NewsOrbit
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

జగన్ పై “అసంతృప్తి – అవినీతి” ఓ వాస్తవం..!!

అధికార పార్టీలో అసంతృప్తి – అవినీతి రాజుకుంటుందా…? అదే నిజమైతే కారణాలు ఏంటి…? ధర్మాన, ఆనం, మహిధర్ రెడ్డి వంటి సీనియర్ ఎమ్మెల్యేల తిరుగుబాటు వెనుక వ్యూహం ఏంటి..? ఇసుకలో జరుగుతున్న లోపాలు, అసలు విషయం ఏంటి…?? నాడు చంద్రబాబు పాలన, నేటి జగన్ పాలనలో ఎమ్మెల్యేల విషయంలో ముఖ్య తేడాలు ఏంటి..? అనే కీలక అంశాల విశ్లేషణ ఒకసారి లోతుగా వెళ్లి చూద్దాం..

అహం తెచ్చిన అసహనం…!

ఎన్నడూ లేని విధంగా గా ప్రభుత్వ తీరుపై సీనియర్ ఎమ్మెల్యేలు బహిరంగ వ్యాఖ్యలు చేశారు. దీని వెనక ఏమైనా ప్రత్యేక అజెండా.., కారణాలు.. ఏమైనా ఉన్నాయా అనేది చెప్పుకోవాలంటే…. ముఖ్యంగా “పనులు జరగడం లేదు” అనే “అసహనం” అసంతృప్తి రూపంలో బయటకు వచ్చి ఉండొచ్చు. వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వారిలో ముగ్గురూ బాగా సీనియర్ నాయకులు. ఆనం రామనారాయణ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, మానుగుంట మహేందర్ రెడ్డి… ఈ ముగ్గురూ చాలా సీనియర్ ఎమ్మెల్యేలు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వాళ్ళు. సో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. జగన్ వీళ్ళకు మంత్రి పదవులు ఇవ్వకపోవడం ఒక కారణంగా ఉంటే.., స్థానికంగా పనులు జరగడం లేదని మరో కారణం ఉండొచ్చు. గతంలో జిల్లా స్థాయిలో చక్రం తిప్పిన ఈ సీనియర్ నేతలు ఇప్పుడు తమ నియోజకవర్గంలో పనులు చేయించుకోవడం జాప్యం కారణంగా అసంతృప్తి వచ్చి ఉండవచ్చు అనే వాదనలు బయటకు వస్తున్నాయి. “దీన్ని ఆంధ్రజ్యోతిలో ఏదో జరిగిపోతుంది. జగన్ కి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు ఏకమవుతున్నారు” అనే రీతిలో కొత్త పలుకులు పలికారు.

బాబు కోటరీకి జగన్ భిన్నం…!

ఇక్కడే రాధాకృష్ణ తన కొత్త పలుకులో తన బాస్ చంద్రబాబు కోటరీ గురించి కూడా రాస్తే బాగుండేది. చంద్రబాబుకి.., జగన్ కె పరిపాలనలోను.., పార్టీ అధినేత గాను కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. చంద్రబాబు చుట్టూ కొంతమంది నాయకుల కోటరీ ఉండేది. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఏ పనులు జరగాలన్నా.., సీఎం స్థాయిలో మాట సాయం కావాలన్నా.. ఆ కోటరీ నాయకుల ద్వారా నడిపించుకునే వాళ్ళు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి దగ్గర అ ఇటువంటి కోటరీ పనిచేయడం లేదు. లాబీయింగులు పని చేయడం లేదు. ఎమ్మెల్యేలకు అందనంత దూరంలో జగన్ ఉండి పోయారు. అందుకే ఈ అసంతృప్తి వెనుక ఇది కూడా ఒక కారణం కావచ్చు. దీనిలో జగన్ లో నాటుకున్న ఒక భావన కీలక కారణంగా కనిపిస్తోంది. తనను చూసే మాత్రమే ఓట్లు వేశారు 151 స్థానాలు గెలిపించారు అని నమ్ముతున్న జగన్…. ఎమ్మెల్యేల బాధ్యత కూడా పూర్తిగా తనే తీసుకున్నారు. అందుకే అపాయింట్మెంట్ లో విషయంలో లో అవకాశం ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని ఎరిగిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ కీలక విషయాన్ని పక్కన పెట్టి పలుకులు పలికారు.

ఇసుక అవినీతి ఉందా..? లేదా..?

ఇసుకలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక నాటుకున్న అవినీతి ఉంది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు.., ఎమ్మెల్యేలు ఎంత అవినీతికి పాల్పడినా.. ఇసుక పేరు చెప్పి లక్షల్లో వెనకేసుకున్నా… సామాన్య పౌరుడికి మాత్రం ఇసుక అందుబాటులో ఉండేది. అది అక్కడ ప్లస్..! కానీ ఇక్కడ జగన్ ప్రభుత్వంలో అవినీతి అలాగే ఉండగా… ఇసుక మాత్రం సామాన్యులకు అందడం లేదు. ఇది పెద్ద మైనస్..! ఇది జగన్ స్థాయిలో తెలిసిన అవినీతి అనుకోలేము… క్షేత్రస్థాయిలో గత ప్రభుత్వంలోనూ… అంతకుముందు ప్రభుత్వం లోనూ…, ఇప్పుడు నాటుకున్న వాళ్లే. ఇలా ఇసుక అవినీతి చేసేవాళ్ళు ఏళ్ల తరబడి ఉన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఈ అవినీతి జరుగుతూనే ఉంటుంది. దీన్ని కాదనుకొని సామాన్యులకు ఇసుక అందించడమే జగన్ కు కీలకమైన పని. సామాన్యులకు అవసరమైన ఇసుక అందితే… ఇదిగో అవినీతి అదిగో అవినీతి అనే మాటలు బయటకు రావు.

మద్యంపై మరో మార్గం మంచిది…!

ఇక మద్యం విషయంలో ప్రభుత్వ వైఖరి భిన్నంగా ఉంది. ప్రజలకు అందుబాటులో లేకుంటే మందు మానేస్తారనే “అపోహ…, దూరా ఆలోచన”లో ప్రభుత్వం ఉంది. అందుకే చిన్న చిన్న బ్రాండ్లు తీసుకురావడం.. కీలకమైన వాటిని అమ్మకపోవడం.., ధరలు విపరీతంగా పెంచడం.., వంటివి జరుగుతున్నాయి. ఈ బ్రాండ్ పేరు లోగోలు, తయారీ వ్యవహారాలు అన్ని “లోకల్” అనే ముద్ర ఉండటంతో పెద్ద అవినీతి జరుగుతుందనే వాదన క్షేత్ర స్థాయికి వెళుతుంది. దీన్ని నియంత్రించుకుంటే నష్టం తప్పదు. కేవలం అనుభవలేమి కొంత…, అసమర్ధత కొంత…, అవగాహన లేమి కొంత… ఇవన్నీ కలిసి “అసంతృప్తి అవినీతి” అనే వాదనలకు తావిస్తున్నాయి. రాధాకృష్ణ లాంటి వారికి లేని బలాన్నిస్తున్నాయి.

author avatar
Srinivas Manem

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju