TDP: టీడీపీని వణికించే భారీ ప్లాన్ వేస్తున్న జగన్ ..!? 2019 రిపీట్ అంటూ టీడీపీలో భయం..!

Share

TDP: తెలుగుదేశం పార్టీ వెన్ను విరిచేంత సీన్ జగన్మోహనరెడ్డికి ఉందా..? అనేక లక్షలాది మంది కార్యకర్తల బలం ఉండి కొత్త నాయకత్వాన్ని తయారు చేయగల సత్తా ఉంది అని చెప్పుకుంటున్న 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు వెన్ను విరిచేంత నష్టం జగన్ చేయగలరా..? అన్న డౌట్ చాలా మందికి రావచ్చు. గత అనుభవాలను పరిశీలిస్తే జగన్ కు ఆ సత్తా ఉంది అని చెప్పవచ్చు. రాజకీయ పార్టీలకు వెన్ను చాలా రకాలుగా ఉంటుంది. నాయకత్వపరంగా, కార్యకర్తల పరంగా, ఆర్ధిక మూలాల పరంగా ఉంటుంది. కార్యకర్తల విషయంలో జగన్ ఏమైనా చేయవచ్చు, చేయలేకపోవచ్చు కానీ నాయకుల విషయంలో చేశారు. టీడీపీలో కీలకమైన పలువురు నాయకులను వైసీపీలో చేర్చుకున్నారు. ఇక ఆర్ధిక మూలాల మీద దెబ్బ కొట్టడం. ఇప్పుడు వైసీపీ వేస్తున్న అతి పెద్ద ప్లాన్ అదే అని చెప్పవచ్చు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రధాన కారణంగా సరైన సమయంలో పంపిణీ చేయలేకపోయారు. ఈ విషయంలో వైసీపీ ముందు చూపుతో వ్యవహరించగా, టీడీపీకి రావాల్సిన ఫండింగ్ రాలేదు. చాలా నియోజకవర్గాల్లో నేతలు చేతులు ఎత్తేశారు. కొన్ని నియోజకవర్గాల్లో నేతలు ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు చేసి కొంత మేర సఫలీకృతం అయ్యారు.

Jagan Big Sketch on TDP..?

 

TDP: గత ఎన్నికల్లో నిధులు అందక..

టీడీపీకి రావాల్సిన కార్పోరేట్ ఫండింగ్ నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. టీడీపీ నాయకులు నారాయణ, మురళిమోహన్, సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇలాంటి పెద్దలు హైదరాబాద్ నుండి నిధులు తీసుకురావడానికి సాధ్యపడలేదు. చివరి నిమిషంలో పంపిణీ ఆగిపోయి ఓడిపోయిన నియోజకవర్గాలు అనేకం ఉన్నాయి. ఉదాహారణకు విజయవాడ సెంటల్, ఏలూరు లాంటివి ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి రాబోతుందా అన్న భయం టీడీపీని వెంటాడుతోంది. సాధారణంగా ఏ పార్టీకైనా ఆర్ధిక మూలాలు కీలకం. టీడీపీకి కూడా వచ్చే ఎన్నికల్లో ఆర్ధిక మూలాలే కీలకం. వైసీపీ అధికారంలో ఉంది. ఒక పకడ్బందీ ప్రణాళికతో ఉంది. వాలంటీర్ వ్యవస్థ పెట్టుకుంది. ఓటర్లతో నేరుగా సంబంధం పెట్టుకుని ఎప్పుడు ఏది చేరాలో అది చేర్చేలా చూస్తొంది. ప్రతిపక్షంలో టీడీపీ ఓటర్లకు నేరుగా చేరవేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. నాడు అధికారంలో ఉన్నప్పటికే పంపిణీలు చేయలేకపోయారు.

ఆర్ధికంగా ఉన్న నేతలపై కేసులు

ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ వ్యవస్థలు ఏవీ సహకరించనప్పుడు ఇవ్వగలరా..? పైగా తెలుగుదేశం పార్టీకి ప్రస్తుత పరిస్థితుల్లో కార్పోరేట్ కంపెనీలు ఫండింగ్ ఇవ్వడానికి సిద్దంగానూ లేవు. ఒక వేళ టీడీపీలో ఆర్ధికంగా ఉన్న వాళ్లు ఏ విధంగా అయినా సహాయపడతారు అనుకుంటే వాళ్ల మీద ఐటీ, ఈడీ ద్వారా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారు. కొంత మంది నాయకులు సుజనా చౌదరి లాంటి వాళ్లు పార్టీ మారిపోగా, కొందరు టీడీపీ నాయకులపై కేసులు వెంటాడుతున్నాయి. బీదా మస్తాన్ రావు, సిద్ధా రాఘవరావు లాంటి ఆర్ధికంగా శక్తివంతులైన నేతలు ఇప్పుడు టీడీపీలో లేరు. వీళ్లంతా 2019 ఎన్నికల్లో ఉన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి ఈ విషయంలో కష్టమే. కొందరు నాయకులు పార్టీ వదలి వెళ్లిపోగా, ఆర్ధికంగా ఉన్న నేతలపై కేసులు, నిఘా కొనసాగుతోంది. టీడీపీ ఆర్ధిక మూలాలను దెబ్బతీయడమే అతి పెద్ద ప్లాన్. దీన్ని టీడీపీ ఎలా ఎదుర్కోగలదు. గత అనుభవాల దృష్ట్యా మేల్కొని ముందస్తు చర్యలు చేపడుతుందా అనేది వేచి చూడాలి.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

12 mins ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

35 mins ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

2 hours ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

2 hours ago

ఆగస్టు 9 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 9 – శ్రావణమాసం - మంగళవారం మేషం చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి వృథాఖర్చులు పెరుగుతాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల…

4 hours ago

ఆ హిట్ మూవీని మిస్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఫీల‌వుతున్న ఫ్యాన్స్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జాగ‌న్నాథ్ తెర‌కెక్కించిన…

5 hours ago