5th ఎస్టేట్ న్యూస్

Karthika Deepam: సౌందర్యకు నిజం తెలిసిపోయిందిగా…మరోపక్క హిమపై ప్రేమను కురిపిస్తున్న జ్వల..!

Share

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్‌లో స్వప్న… జ్వాల(సౌర్య) మీద కోపంతో ఆటో తగలబెడుతుంది. ఆటో కాలిపోవడంతో జ్వాల మనసులోనే కుమిలి కుమిలి ఏడుస్తుంది. విషయం తెలిసి సౌందర్య కూతురు ఇంటికి వచ్చి చెడా మడా తిట్టేస్తుంది.మరోపక్క జ్వాల పరిస్థితి తలుచుకుని హిమ, ప్రేమ్, నిరుపమ్, సత్య అందరు బాధపడతారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందామా.

Karthika Deepam:  సౌర్య కోసం కొత్త ఆటోను కొన్న నిరూపమ్ :

తెల్లారేసరికి జ్వాల ఇంటి ముందు ఒక ఆటో వచ్చి ఆగుతుంది.ఆ ఆటో నుంచి పెద్ద పెద్దగా, ఏకదాటిగా హారన్ వినిపిస్తూనే ఉంటుంది. ఆ శబ్దాలకు బయటికి వచ్చిన జ్వాల ఆటోలో వెనుక కూర్చున్న నిరుపమ్‌ని ఆటో తోలుతూ వస్తున్న హిమను చూసి షాక్. అవుతుంది. హేయ్ తింగరీ నువ్వా? ఏంటి నువ్వు ఆటో ఇంత ధైర్యంగా ఆటోను నడుపుకుని వచ్చేశావా?’ అంటుంది జ్వాల. అప్పుడే హిమ ఆటో తాళాలు నిరుపమ్ చేతిలో పెట్టడంతో ఆ తాళలను నిరుమప్ జ్వాల చేతిలో పెట్టి ఇది నీకే జ్వాల అంటాడు. వెంటనే జ్వాల చాలా సంతోషిస్తుంది. ఎందుకు డాక్టర్ సాబ్ ఇదంతా’ అంటుంది జ్వాల. ‘మా మమ్మీ ఆవేశపడింది.. నేను ఆలోచించాను’ అంటాడు నిరుపమ్.

ఈసారి సౌర్యను వదిలేదేలే అని అంటున్న హిమ :

ఇక ఇంద్రుడు, చంద్రమ్మలు ఆటోని చూసి సంబర పడిపోయి ఆటో వెనుక వదిలేదేలే అనేది కూడా రాయించారా అంటాడు ఇంద్రుడు.జ్వాల ఆశ్చర్యపోయి చూస్తుంటే అవును జ్వల నీ శత్రువు కోసం అన్నావ్‌గా అందుకే రాయించాను’ అంటాడు నిరుపమ్. అప్పుడే హిమ మనసులో.. ‘నువ్వు ఎంత ధ్వేషించినా నిన్ను వదిలేదేలే అని రాయించాను సౌర్యా’ అనుకుంటుంది వెంటనే జ్వాల నిరుపమ్‌తో ఇచ్చేంత గొప్ప మనసు మీకున్నా.. ఫ్రీగా తీసుకోవడానికి నేను రెడీగా లేను..’ అంటుంది. ‘మీరు మంచివారే డాక్టర్ సాబ్. నెల నెల నేను కొంత మీకు ఇస్తాను.. తీసుకుంటానంటేనే నేను ఈ ఆటో తీసుకుంటాను’ అంటుంది జ్వాల. ఏమి తింగరి ఈ ఆటోని నువ్వే నడుపుకుంటూ రావాలా? షోరూమ్ వాళ్లు తెచ్చి ఇస్తారుగా’ అంటుంది జ్వాల. ‘ఇదే ప్రేమ జ్వాలా’ అంటుంది వెంటనే జ్వాల ప్రేమనా అంటూ వచ్చి హగ్ చేసుకుని..‘ఐలవ్యూ తింగరీ’ అంటుంది. హిమ మురిసిపోతుంది. సరే నేను ఈ రోజు మీకు పార్టీ ఇస్తాను.పెద్ద హోటల్‌కి వెళదాం అంటూ నిరుపమ్, హిమలని ఆటో ఎక్కించుకుని వెళ్తుంది జ్వాల.

