NewsOrbit
5th ఎస్టేట్

‘జాతీయ స్థాయి లో చంద్రబాబు ని…’ ఇదే జగన్ టార్గెట్ ?

ఎక్కడైనా ఏమరపాటు వ్యవహరిస్తే ఓడలు బండ్లు అవుతాయిబండ్లు ఓడలు అవుతాయి. ఇక రాజకీయాల్లో అయితే ప్రక్రియ జరగడానికి ఎంతో సేపు పట్టదు. ఈరోజు అధికార పార్టీకి ఇచ్చిన మద్దతు పక్క రోజు విపక్షం పైన సింపతి గా మారుతుంది. ఈరోజు విపక్షం యొక్క పోరుని సపోర్ట్ చేసిన వాళ్లంతా పక్క రోజు అధికార పార్టీ నిర్ణయానికి జై జై కొడతారు. ఇలా క్షణాల్లో అభిప్రాయాలు మారేందుకు అలా టీవి చానెల్ మారిస్తే చాలు. దాదాపు తొమ్మిదేళ్ళు విపక్షంలో ఉన్న జగన్ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నాడు. అంతే కాదు దానికి తగ్గట్టు తన రాజకీయాల శైలిని మార్చుకున్నాడు.

ఇక వివరాల్లోకి వెళితే జగన్ పదేళ్ళ రాజకీయమే ఒక సంచలనం. తండ్రి చాటు బిడ్డగా కడప ఎంపీగా పోటీ చేసి గెలిచిన ఆయన వైయస్సార్ గతించాక అలుపెరగని పోరాటం చేశాడు. ఎక్కడా సంప్రదాయబద్దమైన రాజకీయాలకు తావులేకుండా వర్తమాన రాజకీయాలను చాలా భిన్నంగా నడిపించారు. ఏం మాట్లాడినా జనంలోనే.. ఏది తేల్చుకోవాలన్నా జనం మధ్యలోనే. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కూడా జగన్ అదే రకమైన నా వ్యవహారశైలిని చూపించడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే వరుసగా తెలుగుదేశం పార్టీ నాయకులు అరెస్టు అవుతున్న తీరు చూసి ప్రజలు ఇదంతా మామూలే అనుకుంటున్నారేమో కానీ విశ్లేషకులు మాత్రం నోరెళ్లబెడుతారు. ఇప్పటివరకు ఒకరు అధికారంలోకి వస్తే విపక్షం చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ప్రయత్నిస్తారు. ఏదైనా రాజకీయ లబ్ధి కోసం వారిని అరెస్టు చేయించినా అదికూడా కొద్దిరోజుల సంబరమే. సమయం ప్రతికూలంగా ఉన్నప్పుడు వారి విషయాన్ని పెద్ద పట్టించుకోరు…. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు విపక్షంలో ఉన్న రోజున ఇబ్బంది కాబట్టి. తరతరాలుగా అంతా చూస్తున్న రాజకీయాలు ఇలాంటివే.

అయితే జగన్ మాత్రం ఎటువంటి భయం, బెరుకు లేకుండా వరుసబెట్టి టిడిపి నాయకులను అరెస్టు చేయడం ఇప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇది కక్షసాధింపు చర్యా…. లేకపోతే నిజంగానే వారు అవినీతికి పాల్పడ్డారా అన్న విషయాన్ని ఒక క్షణం పక్కనపెడితే…. ముందు మన రాష్ట్ర న్యూస్ ఛానల్ కన్నా జాతీయ మీడియాకు టిడిపి నాయకుల అరెస్టు యొక్క వాసన సోకుతుంది. ఇక ఎవరో అది పనిగా చెప్పినట్లుగా పదేపదే ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం చేసిన స్కామ్ లు, అవినీతి కార్యకలాపాలు ఇవి అంటూ తెగ ఊదరగొట్టేస్తున్నారు.

మన రాష్ట్రంలో ఉన్న మీడియా ఛానల్ లో ఎక్కువభాగం ఎవరి సపోర్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అధికార పార్టీకి బాసటగా ఒక ఛానల్ నిలిచినా…. మీడియా మాటలు రాష్ట్రంలో ఏకపక్షం అయిపోయాయి అన్నది అందరి నోట్లో మాట. ఇక చంద్రబాబు ఇప్పుడున్న పరిస్థితుల్లో అతనికి కేవలం కేంద్రం తప్ప వేరే దిక్కు కనపడటం లేదు. జగన్ ధాటిని తట్టుకోవాలంటే ఆయనకు చాలా పెద్ద స్థాయిలో సపోర్ట్ కావాలి.

తన అనుభవంతో ఎలాగైనా బాబు కొత్త చిక్కులు తెచ్చి పెడతాడు అని అధికార పార్టీ ముందస్తుగానే నేషనల్ లెవెల్ లో అతనిని బ్యాడ్ చేసే ప్రక్రియను చేపట్టింది అని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. అందుకే నేషనల్ మీడియాలో రేంజ్ లో టిడిపి పార్టీ అరెస్టులను చూపిస్తున్నారు. అవతల వారికి ఆసక్తి ఉందో లేదో తెలియదు కానీ కనీసం వారిని వెళ్లి అడిగేందుకు చంద్రబాబుకు కూడా మొహం చెల్లుబాటు కాకుండా జగన్ పరిస్థితి ని క్రియేట్ చేస్తున్నారు అన్నది వీరి మాట. మరి బాబు సంక్లిష్ట పరిస్థితి నుంచి ఎలా బయట పడతాడు అన్నది వేచి చూడాలి.

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau