NewsOrbit
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

Junior NTR Political Mind: జూనియర్ ఎన్టీఆర్ మాంచి ముదురు..! పాలిటిక్స్ కి పనికొస్తాడు..!!

Junior NTR Political Mind: Dual Mindset Trolling Jr NTR

Junior NTR Political Mind: ఏమో అనుకున్నాం కానీ.. జూనియర్ ఎన్టీఆర్ మాంచి ముదురు.. ఏ మాత్రం సందేహం లేదు. టీడీపీని చేజిక్కించుకోగల సమర్థుడే.. చంద్రబాబుకి ఉన్న నక్క, డబుల్ నాలుక, యూ టర్న్ తెలివి తేటలు బాగానే వంటబట్టినట్టున్నాయ్.. ఈరోజు ఆయన రిలీజ్ చేసిన ఒక్క రెండు నిమిషాల వీడియో చూస్తే చాలు…. “టీడీపీని సపోర్ట్ చేయలేక.. చంద్రబాబుని సమర్ధించలేక.. అటు జగన్ నీ, వైసీపీని విమర్శించలేక.. రెండు, మూడు నాలుకలు కలిపి ముదురు వీడియో ఒకటి రిలీజ్ చేసాడు.. అప్పట్లో “ఏపీ, తెలంగాణ వివాదాల్లో చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతం మాదిరిగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జగన్ తో పేచీ లేకుండా.., టీడీపీ అభిమానుల నుండు అనవసర తలనొప్పులు లేకుండా ఓ వీడియో చేసి వదిలేసాడు..” అదేమిటో.. ఎన్టీఆర్ ఎందుకిలా చేసాడో.. చూద్దాం..!

ఏపీ అసెంబ్లీ లో నిన్న జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో జరిగిన పరిణామానికి చంద్రబాబు పార్టీ కార్యాలయంలో వెక్కివెక్కి ఏడవటం ఆ పార్టీ శ్రేణులను తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. మరోపక్క నందమూరి కుటుంబం మొత్తం ఈరోజు మీడియా ముందుకు వచ్చి తీవ్రంగా ఖండించింది. అయితే టీడీపీ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన నుండి గట్టి రెస్పాన్స్ వస్తుందని ఆశించారు. జూనియర్ ను రెచ్చగొట్టే విధంగా ఫ్యాన్స్ కామెంట్స్ కూడా చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం “కర్ర విరగకూడదు పాము చావకూడదు” అన్న మాదిరిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఇన్నాళ్లు తనను భుజాన మోసిన ఫ్యాన్స్ నుండి తన వెన్నంటి ఉండి సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభిమానుల నుండి ఎదురు కాబోయే ప్రమాదం నుండి జూనియర్ ఎన్టీఆర్ ఈ స్టేట్మెంట్ ద్వారా తప్పించుకున్నారు.

Junior NTR Political Mind: Dual Mindset Trolling Jr NTR
Junior NTR Political Mind Dual Mindset Trolling Jr NTR

Junior NTR Political Mind: సోషల్ మీడియాలో తిట్టిపోశారు..!

వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ పై పొద్దున్న నుండి విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. టీడీపీ అభిమానులు ఆయన రియాక్షన్ స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకున్నారు.. కొన్ని కామెంట్లు చూస్తే… “జూనియర్ ఎన్టీఆర్ వల్లే ఇదంతా.. జూనియర్ ఎన్టీఆర్ తెరవెనుక ఉండి ఇదంతా చేయిస్తున్నారా? జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడున్నారు? మా తాత మా తాత అంటుంటారు కదా మీ తాత డాటర్ ను, నీ మేనత్త ని అంటే యాడికి పోయావు? నందమూరి ఫ్యామిలీ అని నటిస్తున్నవా? అని ఒకరు కామెంట్ చేస్తే.. మరో వ్యక్తి జూనియర్ పై మరో తరహా మెంట్ చేశారు. తొడలు కొట్టి పొట్టోడు ఏమైనట్టు అని మరొకరు, కొడాలి నాని కోసం ఫ్యామిలీ ని వదిలేసావా? జెమినీ టీవీలో సొల్లు చెబుతావ్ కదా వ్యాల్యూస్ అంటూ… ఛీ నీకు ఫ్యాన్ కావటం నా దురదృష్టం” అంటూ ఇలా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఈ కామెంట్లు తనకు తగిలాయేమో… వెంటనే జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.

