5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena Party: పవన్‌కు టైమ్ అవ్వలేదా.. టాపిక్ దొరకలేదా..!?

Share

Janasena Party: ఏపిలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రతిపక్షాలు యాక్టివ్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బాగా యాక్టివ్ అయ్యింది. అధికార వైసీపీ క్యాడర్ కూడా మరో సారి అధికారంలోకి వచ్చేందుకు ప్రజాక్షేత్రంలోకి దిగుతున్నారు. జగన్మోహనరెడ్డి, చంద్రబాబు వాళ్ల వాళ్ల టీమ్ ల ద్వారా సర్వేలు చేయించుకుంటున్నారు. అయితే ఇప్పుడు జనసేన పరిస్థితి ఏమిటి..? ఇంకా పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉంటున్నారు..? ఇంకా పూర్తి స్థాయిలో జనాల్లోకి ఎందుకు రావడం లేదు..? అసలు ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా వచ్చే ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీలు వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి..? పవన్ కళ్యాణ్ మరో ఆరు నెలలో, సంవత్సరమో, మరో సంవత్సరంన్నర సినిమాల్లోనే ఉంటూ ఏదో రెండు మూడు నెలలకు ఒక సారి జనంలోకి వచ్చి మీటింగ్ పెడుతూ వెళ్లిపోతే ఆయన రాజకీయం సరిగా నడుస్తుందా..? ఇవన్నీ అనేక సందేహాలు. అనుమానాలు.

Janasena Party chief pawan political strategy
Janasena Party chief pawan political strategy

Janasena Party: 42 నియోజకవర్గాలపై ఫుల్ ఫోకస్

అయితే జనసేన ప్రణాళిక ఏమిటి..? వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధం అవుతుంది..? పవన్ కళ్యాణ్ ఎలా సిద్ధం అవుతున్నారు.. ? టీడీపీతో పొత్తు ఉంటే ఒకలా, పొత్తు లేకపోకపోతే మరోలా అనేది ఒక ప్లాన్ తో ఉన్నారు. పొత్తు ఉన్నా, లేకపోయినా జనసేన ప్రణాళిక ఏ విధంగా ఉంది అంటే..? జనసేనలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బయటకు లేకపోయినా.. పార్టీ నాయకులు మీడియాలో యాక్టివ్ గా కనిపించకపోవచ్చు కానీ గ్రౌండ్ వర్క్ మాత్రం మొదలు పెట్టింది. జనసేన అంతర్గతంగా తెరవెనుక వ్యూహాలు, తెరవెనుక స్ట్రాటజీలతో గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ఆ పార్టీకి ప్రస్తుతం అంత సీన్ లేదు. అభ్యర్ధుల నిలబెట్టడానికి ఒకే అయినా మొత్తం నియోజకవర్గాల్లో స్ట్రాటజీలు వేయడం, మండల, గ్రామ స్థాయిలో కమిటీలు వేయడం, నాయకులు గుర్తించడం అయితే చేయలేదు. ఎందుకంటే ఆ పార్టీ ఇంకా గ్రామస్థాయిలో పూర్తిగా నిర్మాణం జరగలేదు. అందుకే పార్టీ అంతర్గత సర్వే రిపోర్టు ద్వారా 42 నియోజకవర్గాలను సెలక్ట్ చేసుకుంది. నెల రోజుల క్రితం 28 నియోజకవర్గాల నుండి వాళ్లకు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. పవన్ కళ్యాణ్ వద్ద ఉన్న రిపోర్టులు, గత ఎన్నికల ఫలితాలు అన్నీ క్రోడీకరించి 42 నియోజకవర్గాలను ఫైనల్ చేశారు.

 

సెప్టెంబర్ నుండి ప్రజాక్షేత్రంలో..

ఈ నియోజకవర్గాల్లో రాబోయే ఒకటిన్నర సంవత్సరాల్లో జనసేన పార్టీ పూర్తిగా ప్రచార పరంగా, క్యాండేట్ పరంగా, అంతర్గత రాజకీయాల పరంగా, పోల్ మేనేజ్మెంట్ పరంగా కూడా వెనుకడుగు వేయదు. పూర్తి స్థాయిలో వైసీపీ, టీడీపీ ఎంతగా తలబడతాయో ఈ పార్టీ కూడా అంతే స్థాయిలో ఈ 42 నియోజకవర్గాల్లో పోటీ ఇవ్వబోతున్నారు. ఏడాదిన్నరలో ఈ 42 నియోజకవర్గాల్లో రెండు లేదా మూడు సార్లు పవన్ కళ్యాణ్ పర్యటించాలన్నది ఆ పార్టీ ప్లాన్ గా వినబడుతోంది. వీటిలో విశాఖపట్నంలో అయిదు నియోజకవర్గాలు ఉన్నాయి. అలానే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో 22 నుండి 25 నియోజకవర్గాలు ఉన్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎనిమిది, ఇతర ప్రాంతాల్లో ఎనిమిది నుండి పది నియోజకవర్గాలు గుర్తించారు. రాయలసీమలో జనసేన అంత యాక్టివ్ కాకపోయినా శ్రీకాళహస్తిలో జనసేన యాక్టివ్ గా ఉంది. నాయకులు కేసులు కూడా ఎదుర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో పార్టీ యాక్టివ్ గా లేకపోయినా కొన్ని నియోజకవర్గాల్లో నాయకులు యాక్టివ్ గా ఉన్నారు. వాటిని కూడా కలుపుకుని మొత్తం 50 నియోజకవర్గాల్లో ఫోకస్ చేయాలన్నది ఆ పార్టీ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ టీడీపీతో పొత్తు ఉంటే ఈ 50 నియోజకవర్గాల్లో కొన్ని జనసేన తీసుకుంటుంది. చాలా మంది అనుకునేది ఏమిటంటే పవన్ కళ్యాణ్ రావడం లేదు. వంగవీటి రాధా విషయంలో ఏమీ బయటకు మాట్లాడలేదు. ఆయన ఏమి చేస్తున్నారు.. అని అనుకుంటున్నారు. అయితే పవన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. హరిహర వీలమల్లు, భగత్ సింగ్ షూటింగ్ లు పూర్తి అయిన తరువాత ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నాటికి జనంలోకి రావాలన్నది పవన్ ప్లాన్ గా ఉన్నట్లు తెలుస్తోంది.


Share

Related posts

paper cup: పేపర్ కప్ లో టీ తాగుతున్నారా ? అయితే  ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు!!

siddhu

Amit Shah: కాంగ్రెస్ పై అమిత్ షా సెటైర్ .. మరో 30 – 40 ఏళ్లు బీజేపీ హవానే అంటూ ధీమా

somaraju sharma

ACB: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్

somaraju sharma