NewsOrbit
5th ఎస్టేట్ న్యూస్ రాజ‌కీయాలు

రైతుకెందుకీ పట్టింపు… అసలు బిల్లులో ఏముందో తెలుసా?

 

                          ( న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి )

పది మంది అన్నం పెట్టడానికి కష్టించే రైతు పిడికిలి బిగిస్తున్నాడు. మట్టితో సావాసం చేసే కర్షకుడు రణ భూమిలో పోరాటం చేస్తున్నాడు. మరణమో, విజయమో అన్నంతగా సాగును పక్కన పెట్టి తమ భవిష్యత్తు కోసం దేశ రాజధాని దగ్గర వేచి చూస్తున్నాడు. అసలు రైతుల ఆక్రోశం వెనుక కారణం ఏంటీ? కేందం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ విధానంలో ఏముంది? రైతుల అభ్యన్తరం ఏంటి? బీజేపీ పెద్దల వాదన ఏంటి అనేది ఒకసారి పరిశీలిద్దాం రండి..

భారతదేశ నూతన వ్యవసాయ విధానం (the new forming bill2020 )

సెప్టెంబర్ 17 వ తేదీన భారతదేశ నూతన వ్యవసాయ విధానం 2020 బిల్ లోకసభలో , సెప్టెంబర్ 20 వ తేదీన రాజ్య సభలో మూజువాణి ఓటు ద్వారా పాస్ అయింది. ఈ బిల్లుపై విపక్షాలు మొదటి నుంచి అభ్యన్తరాలు తెలుపుతున్నాయి. బిల్లు ద్వారా దేశ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వ్యవసాయం వెళ్లడం ద్వారా దేశంలో రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేస్తూ వ్యతిరేకిస్తున్నాయి. దింతో రాజ్యసభలో బీజేపీ కు సరైన బలం లేకపోవడంతో, కేవలం మూజువాణి వోట్ (చేతులు పైకి ఎత్తి లెక్కపెడతారు ) ద్వారా బిల్ పాస్ చేయించుకున్నారు.

మొదటి నుంచి పంజాబ్, హరియాణాల్లోనే వ్యతిరేకత

ఈ బిల్లు ద్వారా ఉత్తర భారత దేశంలో ఉన్న రైతాంగానికి తీవ్ర నష్టం చేస్తుందని, పంజాబ్, హరియాణా రైతులు ఇబ్బందుల్లో పెడతారనే ప్రచారం మొదటి నుంచి ఉంది. దింతో అక్కడి ప్రజాసంఘాల ఆగ్రహంతో బిల్లును వ్యతిరేకిస్తూ ఎన్డీఏ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ కు చెందిన ఎంపీ కేంద్ర ఫుడ్ ప్రోసెసింగ్ మంత్రిగా పనిచేస్తున్న హర్సిమ్ రాత్ కౌర్ బాదల్ రాజీనామా చేసారు . కేంద్రం తీసుకుంటున్న బిల్లు వాళ్ళ తమ ప్రజలు ఇబ్బంది పెడతారనే కోణంలో కేంద్ర మంత్రి రాజీనామా చేయడంతో విషయం అందరి దృష్టిని ఆకర్షించడమే కాదు… పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో బిల్ మీద ఉన్న వ్యతిరేకిత జాతీయ స్థాయిలో ప్రాజెక్ట్ అయ్యింది. విపక్షాలు, వామపక్షాలు ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తు దేశవ్యాప్త ఆందోళన బాట పట్టాయి.

 

బిల్లు ముఖ్యాంశాలు ఏమిటి అనేది ఒకసారి గమనిస్తే..

భారతదేశ నూతన వ్యవసాయ విధానంలో కీలకంగా 3 ఆర్డినెన్సు లు కనిపిస్తున్నాయి.

1 . ఏ పీ ఎం సి బైపాస్

ఇది బిల్లులో కీలకమైన ఆర్డినెన్స్. ఇప్పటివరకు రైతు తాను పండించిన పంటను స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోనే విక్రయించే వాడు. ప్రభుత్వ మద్దతు ధర ను అనుసరించి ఇక్కడే డబ్బులను పొందేవాడు. ఒక్కోసారి పంట పాడైనప్పుడు లేదా నాణ్యంగా లేనప్పుడు సరైన ధర వచ్చేది కాదు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తిష్టవేసిన దళారీలు రైతులను మోసం చేసేవారు. వ్యవసాయ మద్దతు ధర రావాలంటే సరుకు నాణ్యత లేదంటూ రకరకాల వంకలు పెట్టి రైతులను మోసం చేసేవారు. యార్డులో దళారీలు ఎంతకు చెబితే అంతకు అమ్ముకున్న ఘటనలో బోలెడు. రైతు ధర లేకున్నా దళారీలు చెప్పిన ధర గిట్టుబాటు కాకుండా వారికే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేది. మరో మార్కెట్ యార్డుకు తీసుకువెళ్లడానికి గానీ మరో చోట అమ్ముకోవడానికి గానీ రైతుకు అవకాశం ఉండేది కాదు. ఒకవేళ అలా తీసుకువెళ్లినా కొనేందుకు ఎవరూ రాకపోగా స్థానిక రైతుల నుంచి వ్యతిరేకత వచ్చేది. ఏపీఎంసీ బైపాస్ ఆర్డినెన్స్ లో రైతుకు పరిమితులు లేవు. దేశంలో ఎక్కడైనా అతడు పంటను అమ్ముకోవచ్చు. తను చేసిన కష్టం తాలూక శ్రమ ఎక్కడైనా పొందవచ్చు. ఒకవేళ ప్రైవేట్ వ్యక్తులు రైతులు కలిసి అతని పంటను తీసుకొని నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. నిల్వ చేసుకున్న పంటను ప్రైవేట్ సంస్థలు రేటు వచ్చినప్పుడు అమ్ముకోవడానికి ఈ బిల్లు వెసులుబాటు కల్పిస్తుంది. అంటే ఈ ఆర్డినెన్స్ ద్వారా కచ్చితంగా మార్కెట్ యార్డు ద్వారానే పంటను అమ్ముకోవాలని నిబంధన తీసి వేసినట్లు అయింది. భవిష్యత్తులో స్థానిక మార్కెట్ యార్డులకు అంతగా పని ఉండకపోవచ్చు. క్రమక్రమంగా మార్కెట్ యార్డుల నిర్వీర్యం మొదలు అవుతుంది.

** రైతుల అభ్యన్తరం ఏమిటి ?

ఈ ఆర్డినెన్సు విషయంలోనే ప్రధానంగా పంజాబ్, హరియాణా రైతులు అభ్యన్తరం చెబుతున్నారు. దేశంలోని మార్కెట్ యార్డులు 6 వేల వరకు ఉంటె వీటిలో 30 శాతం అంటే 2 వేల మార్కెట్ యార్డులు ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి. పంజాబ్, హరియానాలో ఎక్కువగా పాండే గోధుమ, వరిలో వారు బయట అమ్ముకోవడం బాగా తక్కువ. ప్రభుత్వమే మార్కెట్ యార్డుల ద్వారా మంచి ధరకు పంట కొంటుంది. ఇప్పుడు కొత్త విధానం ద్వారా మార్కెట్ యార్డులు క్రమంగా కనుమరుగు అవుతాయి. ప్రయివేట్ వ్యక్తులు పంటను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం కార్పొరేట్ యార్డులు వస్తాయి. దింతో ప్రభుత్వానికి వ్యవసాయంపై అజమాయిషీ ఉండదు. బాధ్యత ఉండదు . కార్పొరేట్ వాళ్ళు ఎంత ధర ఇస్తే అంతకు అమ్ముకునే పరిస్థితులు వస్తాయనేది ప్రధాన భయం.


