IAS Lakshmi Narayana: గత పాపంలో వాటా – నేటి శాపంలో వాటా తీసుకోరా..!? ఏబీఎన్ ఆర్కేకి ఏం పని..!?

IAS Lakshmi Narayana: Scam Share to ABN RK..?
Share

IAS Lakshmi Narayana: విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు జరిగాయి. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ పేరిట నాటి ప్రభుత్వంలో రూ. 242 కోట్లు వరకు నిధులు పక్కదారి పట్టించారనేది ప్రధాన ఆరోపణ.. ఆ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో అనేక చోట శిక్షణ కేంద్రాలు పెట్టించి.. డమ్మీగా నడిపించి.. భారీగా నిధులు కాజేశారనేది ఆరోపణ.. ఆరోపణ మాత్రమే కాదు.. గత ప్రభుత్వంలో చాలా వరకు ఇలాగే జరిగాయి. జిల్లాల్లో నైపుణ్య శిక్షణ పేరిట విద్యార్థులకు, యువతకు నామమాత్రంగా శిక్షణ ఇచ్చి భారీగా నిధులు డ్రా చేసారు. ఇలాగే రూ. 242 కోట్లు అక్రమాలకూ పాల్పడ్డారని ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి, దర్యాప్తు మొదలు పెట్టింది.. ఇది వాళ్ళు, వాళ్ళు చూసుకుంటారు.. కానీ మధ్యలో ఈ ఏబీఎన్ ఆర్కేకి ఏం సంబంధం..? అనేది పెద్ద అనుమానం.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక పాపాల్లో వాటాదారుడిగా ఉన్న రాధాకృష్ణ.. ఇప్పుడు ఆ పాపాలన్నీ వైసీపీ ప్రభుత్వం బయటకు తీస్తున్నప్పుడు… ఒక్కదానిలో కూడా దొరకడం లేదు. బినామీలతో, తనకు సంబంధమే లేదన్నట్టు నడిపించారు. ఈరోజు హైదరాబాద్ లో లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాల సమయంలో ఆర్కే వ్యవహరించిన తీరు ఆయన కుల, పార్టీ భక్తిని చాటుతుంది..!

IAS Lakshmi Narayana: ఆర్కే అతి.. మీడియా మతి ఏమైనట్టు..!?

ఆర్కే సీనియర్ జర్నలిస్టు.. దాని ముసుగులో ఒక పొలిటీషియన్.. దాని కంటే ఒక వ్యాపారవేత్త.. అన్నిటికీ మించి ఒక ప్రొఫెషనల్ బ్లాక్ మెయిలర్.. ఇన్ని లక్షణాలున్న ఏబీఎన్ ఆర్కే కనీసం సీఐడీ సోదాల సందర్భంగా చట్టరీత్యా ఎలా వ్యవహరించాలో తెలియకపోవడమే పెద్ద సందేహం..! ఈరోజు ఉదయం మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్ళినప్పుడు సోదాలు జరుగుతున్నప్పుడు.. ఈవిషయం తెలుసుకున్న ఆర్కే కూడా వెళ్లారు. లక్ష్మి నారాయణ తనకు సన్నిహితుడు, మిత్రుడు, అప్పట్లో ఆ నైపుణ్య శాఖకు ఎండీ పదవి, ఆ తర్వాత సలహాదారుడి పదవి కూడా ఇప్పించింది తానే.. అందుకే ఇప్పుడు హుటాహుటిన వెళ్ళాడు.. కాకపోతే అక్కడ సీఐడీ సోదాలు చట్ట ప్రకారమే జరుగుతున్నాయి. నోటీసులతో సహా వెళ్లారు. దీనిలో ఆర్కేకి ఏం సంబంధం లేదు. కానీ అక్కడకు వెళ్లడం ఓవర్ యాక్షన్ చేయడం.., పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయడం.. ఆంతర్యమేమిటో!

IAS Lakshmi Narayana: Scam Share to ABN RK..?
IAS Lakshmi Narayana: Scam Share to ABN RK..?

టీడీపీలో కొత్త అనుమానాలు..!?

ఏబీఎన్ ఆర్కే వ్యవహారంతో ఇప్పుడు టీడీపీలో కూడా కొత్త కొత్త అనుమానాలు వస్తున్నాయట.. జగన్ పరిపాలన విషయంలో పూర్తిగా ఏకపక్షంగా వార్తలు రాస్తూ.., టీడీపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్న ఆర్కే మీడియా.. ఇటీవల్ మరీ అతి చేస్తుంది. లేని వాటిని, కొన్ని ఫేక్ ప్రచారాలను సృష్టించి నమ్మించాలని చూస్తుంది. వాటిని నమ్ముతున్న టీడీపీ శ్రేణులు.. ఆ తర్వాత అసలు నిజాలు తెలిసే సరికి ఏబీఎన్ ని తిట్టుకునే పరిస్థితి వస్తుంది. అందుకే ఇప్పుడు ఏబీఎన్ తీరుతో టీడీపీలోని కొందరు విసిగిపోయారు. “ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్లు లబ్ది పొందాడు. అసెంబ్లీ ప్రసారాల లైవ్ కాంట్రాక్టు.., సన్నిహితులకు పదవులు… ప్రకటనల పేరిటా ఐదేళ్లలో భారీగా వెనకేసుకున్నాడు.. ఇప్పుడు వాస్తవాలను.. ఉన్నదీ ఉన్నట్టు చూపిస్తే ప్రజలకు దగ్గరయ్యేలా ఉంటుంది. కానీ ఇలా ఫ్యాక్స్ ప్రచారాల వలన సోషల్ మీడియాకు, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు తేడా ఉండదు.. ఏబీఎన్ ఆర్కే, అతని మీడియా అలా దిగజారారు.. అతని వలన ఏం ఉపయోగమే లేదు..” అంటూ టీడీపీలోనే ఓ వర్గం గుర్రుగా ఉన్నట్టు సమాచారం..! మొత్తానికి ఏబీఎన్ ఆర్కే వ్యవహారంపై టీడీపీలో ఈ రకమైన చర్చ మొదలవ్వడం కొత్తగానే ఉంది..!


Share

Related posts

అలా కాకపోయి ఉంటే!?

Siva Prasad

పాపం…! అంత మంది150 కూడా సంపాదించలేరా..?

Srinivas Manem

ప్రభాస్ ప్లానింగ్ కి వణికిపోతున్న బాలీవుడ్..! తెలుగు హీరోల దండయాత్ర

siddhu