Hetero Drugs: హెటేరోలో డబ్బు కట్టలు సరే..! బీజేపీ పెద్దలు తలదూరుస్తారా..!?

Ramoji Rao: BJP Targeted Ramoji By Pharma IT Rides
Share

Hetero Drugs: భారతదేశంలో అతి పెద్ద అవినీతి వ్యవస్థ ఏదైనా ఉంటే అందరూ చెప్పుకునేది, అందరికీ కనిపించేది రాజకీయ వ్యవస్థలు మాత్రమే.. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు చేసే అవినీతి..! కానీ బయటకు కనిపించని అతి పెద్ద అవినీతి వ్యవస్థ ఫార్మా రంగం..! ఎందుకంటే ప్రజలు కొనుగోలు చేస్తున్న ఒక రూపాయి విలువ చేసే మందు బిళ్ల తయారీ ఖర్చు 5 పైసలు మాత్రమే. కానీ దాన్ని తయారీ కంపెనీ వాళ్లు రూ. 40 పైసలకు అమ్మితే.., డిస్ట్రిబ్యూటర్ లు, స్టాకిస్టులు లాభాలు వేసుకుని నాలుగైదు చేతుల మారిన తరువాత ఆ మందు ధర ప్రజలకు చేరేసరికి రూపాయి అవుతుంది. భారతదేశంలో జబ్బు అంటే ఒక భయం. జ్వరం వచ్చినా.., దగ్గు వచ్చినా.. మరే ఇబ్బంది వచ్చినా.. మందుల షాపుకు పరుగెత్తుకెళ్లి మందులు తెచ్చుకుంటారు. ఆరోగ్యం అనేది మనిషి బలహీన, భయం కాబట్టి ఆ భయంతో వ్యాపారం చేసేవే ఫార్మా కంపెనీలు. మెడికల్ బిజినెస్ మనం చాలా ప్రాంతంలో చూస్తునే ఉన్నాము. మెడికల్ వ్యాపారంలోదిగిన వాళ్లు అనతి కాలంలో లాభాల బాటతో కోటీశ్వరులు అవుతున్నది గమనిస్తున్నాం..!

Hetero Drugs: Any Involvement by BJP Big Shots
Hetero Drugs: Any Involvement by BJP Big Shots

Hetero Drugs: హెటెరోలో కోట్లు కట్టలు..!!

ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో డ్రగ్స్ పై రెండు రోజుల నుండి ఐటీ శాఖ సోదాలు జరుపుతోంది. సంస్థ కార్యాలయాల్లో, ప్లాట్లు, ఇల్లు, అన్ని చోటాలు ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సుమారుగా 18 ఐటి అధికారుల బృందాలు సంబందిత కార్యాలయాలు, గోడౌన్ లు , అధికారుల నివాసాల్లో సోదాలు జరుపుతున్నారు. అయితే ఈ తనిఖీల్లో ఓ గదిలో కోట్లకు కోట్ల నగదు కట్టలు కనిపించడం ఐటీ అధికారుల కళ్లు తిరిగేలా చేశాయనే వార్తలు వినబడుతున్నాయి. అయితే నోట్ల కట్టలు దొరికాయి అనేదానిపై ఐటి అధికారుల నుండి అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. వస్తున్న పుకార్లు వాస్తవం అయి ఉండవచ్చన్న మాట వినబడుతోంది. ఎందుకంటే హెటిరో ఫార్మా భారతదేశంలో పేరొందిన పెద్ద సంస్థల్లో ఒకటి. ఇటీవల కరోనా సెకండ్ వేవ్ సమయంలో కరోనా నివారణకు రెమిడిస్ విర్ దివ్య ఔషదంగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మందు బ్లాక్ మార్కెట్ లో వేల రూపాయలకు అమ్ముడయ్యింది. దేశ వ్యాప్తంగా ఈ మందు విపరీతంగా అమ్మకాలు సాగాయి. ఆ రెమిడిస్ విర్ ఉత్పత్తి కంపెనీల్లో హెటిరో డ్రగ్స్ ప్రముఖంగా ఉంది. ఇప్పుడు ఐటీ కన్ను హెటిరో పై పడింది. అక్కడ తనిఖీల్లో గుట్టలు గుట్టలు నగదు నిల్వలు కనబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా సమయంలో రెమిడిస్ విర్ అక్రమ విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం కావచ్చనే ఆరోపణ..!

Hetero Drugs: Any Involvement by BJP Big Shots
Hetero Drugs: Any Involvement by BJP Big Shots

మిగిలిన వారు అలర్టయ్యారా ..!?

అయితే ఇక్కడ విషయం ఏమిటంటే హెటిరో డ్రగ్స్ కానీ అరబిందో ఫార్మా గానీ, డాక్టర్ రెడ్డీస్ సంస్థలు ఎవరివో తెలుసు. ఇవన్నీ ఓకే సామాజిక వర్గానికి చెందిన పెద్దలవి. ఇప్పుడు వీటిలోని ఓ ఫార్మా పై ఐటీ సోదాలు జరగడంతో వీరంతా అలర్ట్ అయ్యారనీ, వెంటనే ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలు కలుస్తున్నారని సమాచారం. రెండు నెలల క్రితం వైసీపీ ఎంపి ఆయోధ్య రామిరెడ్డికి చెందిన  రాంకీ సంస్థపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రూ. 280 కోట్లకు పైగా పన్ను ఎగ్గొట్టినట్లుగా పత్రికా ప్రకటన కూడా ఐటీ శాఖ విడుదల చేసింది. ఆ తరువాత ఏమి యాక్షన్ తీసుకున్నారో ఆ పెద్దలకే తెలియాలి. కేంద్ర బీజేపీతో లాబీయింగ్ నెరపడంతో ఈ వ్యవహారం సద్దుమణిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా హెటిరో డ్రగ్స్ వ్యవహారం లోనూ యాక్షన్స్ నివారణకు లాబీయింగ్ లు మొదలైయ్యయాని సమాచారం. బీజేపీ పెద్దలు తలదూరిస్తే ఈ కేసు కూడా మూలకు చేరుతుంది. మరో రెండు, మూడు రోజుల్లో ఈ వ్యవహారం ఢిల్లీ చేరే వీలుంది..!


Share

Related posts

జగన్ తోనే అజయ్ కల్లం…!!…ఢిల్లీలో హల్ చల్..!

Special Bureau

సోనూ సూద్ ని రాజకీయాలు వదల్లేదు…!

Srinivas Manem

Chiranjeevi.. మేకప్ టచప్ లోనే ఉంటారా.. లేక మళ్లీ పొలిటికల్ టచ్ ఇస్తారా..?

Muraliak