“నిన్న అసెంబ్లీ లో జరిగిన ఘటన దురదృష్టకరమని, ఏ ఒక్కరూ మహిళలను అలా కించపరచకూడదు అని, ఎవరు కూడా మహిళలను వేలెత్తి చూపకూడదు” అని అన్నారు. ఎవరైనా నందమూరి ఫ్యామిలీ తరఫున ఆయన మాట్లాడారు అని అనుకుంటారెమో అని తాను “వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గా మాట్లాడటం లేదని… పార్టీపరంగా ను చెప్పడం లేదని … దేశ పౌరుడిగా చెబుతున్నానని” అని చాలా తెలివిగా జూనియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. టీడీపీ చంద్రబాబు పేరు ప్రస్తావించకుండా .. టీడీపీ కి సపోర్ట్ ఇచ్చినట్టుగా లేకుండా ఫ్యామిలీ తరఫున మాట్లాడుతున్నట్టుగా ఉండకుండా… ఏదో ఇష్యూని ఖండించాలి అన్నట్లు గా ఎన్టీఆర్ ముదురుగా మాట్లాడారు. తనను దారుణంగా ఫ్యాన్సీ తిడుతున్నారు. అందుకే ఫ్యాన్స్ నుండి ప్రమాదం రాకుండా కర్ర విరక్కుండా పాము చావకుండా స్టేట్మెంట్ ఇచ్చి తప్పించుకున్నారు. అయితే ఆయన అభిమానులు ఆశించినంతగా ఆయన నుండి స్పందన రాలేదు. ఆయన రియాక్ట్ అవ్వాల్సిన విధంగా రియాక్ట్ కాలేదు. ఇప్పుడు మరో ప్రమాదంలో ఇరుక్కున్నారు..!

Junior NTR Political Mind: Dual Mindset Trolling Jr NTR
Junior NTR Political Mind Dual Mindset Trolling Jr NTR

ఎన్టీఆర్ పై మొదటి నుండి అనుమానాలు..!?

ఎన్టీఆర్ మీద అనేక అనుమానాలు రావడానికి కారణం ఏంటంటే కొడాలి నాని ఆయనకు అత్యంత సన్నిహితుడు. ఇప్పటికీ వారి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వల్లభనేని వంశీ కూడా ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన తీసిన సినిమాల్లో వీళ్లు సైలెంట్ పార్ట్నర్స్. అదుర్స్ లో వీళ్ళ పేర్లు ఉన్నాయి. వీళ్లు వైసీపీ లో ఉన్నారు. అదే విధంగా ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ సొంత మామ నార్నే శ్రీనివాసరావు వైసీపీ లోకి వెళ్ళారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ చుట్టుపక్కల వారంతా వైసీపీలోకి వెళ్తున్నారు. వీటన్నిటికి తోడు ఎన్టీఆర్ గతంలో జగన్ తో ఫోన్లో మాట్లాడారు అన్న ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ కూడా గతంలో జగన్ తో పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్టు ఆరోపణలు విమర్శలు వచ్చాయి. అవి వాస్తవాలో కాదో తెలియదు కానీ ఇప్పుడు జూనియర్ పక్కన వాళ్ళంతా వైసిపి కి మద్దతుగా ఉన్నారు. దీనితో చంద్రబాబు నాయుడు, లోకేష్ లను వీక్ చేయడానికి ఎన్టీఆర్ యే జగన్ తో చేతులు కలిపాడు అని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఎన్టీఆర్ మామ, ఎన్టీఆర్ సన్నిహితుడు వైసీపీలో కి వెళ్ళటం, వాళ్లే చంద్రబాబు లోకేష్ టార్గెట్ గా విమర్శలు చేస్తుండటం, నేడు ఆయన ఖండన కూడా పేలవంగా ఉండటంతో సోషల్ మీడియాలో ఆయనపై కామెంట్స్ వస్తున్నాయి.

author avatar
Srinivas Manem

Related posts

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

YSRCP: వైసీపీ అధినేత, సీఎం జగన్ నేటి బస్సు యాత్ర ఇలా..

sharma somaraju

YSRCP: టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ లు.. వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

చిల‌క‌లూరిపేట‌లో ముందే చేతులెత్తేసిన వైసీపీ.. ‘ పుల్లారావు ‘ మెజార్టీ మీదే లెక్క‌లు..!

BSV Newsorbit Politics Desk

YSRCP: అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన సీఎం జగన్

sharma somaraju

BJP: బీజేపీ కీలక సమావేశానికి ఆ సీనియర్ నేతలు డుమ్మా..

sharma somaraju