NewsOrbit
5th ఎస్టేట్ మీడియా

జీతాలు .. సగం జీతాలు .. గుడ్ బై .. ఇదీ మైన్ స్త్రీమ్ మీడియా ప్రెజెంట్ పరిస్థితి

ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకునేందుకు మనకు మీడియా కావాలి. ఇక మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలతో సహా రాష్ట్రంలోని నేతల అంతర్గత వ్యవహారాల వరకూ ప్రతీ ఒక చిన్న విషయాన్ని మీడియా మీ ఇంటి దాకా చేరుస్తుంది. అలాంటి మీడియా లో జరిగే వివరాలు తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్లాలి? ఒకరి గురించి ఒకరు చెప్పుకోరు…. మరి వారి గురించి వారే చెప్పుకుంటారా…. అంటే అదీ జరగదు. అంతా బాగుంది అనుకునే మీడియాలో ఉన్న లోటుపాట్లు ఈ కరోనా కారణంగా బయట పడిపోయాయి. అత్యంత లోతుగా తెలియకపోయినా పైపైన పెచ్చలు అన్నీ ఓడిపోయి లోపలి రంగు బయట పడుతోంది.

 

Live Industry Updates: VICE Media Donates Free Ad Inventory To ...

పెద్ద పెద్దోళ్ళే దెబ్బైపోయారు….

రామోజీ రావు గారిది ఎంత పెద్ద సామ్రాజ్యం..! అలాంటి వ్యక్తి అధిపతిగా ఉన్న ఈనాడు పత్రిక లోనే కరోనా సంక్షోభం మొదలైన కొద్ది రోజులకి ఉద్వాసనలు వరుసబెట్టి చోటుచేసుకున్నాయి. ఈనాడులో పేజీల సంఖ్య తగ్గించేశారు…. దానికి తోడు చాలా మంది ఉద్యోగులకు, దశాబ్దకాలంగా పని చేస్తున్న నమ్మకస్తులకు జరగాల్సిన సెటిల్మెంట్లు జరగలేదని ఎన్నో విమర్శలు, వాదనలు, ఉత్తరాలు. అసలు అతనికి ఉన్న అనేకానేక వ్యాపార లావాదేవీలలో ఈనాడు ఒకటి. బిజినెస్ టైకూన్ లు అందరూ ఇలా నాలుగైదు వ్యాపారాలలో పెట్టుకుని ఒక దానిలో నష్టం వచ్చినా మరొకదానితో వచ్చిన లాభాలతో కవర్ చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కానీ ఒక్కసారిగా రామోజీరావు లాంటి వ్యక్తి తన సంస్థలోని ఉద్యోగులనే తీసి పారేశారు అంటే పరిస్థితి తీవ్రత ఏమిటో మిగతా వారికి అర్థం అయిపోయింది.

ఇక చోటామోటా ఛానల్ సంగతి చూద్దాం

హెచ్ఎం టీవీ ఛానల్ అందరికీ సుపరిచితమే అయినా రేటింగ్స్ విషయంలో మాత్రం దానికన్నా ముందు వరుసలో ఉంటాయి టీవీ9, ఎన్టీవీ, టీవీ 5 తదితర ఛానెళ్ళు. అయినా తనకంటూ ఓ పేరు సంపాదించుకొని ఏదోరకంగా తమ బండి నడిపిస్తోంది ఈ ఛానల్. అయితే తాజాగా ఈ ఛానల్ లో అత్యధిక రేటింగ్ వచ్చే జోర్దార్ వార్తలు అనే ప్రోగ్రాం ఇన్చార్జి రత్న కుమార్ అందరికీ అప్పగింతలు చెప్పేసి సంస్థ నుంచి బయటికి వెళుతున్నట్లుగా వెల్లడించారు. ఇప్పటికే సీఈఓ శ్రీనివాస్ రెడ్డి బయటకు వెళ్లిపోయారు. కొత్తగా చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి పగ్గాలు చేపట్టాడు. ఇకపోతే ఈ సంస్థ ఓనర్ వామనరావు మీద ఇప్పటివరకు ఒక మంచి అభిప్రాయం ఉండేది. ఉద్యోగులకు కరెక్ట్ సమయానికి జీతాలు ఇవ్వడం ఏదైనా సమస్య వస్తే మానవీయ కోణంలో చూసి ఆదుకోవడం ఇతని నైజం అని చెబుతారు. అయితే ఇప్పుడు సగం జీతాలు ఇస్తున్నారు…. దానికి అనుబంధంగా నడిచే హాన్స్ ఇండియాలో కూడా ఇదే పరిస్థితి. అంతెందుకు తీన్మార్ వార్తల రాములమ్మ గా పాపులర్ అయిన రమ్య కృష్ణ జోర్దార్ వార్తల్లో పనిచేస్తుంటే మొన్నటికి మొన్నే ఆమెనూ తీసేశారు.జోర్దార్ వార్తల తోనే ఆ ప్రోగ్రామ్ కి కాసిన్ని రేటింగ్స్ అయినా వస్తున్నాయి. అయితే వారిని తీసేంత పరిస్థితి నెలకొంది అంటే సమస్య తీవ్రత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు

మరి మిగతా వారి సంగతి..?

అరకొర జీతాలు…. ఎక్కువ మాట్లాడితే తీసివేతలు…! లేదంటే రాజీనామాలు. ఇదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో మెయిన్ స్ట్రీమ్ మీడియా పరిస్థి.తి యాంకర్లు మారిపోతున్నారు…. ప్రసారాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి కూడికలు, తీసివేతలు రోజూ ఇదే పని. ప్రస్తుతం ఎవరు ఉంటున్నారో.. ఎవరు పోతున్నారు ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో అర్థం కాక గందరగోళం. ఈ ప్రభావం ఎవరి పైన ఎలా పడిందో కానీ ఈ కరోనా సంక్షోభం మీడియా వారిని మాత్రం అతలాకుతలం చేసింది అన్న విషయం స్పష్టం గా కనబడుతోంది. ఇక మైకు పట్టుకుని జనాల.మొహాల్లో పెట్టే మన మీడియా సోదరులు, సోదరీమణులు అటు ఇంటర్వ్యూలు, పబ్లిక్ పల్స్ అంటూ వీధిలోకి పోవడమే కాకుండా బ్యాంకులకు పోవడం కూడా మానేసి చాలా కాలం అయింది అని సెటైర్లు వినిపిస్తున్నాయి.

ఎంతైనా వారి పరిస్థితి బాగుంటేనే మన రాష్ట్రంలోని రాజకీయాల అసలు పరిస్థితి మనకి అర్థమవుతుంది. సెటైర్ల మాటలు పక్కనపెడితే ప్రస్తుతం అంతంతమాత్రంగా ఉన్న మీడియా విలువలు కూడా ఈ కరోనా సంక్షోభం దెబ్బకి పడిపోతాయని అంతా భయపడుతున్నారు. మరి నిలదొక్కుకొని మళ్లీ పూర్వవైభవాన్ని వారు ఎప్పుడు సాధిస్తారా అని అంతా వేచి చూడడం తప్ప ఏమి చేయగలం..?

Related posts

Bigg Boss 7: రతిక రోజ్ గుండెలో ఇంత భారాన్ని మోస్తుందా? ఆ కారణం వల్లే రాహుల్‌తో బ్రేకప్ అయ్యిందా? నిజాలు బయటపెట్టిన పెద్దయ్య!

Raamanjaneya

MS Dhoni: డోనాల్డ్ ట్రంప్ తో ధోని గోల్ఫ్…

Deepak Rajula

ABN Andhra Jyothi: ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థను కేసిఆర్ సర్కార్ వెలి వేసినట్లేనా..!

sharma somaraju

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau