NewsOrbit
5th ఎస్టేట్ Featured బిగ్ స్టోరీ

ఐపీఎల్.. అంబానీదేనా..!? కార్పొరేట్ క్రికెట్ లో… కార్పొరేట్ కే కార్పెట్..!!

క్రికెట్ అంటే ఆట.. మజా ఉన్న ఆట.., బ్యాటుకి, బంతికి పోరాటం.., పరుగు పరుగుకి హుషారు, హోరు, జోరు..!! కానీ క్రికెట్ ఏంటి డబ్బులకు లొంగింది..? క్రికెట్ లో బ్యాటు.., బంతి విలువ తగ్గింది..? కానీ బౌండరీ విలువ పెరిగింది..!? అదే కార్పొరేట్ క్రికెట్. ఆటని.., ఆటగాడ్ని.., బంతినీ, బ్యాటునీ, బౌండరీని లొంగదీసుకుంది ఈ కార్పొరేట్ క్రికెట్. ఈ కార్పొరేట్ వ్యవస్థ క్రికెట్ ని శాసిస్తున్నది. ఈ కార్పొరేట్ ని శాసిస్తున్నది మన ముఖేసుడు. ఇండియాలో కార్పొరేట్ అంటే మొదట గుర్తొచ్చేది మన ముఖేసుడు. మరి మన ముఖేసుడి ముద్దుల భార్యకి ఒక టీమ్ ఉంది.. ఆ టీము వరుసగా గెలుస్తుంది..! అదే ఇక్కడ పెద్ద ప్రశ్న..!? ముంబై ఇప్పటి వరకు అయిదు కప్పులు కొట్టింది. 2013 , 2015 , 2017 , 2019 .. 2020 లలో కొట్టేసింది.

ఐపీఎల్ అంబానీకి సొంతం..!!

ఐపీఎల్ అంటే పెద్ద వ్యాపారం. కోట్లతో లావాదేవీలు. పరుగు పెడితే నోటు, బౌండరీ పడితే కట్ట.., గెలిస్తే కోటితో వ్యవహారం అది..! కానీ ఓడినా కూడా కోట్లు, నోట్లు వస్తాయండోయ్ అదే ఐపీఎల్ లో మజా. ఓటమి ఉన్నా, నష్టం అంటూ ఉందని క్రికెట్ ఏమైనా ఉంది అంటే అది కేవలం ఐపీఎల్ మాత్రమే. ఇటువంటి ఐపీఎల్ లో మన ముకేశుడు ముద్దుల భార్య నీతూ అంబానీకి ఒక టీమ్ ఉంది. “ముంబై ఇండియన్స్” వరుసగా గెలిచేస్తుంది. లీగ్ దశలో ఓడాల్సిన మ్యాచ్ లు కొన్ని గెలిచేస్తుంది. ట్విస్టులు ఇచ్చేస్తుంది. అలా కప్పులు పట్టుకుపోతుంది. నీతూకి ఇస్తుంది. నీతూ తీసుకెళ్లి ముకేశుడికి ఇస్తుంది.

ఇక్కడ ముంబై గెలుపులపై అనుమానాలు అక్కర్లేదు..? ఎందుకంటే ఆ టీమ్ లో హార్డ్ హిట్టర్లు ప్రపంచ శ్రేణి అత్యుత్తమ దంచుడు ఆటగాళ్లు ఉన్నారు. ఒకరు అవుట్ అయినా, ఇంకొకరు అలా ఏడో నంబర్ వరకు హిట్టర్లు ఉన్నారు. బౌలర్లు కూడా బాగానే ఉన్నారు. కానీ మరి ఇదే స్థాయిలో రాయల్ ఛాలెంజెర్స లో ఉన్నారు కదా..? చెన్నైలో ఉన్నారుగా.., రాజస్థాన్ లోనూ ఉన్నారుగా..!? కానీ ముంబై గెలవడం..? వరుసగా కప్పులు కొట్టుకుపోతుండడమే ఇక్కడ ఓ చిన్న ప్రశ్న..!? నిజానికి ఈ ప్రశ్న ఉత్పన్నమయ్యేది కాదు. కానీ “ముంబై వెనుక ముకేశుడు ఉండడం.., అతని కార్పొరేట్ చరిత్ర బాగా తెలిసిన వారికి ఈ కప్పులు వరుసగా అంటే ఏమైనా…?????” అనే సందేహాలు రాక మానదు. భార్యపై ప్రేమతో ముకేశుడు ఏమైనా…???? అనే అనుమానాలు రాకమానవు.

Hyderabad Mumbai Indians co owners Nita Ambani and Akash Ambani with captain Rohit Sharma and his wife Ritika Sharma after winning IPL 2017 at Rajiv Gandhi International Stadium in Hyderabad on May 21 2017 Photo IANS

మిగిలిన వాళ్లలో జోష్ ఎక్కడ..?

ముంబై వరుసగా కొట్టేస్తుంటే పాపం మిగిలిన ఓనర్లు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మిగిలిన టీమ్ ఆటగాళ్లు కూడా మైదానం అవతల ఎంజాయ్ చేస్తున్నారు. పంజాబ్ ప్రీతీ జింటా లేదు.., కోల్కతా షారుక్ అక్కడక్కడా మెరిశాడు.., బెంగుళూరు సిద్ధార్థ మాల్యా లేడు.. కానీ ముంబై నీతూ మాత్రం ప్రతీ మ్యాచ్ లోనూ ఉంది. ప్రతీ బంతిని చూసింది. ప్రతీ బౌండరీని ఆస్వాదించింది. ఈమెలో ఉన్న జోష్ మిగిలిన ఓనర్లలో లేదు. కప్పు విషయంలో ఉన్న శ్రద్ధ, నిబద్ధత నీతుని అలా మురిపింపచేసిందేమో..! కానీ ఒక్కటి మాత్రం నిజం. పైన చెప్పుకున్న అనుమానం మాత్రం మెదులుతూనే ఉంటుంది. కొంచెం లోతుగా క్రికెట్టు, కార్పొరేటు వ్యవహారాలూ తెలిసిన వాడికీ.., ఈ ముకేశుడి చరిత్ర చదివిన వాడికి… ఆ అనుమానాలు మాత్రం అలాగే మిగిలిపోతాయి. అందుకే మాకూ కలిగింది, నాటాము..!!

 

 

 

 

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju