NewsOrbit
5th ఎస్టేట్

కరోనా దారుణం: గౌరవప్రదమైన ‘చావు’ కోసం…

 

ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో ఎన్నో హృదయ విచారకర సంఘటనలను చూడాల్సి వస్తోంది. డాక్టర్లు మరియు ఇతర హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బారిన పడిన వారికి చికిత్స చేస్తూ ప్రాణాలు వదిలిన తీరు… హృదయాన్ని కలచి వేసే సంఘటనలు… ఎన్నో ఉన్నాయి. వీటి మధ్య లాక్ వల్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. వలస జీవులు సుదూర ప్రాంతాలకు తన ప్రాణాలను లెక్కచేయకుండా కాలి బాట పట్టడం కూడా ఇప్పుడు మనం ఉన్న దయనీయమైన స్థితిని గుర్తు చేస్తోంది.

చంకలో చంటిబిడ్డ…. నెత్తిన పాతాళానికి తొక్కేంత బరువు ఉన్న మూటలు వేసుకొని హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల నుండి ఛత్తీస్గడ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు రోడ్డు వెంబడి నడుస్తూ.. సైకిళ్లపై శ్రమిస్తూ వేలాది కిలోమీటర్ల ప్రయాణించడానికి వలస కార్మికులు పడుతున్న శ్రమ ఇప్పుడు కంటతడి పెట్టిస్తోంది.

ఒక పసి బిడ్డ అయితే అడవుల్లో పడి తన సొంత రాష్ట్రానికి వెళుతూ మధ్యలోనే ప్రాణాలు విడిచింది. ఇంకొక వయసుమళ్ళిన వ్యక్తి అయితే కాలినడకన పొరుగున ఉన్న సొంత రాష్ట్రానికి తరలిపోతూ జాతీయ రహదారిపై విగత జీవిగా మారాడు. నిన్నటికి నిన్న చెన్నై నుండి శ్రీకాకుళం జిల్లా కు వెయ్యి కిలో మీటర్ల చొప్పున నాలుగు రోజులు తిండి తిప్పలు లేకుండా సాహస యాత్ర చేసి గమ్యస్థానం చేరిన మత్స్యకారుల గురించి వింటే మనసు ద్రవిస్తుంది. నిద్ర లేదు…. ఆహారం లేదు ఎప్పుడెప్పుడు కబళించి వేద్దామా అన్నట్లు అల్పపీడనం వల్ల ఎగిసిపడుతున్న అలల మధ్య సొంత ఊరికి చేరడం వెనక ఒకచావు స్ఫూర్తి ఉంది అంటే అతిశయోక్తి కాదు.

ఊరు కాని ఊరిలో ఉండి ఆకలికి అలమటించి దిక్కులేని చావు చచ్చే కన్నా ఒంటి లో ఉన్న సత్తువ కు పరీక్ష పెట్టి స్వగ్రామానికి ఎలాగైనా తిరిగి వెళ్లి అక్కడ గౌరవప్రదమైన రీతిలో తనువు చాలిదాం అన్న వారి సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి సొంత ఊరికి రావాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నిస్తే “బ్రతకడం కోసం ఎక్కడికో వచ్చాం.. కనీసం చావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడైనా సొంత నేలపైన చావకపోతే ఎలా” అని చెబుతుంటే వారు తమ నేలతల్లితో పాటుగా తన చావును కూడా సమానంగా ప్రేమించడం కనిపిస్తోంది.

మహారాష్ట్రలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మత్స్యకారుడి చనిపోయాడు కానీ మృతదేహాన్ని సొంత ఇంటికి చేర్చలేని దుస్థితి. బంధు మిత్రులకు ఒక చివరి చూపు దక్కే పరిస్థితి లేదు. ఈ ఉదంతం వారి కుటుంబ సభ్యులను జీవితాంతం వెంటాడుతుంది .అలాగే ఇటీవల నెల్లూరుకు చెందిన డాక్టర్ కరోనా కారణంగా చెన్నైలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది పేషెంట్లకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన అతనిని చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఒక అనాధ శవంలా అంత్యక్రియలు జరిపి స్మశానానికి తరలించిన తీరు కూడా జీర్ణించుకోలేని విషయం. ఇన్నేళ్లు వైద్య సేవ చేసి ఎంతో ఐశ్వర్యాన్ని సంపాదించిన అతను చివరికి నా అన్న వాళ్ళు ఒక్కరు కూడా లేకుండా చివరి ప్రయాణం చేయడం ఎంతవరకు సమంజసం?

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau

Leave a Comment