NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena TDP: జనసేనకి 25 సీట్లు వరకూ..! టీడీపీ ఇంటర్నల్ లెక్కలు..కానీ..!?

Janasena TDP: ఆంధ్రప్రదేశ్ లో ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా రాజకీయ వాతావరణం మాత్రం వేడెక్కింది. రాజకీయ పార్టీలకు సంబంధించి పొత్తుల అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఉంది. జనసేన – తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు విషయంపై రకరకాల ప్రచారాలు..! రకరకాల ఊహాగానాలు..! సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి. నిజానికి జనసేన – టీడీపీ పొత్తు పెట్టుకుంటాయా..? లేదా అనే అంశంపై దాదాపు ఏడు నెలల క్రితమే “న్యూస్ ఆర్బిట్” ఓ ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. పలు అవగాహనలతో పొత్తు ఉంటుంది అని అప్పట్లోనే విశ్లేషణ ఇవ్వడం జరిగింది. ఇటీవల జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సందర్భంలో జనసేన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఆసక్తిగా గమనించారు.

Janasena TDP alliance undergrounds talks
Janasena TDP alliance undergrounds talks

Read More: TDP Janasena: మాట పొదుపు .. పొత్తు పొడుపు..! 45 సీట్లలో రాజకీయ కుదుపు..!!

Janasena TDP: ఎవరికి ఎన్ని సీట్లు..?

అయితే పవన్ కళ్యాణ్ తన ప్రసంగం చివరలో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చనివ్వము అంటూ పొత్తులకు సంబంధించి పరోక్షంగా ఒక అప్ డేట్ ఇచ్చారు. దీంతో టీడీపీతో పొత్తు ఉండబోతున్నది అని జనసేనలోనూ ఒక అభిప్రాయానికి వచ్చేశారు. అప్పటి వరకూ టీడీపీ పొత్తు అవసరం లేదు. మా ఓటింగ్ శాతం పెరిగింది. మేము అన్ని సీట్లు గెలుస్తాం, ఇన్ని సీట్లు గెలిచేస్తాం అనే లెక్కల్లో జనసైనికులు ఉన్నారు. అయితే ఆ పార్టీ అంతర్గత లెక్కలు వేరు. నాయకుల లెక్కలు వేరు. కార్యకర్తలు, పిల్లల లెక్కలు వేరు. ఇప్పుడు టీడీపీ పొత్తు ఉంటుంది అని తెలిసిన తరువాత అటు టీడీపీలో ఇటు జనసేనలో ఎవరికి ఎన్ని సీట్లు అన్న లెక్కలు మొదలైయ్యాయి.

 

జనసేనకు 24 -25 కు టీడీపీ ఒకే..!

టీడీపీ ముఖ్య నేతల్లో జనసేనకు ఇచ్చే సీట్లపై ఒక చర్చ జరుగుతోంది. జనసేనకు ఏయే జిల్లాల్లో ఎన్ని సీట్లు ఇవ్వాలి..? మినిమం ఎన్ని ఇవ్వాలి..? మ్యాగ్జిమమ్ ఎన్ని సీట్లు ఇవ్వాలి..? అంతకంటే వాళ్లు ఎక్కువ సీట్లు కోరుకుంటే ఏమి చేయాలి..? అనే చర్చ జరుగుతోంది. పార్టీ అంతర్గత సమాచారం ప్రకారం జనసేనకు 24 లేదా 25 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన అన్ని సీట్లకు ఒప్పుకుంటుందా..? లేక 40 – 50 సీట్లు కావాలని అడుగుతుందా..? లేదా అనేది వేరే విషయం. టీడీపీ లెక్క ప్రకారం ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 4 లేదా 5 సీట్లు, ఉభయ గోదావరి జిల్లాల నుండి 10 నుండి 15 వరకు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 3 లేదా 4 సీట్లు, రాయలసీమ జిల్లాల నుండి రెండు, ప్రకాశం జిల్లా నుండి ఒకటి చొప్పున ఇవ్వాలనేది టీడీపీ లెక్క. టీడీపీలో కీలక నేతలు ఈ లెక్కకు కమిట్ అయి ఉన్నారు.

Janasena TDP: ఎవరి లెక్కల్లో వాళ్లు

ఎంపీ సీట్ల విషయానికి వస్తే మూడు వరకూ ఇవ్వడానికి టీడీపీ సముఖంగా ఉన్నట్లు సమాచారం. కానీ జనసేన పార్టీ వేరే అంచనాల్లో ఉంది. జనసేన పార్టీ మాత్రం 35 నుండి 45 సీట్లు తీసుకోవాలన్న లెక్కల్లో ఉంది. సో..ఇది అంత ఈజీగా తెమిలే విషయం కాదు. అయితే జనసేన పార్టీయే కొద్దిగా తగ్గుతుంది అన్న అభిప్రాయం టీడీపీలో ఉంది. ఎందుకంటే టీడీపీతో పొత్తు లేకపోతే గత ఫలితాల మాదిరిగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గెలవరు అన్న అభిప్రాయంలో టీడీపీ ఉంది. మరో పక్క మాతో పొత్తు పెట్టుకోకపోతే టీడీపీ అదికారంలోకి రాదు, వాళ్లు సీఎం అవ్వలేరు అన్న అభిప్రాయంలో జనసేన ఉంది. కాబట్టి వాళ్లే చచ్చినట్లు మేము అడిగినన్ని స్థానాలు ఇస్తారు అన్న లెక్కల్లో జనసేన ఉంది. సో.. ఈ రెండు పార్టీలు ఎవరి లెక్కల్లో వాళ్లు ఉన్నారు.

author avatar
Srinivas Manem

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju