5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Gudivada: కొడాలి నాని పై విచారణ..? గోవా క్యాసినో పై సీరియస్ ఆదేశాలు..!

Share

Gudivada: సంక్రాంతి తెలుగు ప్రజలకు ఒక సెంటిమెంట్. ఉత్సాహమైన పండుగ. ఈ పండుగను ఒక్కో జిల్లాలో ఒక్కో తరహాలో జరుపుకుంటారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రెండు మూడు జిల్లాల్లో ఒక్కో తరహా సంప్రదాయకంగా పండుగను జరుపుకుంటారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఎడ్ల పందాలు జరుపుకుంటారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందాలు ఉన్నట్లే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇతర సంప్రదాయ క్రీడలు జరుపుకుంటారు. ఒక్కో జిల్లాల్లో ఒక్కో తరహ సంప్రదాయాలు ఉంటాయి. అయితే ఇప్పటి వరకూ కల్చర్ (సంప్రదాయం) గుడివాడలో ఈ ఏడాది కొత్తగా నడిచింది. సంక్రాంతి అంటే ఇలా కూడా ఉంటుందా..? అధికార పార్టీకి చెందిన నేతల ఫోటోలతో పెద్ద పెద్ద బ్యానర్ లు కట్టి, అధికార పార్టీ ప్రముఖ నాయకుడి అనుచరుల ఆధ్వర్యంలో ఆయన స్వస్థలంలోనే భారీ స్థాయిలో గోవా తరహాలో క్యాసినో నడుపుతారా..? వందల కోట్ల లావాదేవీలు జరుగుతాయా.. ? పది వేల ఎంట్రీ ఫీజు పెడతారా..? గోవా నుండి అమ్మాయిలను తీసుకువస్తారా.. ? సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇలా కూడా చేస్తారా..? ఇది కృష్ణాజిల్లా గుడివాడ నడిబొడ్డున నిర్వహిస్తారా..? అనేది ఆశ్చర్యకరం. ఇది ఎవరూ ఊహించలేరు కూడా..! సంక్రాంతి ఏమిటి ఇలా చేశారు అనేది విస్మయాన్ని గొలిపే అంశం.

gudivada sankranti celebrations casino game
Gudivada Sankranti celebrations casino game

 

Gudivada:  గోవా తరహా క్యాసినోపై విచారణకు ఆదేశం

మొదటి సారిగా కృష్ణాజిల్లాలో క్యాసినో ఆట ఇక్కడ చూపించారు. ఇది అంతా పూర్తిగా గ్యాంబ్లింగ్. తప్పుడు ఆట. చట్ట వ్యతిరేక క్రీడ. క్యాసినోకు గోవాలో అయితే అనుమతి ఉంది కానీ ఏపిలో అనుమతి లేదు. ఇతర దేశాల్లో బ్యాంకాగ్, శ్రీలంక లాంటి దేశాల్లో అనుమతులు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో పేకాట నిర్వహణకు కూడా అనుమతులు లేవు.  గుడివాడలో క్యాసినో పెట్టారు. గ్యాంబ్లింగ్ పెట్టారు. పేకాట పెట్టారు. వీటికేమైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా..? అంటే లేదు. గుడివాడలో బహిరంరంగా జరిగిన ఈ గ్యాంబ్లింగ్ పై పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గుడివాడలో నాలుగైదు రోజులుగా జరిగిన క్యాసినో ఆటపై కృష్ణాజిల్లా పోలీస్ యంత్రాంగం సీరియస్ అయ్యింది. నూజివీడు డీఎస్పీని విచారణ అధికారిగా నియమిస్తూ ఒక కమిటీని నియమించారు జిల్లా ఎస్పీ సిద్ధార్ధ్ కౌశిక్. దీనిపై ఈ విచారణ కమిటీ ఆ మూడు నాలుగు రోజులు అక్కడ ఏమి జరిగింది అనేదానిపై పరిశీలన చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. తదనంతరం చర్యలు ఉంటాయి.

 

తూతూ మంత్రంగా కేసులు

ఆ కన్వెన్షన్ సెంటర్ అధికార పార్టీకి చెందిన మంత్రి కొడాలి నానిది అని మీడియాలో కథనాలు వచ్చాయి. అక్కడ పాల్గొన్న వాళ్లల్లో కూడా అత్యధికంగా అధికార పార్టీకి చెందిన నేతలే పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. అధికార పార్టీ నేతలు ఇంతకా ఇన్వాల్వ్ అయిన చోట పోలీసులు విచారణ జరపడం, ఉన్నది ఉన్నట్లుగా విచారణ జరిపి నివేదిక ఇవ్వడం, వాళ్ల మీద చర్యలు తీసుకోవడం ఇదంతా జరిగే పనేనా..? నిజంగా జరుగుతాయి అనుకోగలమా..?ఆశించవచ్చా.. ? ఎవరికి వారు ఊహించుకుని ఒక నిర్ణయానికి రావచ్చు. అయితే ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు  కోడిపందాల నిర్వహణపై హైకోర్టులో వాదనలు జరుగుతూనే ఉంటాయి. వీటికి కోర్టు అనుమతి ఇవ్వడం లేదు. కోర్టు, ప్రభుత్వ అనుమతులు లేకపోయినా అధికార పార్టీ నేతల అండదండలతో సంక్రాంతి పండుగ వేళల్లో కోడిపందాలు జరుగుతూనే ఉంటాయి. పోలీసులు కూడా అక్కడక్కడ నామ్ కే వాస్తేగా కేసులు నమోదు చేసి కొందరిని అరెస్టు చేయడం జరుగుతుంటుంది.

 

ఎంత మందిని అరెస్టు చేయాలి..? ఎవరెవరిని అరెస్టు చేయాలి..? అనేది అక్కడి నిర్వహకులే పంపుతారు. వారే వాళ్లకు బెయిల్ ఇప్పిచ్చేస్తారు. ఇప్పుడు గుడివాడలో జరిగిన వ్యవహారంలోనూ అదే విధంగా ప్రముఖుల హస్తం ఉన్నప్పటికీ వాళ్లందరినీ వదిలిపెట్టేసి వారు చెప్పిన ఇద్దరో ముగ్గురిని పట్టుకున్నట్లు, వారి వద్ద నుండి లక్షో రెండు లక్షలో స్వాధీనం చేసుకున్నట్లు చూపించి కేసు క్లోజ్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సిద్ధార్ద్ కౌశక్ నిజాయితీ గల అధికారిగా పేరు ఉన్నందున ఈ కేసును సిన్సియర్ గానే తీసుకుని దర్యాప్తు చేసే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో..?


Share

Related posts

మళ్ళీ సాయి పల్లవిని కాంప్రమైజ్ చేయాలని చూస్తే ఏం జరిగిందో చూడండి..!

GRK

Food: ఆహారంలో భాగంగా రెడ్ వైన్ , చీజ్ తీసుకుంటే ఏమి జరుగుతోందో తెలుసా?

Kumar

పొలిటికల్ మైలేజీ కోసమే చంద్రబాబు లెటర్లు అంటున్న ఏపీ డీజీపీ..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar