అత్యంత ఆత్మరక్షణలో పడి దిగులుగా ఉద్యోగాలు చేస్తున్నారు. సాకులు చూపి పక్కన పెట్టడం, ఆ సంస్థలో ఇటీవల ఎక్కువయ్యాయి. గడిచిన నెల రోజుల వ్యవధిలో ఇలా చాల మందికి పొగ పెట్టారు.Eenadu ; Unit Offices to be Closer

ఏం చేశారంటే… ఎందుకు తీశారంటే …!

పాపం.. నెల్లూరు జిల్లా ఎడిషన్ లో ఇటీవల ఓ వార్తా మిస్ అయ్యారట. ఇతర పత్రికల్లో వచ్చిన వార్త ఈ పత్రికలో రాలేదట. అందుకు బాధ్యుడుగా ఆ డెస్క్ ఇంఛార్జిని పక్కన పెట్టారు. నెలకు రూ. 74 వేలు జీతం అందుకునే ఆ ఉద్యోగి ఇప్పుడు నిరుద్యోగి అయ్యారు. ఇదే తరహాలో కర్నూలులో పని చేస్తున్న డెస్క్ ఉప ఇంఛార్జిని పక్కన పెట్టారు. అతని వేతనం రూ. 60 వేలు ఉంటుంది. అంతేకాక హైదరాబాద్ లో  పనిచేసే మరో నలుగురిని తొలగించారు. ఇవన్నీ సిల్లీ కారణాలే, బాద్యులు ఎవరో… కానీ బలి చేసింది వీరిని. కారణం ఏమిటంటే వీళ్లకు జీతాలు ఎక్కువగా ఉండడమే. ఈ ఘటనలతో ఆ సంస్థలో 50 వేలు పైబడి జీతాలున్న ఉద్యోగులు చాల ఆత్మరక్షణలో పడ్డారు. కడపలో డెస్క్ ని పూర్తిగా మూసేసారు. లాక్ డౌన్ వచ్చాక ఇప్పటికి 9 మందిని పక్కన పెట్టారు.

నీతులు చెప్పడానికేనా…!

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తమ సంస్థల్లో 50 మందిని తొలగించారు. ఈనాడులో క్రమముగా తీసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళిద్దరూ తమ పత్రికలూ , చానెళ్లు ద్వారా చెప్పే నీతులు అన్నీ, ఇన్నీ కావు. ఇప్పుడు తమ సంస్థల్లో సిబ్బందిని పురుగుల్లా చూస్తూ కనీస సౌకర్యాలు కల్పించకుండా.. పైగా ఉచిత సలహాలు ఇస్తూ గడిపేస్తున్నారు.
* ఈనాడులో 2015 నుండి ఈ తరహా శ్రమ దోపిడీ ఆరంభమయ్యింది. ఆ సంస్థ ఒక పక్కా వ్యూహం వేసుకుని అమలు చేస్తుంది. ఎక్కువ జీతం ఉన్న సీనియర్లను తొలగించి… తక్కువ జీతానికి కొత్త వారిని నియమించుకోవడమే ఆ సంత పని.
* 2015 నుండి ఈనాడు డిజిటల్ పేరిట ఓ కొత్త సంస్థని ఆరంభించి, నియామకాలు చేస్తుంది. దీని ద్వారా కనీస వేతనం రూ. 13 వేలు, గరిష్ట వేతనం రూ. 30 వేలు. ఎన్నాళ్లు పని చేసినా అంత కంటే దాకా వేతనం ఇవ్వడం లేదు. దీని కోసం యూనివర్సిటీలోనే నేరుగా నియామకాల శిబిరాలు నిర్వహిస్తూ జర్నలిజం, విలువలు అంటూ మాటల వల వేసి, ఏడాది శిక్షణ ఇస్తున్నారు. తర్వాత తక్కువ జీతానికి ఎక్కువ పని చేయిస్తున్నారు.
* వారిని నియయమించుకుని ఉన్న సీనియర్లను పొమ్మనలేక పొగబెడుతున్నారు. అంటే ఒక సీనియర్ కి ఇచ్చే వేతనం అక్కడ ముగ్గురు జూనియర్లకు ఇవ్వవచ్చు. ఈ ముగ్గురు చేత అధికంగా పని చేయించి… యూనియన్లు లో చెరకుడు,ప్రభుత్వ లబ్ది పొందకూడదు అంటూ నెట్టుకొస్తోంది. గడిచిన నాలుగేళ్లలో ఈనాడు నుండి 12 మంది సీనియర్ ఫోటో గ్రాఫర్లు, 32 మంది సెక్యూరిటీ సిబ్బంది, 30 మంది షబ్ ఎడిటర్లను పొమ్మన లేక పొగబెట్టి.., బలవంతంగా రాజీనామాలు చేయించింది. ఒక ముఖ్య గమనిక ఏమిటంటే… ఈ తీసివేతల్లో ఏ ఒక్కటీ వారి సామాజిక వర్గం లేదు. ఈనాడులో కథలు , ఆ సామజిక వర్గ కథలు ఎంత చెప్పుకున్నా ఉంటూనే ఉంటాయి. సమయం చూసుకుని, ఈనాడులో అంతర్గత అవినీతిని ప్రస్తావించుకుందాం.

author avatar
Srinivas Manem

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau

Leave a Comment