2 ఫ్రీడమ్ ఆఫ్ ఫుడ్ స్టాకింగ్ బిజినెస్

రైతు పండించిన పంటను ఎప్పటికప్పుడు అమ్ముకోవాలి. దీని ద్వారా బ్లాక్ మార్కెటింగ్కు అవకాశం లేకుండా దేశ ఆహార అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చేలా విధానం ఉండేది. అయితే ఇప్పుడు దీనిలో ఈ ఆర్డినెన్స్ ద్వారా మార్పు తీసుకొచ్చారు. ఫుడ్డు స్టాకింగ్ బిజినెస్ ఆర్డినెన్స్ లో రైతు తాలూకా వ్యవసాయ ఉత్పత్తిని ఎంత మొత్తమైనా నిల్వ చేసుకోవచ్చు. ప్రైవేటు సంస్థలు తగిన అనుమతులు తీసుకుని రైతుల వ్యవసాయ ఉత్పత్తులను తమకు అనుగుణంగా నిల్వ ఉంచుకునే అవకాశం ఉంది. అలాకాకుండా రైతులంతా ఒక సంఘంగా ఏర్పడి వారి వ్యవసాయ ఉత్పత్తులను నిలవ చేసుకోవచ్చు. దీనిని ఎవరూ అభ్యంతర పెట్టరు. వారికి సరైన ధర వచ్చేవరకు దానిని నిల్వ చేసుకొని.. ధర వచ్చిన తర్వాత తగినట్లుగా మార్కెట్లో అమ్ముకునేందుకు రైతుకు ఇది వీలు కల్పిస్తుంది. గతంలో ఇలా పరిమితికి మించి నిల్వ చేసుకుంటే కేసులు ఉండేవి. సంస్థలు లేదా వ్యక్తుల మీద క్రిమినల్ కేసులను వ్యవసాయ అధికారులు పెట్టేవారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా దాన్ని రద్దు చేసినట్లు అయింది. రైతులు లేదా సంస్థలు తమ వ్యవసాయ ఉత్పత్తులను ఎంత అయినా దాచుకోవచ్చు.

** విపక్షాల భయం ఏమిటి??

ఈ ఆర్డినెన్సు అమలు అయితే దేశంలో విపరీతంగా బ్లాక్ మార్కెట్ పెరిగిపోతుంది. కృత్రిమ ఆహార కొరతను కార్పొరేట్ శక్తులు సృష్టించి తర్వాత వారు లాభపడే అవకాశం ఉంటుంది. మొత్తంగా దేశంలో ఎవరు ఎం తినాలో, ఇంతకీ తినాలో నిర్ణయించే అధికారం కార్పొరేట్ శక్తుల చేతికి వెళ్తుంది. తమకు నచ్చిన పంటనే రైతులతో వేపిస్తారు తప్ప, అవసరం ఉన్న ఇతర పంటలకు అంతగా లాభం రాని పంటలకు ప్రాధాన్యం ఇవ్వరు. ఇది కొత్త సమస్యలు, కరువు, ఆకలి చావులకు కూడా కారణం అవుతుంది.

*3* కాంట్రాక్ట్ ఫార్మింగ్

రైతులు ఒక పదిమంది కలిసి ఒక కమిటీగా ఏర్పడి తమ పంటలను ఎంత మేర… ఎలాంటి పంటలు పండించుకోవచ్చు..?? అనేది ప్రత్యక్షంగా కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. మధ్యలో ప్రభుత్వాలు గాని మధ్యవర్తులు గానీ ఉండరు. ప్రైవేట్ సంస్థకు అవసరాలకు తగినట్లుగా ఎలాంటి పంట కావాలి ఎంత పరిణామం ఉండాలి అనేది ముందుగానే ఒప్పందం రాసుకొని రైతులు ఆ మేర పండించుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ధర ముందుగానే నిర్ణయించుకుని ఒప్పందం చేసుకుంటారు. దీంతో పంట వచ్చిన తర్వాత ప్రైవేట్ సంస్థలు ఆ ఉత్పత్తులను వద్దు అనడానికి గాని ధరను మార్చడానికి వీలు ఉండదు.

** దీనిపై అభ్యన్తరం ఏమిటి అంటే ??

కార్పొరేట్ శక్తుల చేతుల్లో పూర్తిగా వ్యవసాయాన్ని పెట్టె ఆర్డినెన్సు ఇది. చిన్న కమతాల రైతులు దీని వాళ్ళ పూర్తిగా ఇబ్బంది పడతారు. వారిని రైతులు తమ గ్రూప్లోకి చేర్చుకునేందుకు ఆసక్తి చూపరు. ఇక కౌలు రైతులకు దీని వాళ్ళ ఇబ్బందులు వస్తాయి. వారు ఒప్పందం లో ఎలా భాగమవుతారు అనేది ప్రశ్న.

 

author avatar
Special Bureau

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!