జ్వాల, నిరూపమ్, హిమను. చూసి. కుళ్ళకుంటున్న ప్రేమ్ :

ఇక ప్రేమ్ ఒక చోట ఆగి హిమ కోసం ఆలోచిస్తూ ఉంటే ఎదురుగా జ్వాల ఆటో ఆగుతుంది. అందులోంచి దిగిన జ్వాలని చూసి షాక్ అవుతాడు ప్రేమ్.ఇంతలో ఆటో వెనుక నుంచి నిరుపమ్, హిమ దిగడం చూసి మరింత షాక్ అవుతాడు. అయితే వాళ్లు ప్రేమ్‌ని చూసుకోకుండా హోటల్‌లోకి వెళ్లిపోతారు. ‘అదేంటి వీళ్లు నన్ను పిలవకుండా వెళ్తారా? అనుకుంటాడు. అయినాగాని ‘నన్ను పిలవకుండా నేనెందుకు వెళ్తాను.. నేను వెళ్లను అనుకుంటాడు మనసులో ప్రేమ్. ఇక జ్వాల రెస్టారెంట్‌లో కూర్చున్న తర్వాత.. ‘ఏదో తగ్గినట్లుంది డాక్టర్ సాబ్..’ అంటుంది జ్వాల. ఇంతలో ప్రేమ్ అక్కడకు వస్తాడు. అది చూసి అదే ఏదో తగ్గింది అన్నాను ఈ ఎక్సట్రా నే తగ్గాడు అంటుంది. రా ఎక్సట్రా పార్టీ ఇస్తున్నా నేను అంటుంది.కాసేపు ఇద్దరు కూడా గొడవ పడతారు.ఇక మాటల సందర్భంలో ప్రేమ్ జ్వాలను.. ‘అవును తిక్కా.. నీకు అక్కా, చెల్లి, తమ్ముడు ఎవరు లేరా? అని అడిగేస్తాడు.

జ్వలను చేసుకోబోయే వాడు చచ్చాడే అంటున్న ప్రేమ్ :

దాంతో జ్వాలకు కోపం వచ్చేస్తుంది.పక్కనే ఉన్న హిమ తను ఏం చెబుతుందో ఏంటో అని కంగారు పడుతుంది.జ్వాల మాత్రం కోపాన్ని తగ్గించుకుని ‘లేరు..’ అంటుంది జ్వాల హమ్మయ్య వాళ్ళు బతికి పోయారులే. అయినా నిన్ను ఎవరు చేసుకుంటారో కానీ వాడు పోయినట్లే..’ అంటాడు ప్రేమ్ నవ్వుతూ.. ఇక నిరూపమ్ ‘తనకేంట్రా తనని చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు అంటాడు నిరుపమ్.ఆ మాట విని జ్వాల హ్యాపీగా ఫీల్ అవుతుంది.

సౌర్యనే జ్వాల అనే విషయం సౌందర్యకు తెలిసిపోయిందా..?

మరోవైపు సౌందర్య హిమ రూమ్‌లో లైట్, ఫ్యాన్ ఆన్‌లో ఉండటం చూసి హిమ ఉందేమో అని. వస్తుంది. కానీ అక్కడ హిమ ఉండదు.ఇక ఎదురుగా హిమ, సౌర్యల చిన్నప్పటి ఫొటో చూస్తుంది అలాగే దాని వెనుకే ఉన్న జ్వాల, హిమల ఫొటో ఉండటంతో సౌందర్య షాక్ అవుతుంది.సౌందర్య ఆ ఫొటోని చేతిలోకి తీసుకుని ఏంటి జ్వాలే సౌర్యనా అనే అనుమానం వ్యక్తం చేయడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది


Share

Related posts

‘ఇడి విచారణ ఎదుర్కొని విదేశాలకు వెళ్లు’

somaraju sharma

దిశ హత్య: ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు గ్రీన్ సిగ్నల్

somaraju sharma

Fire Accident: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం ..ఆరుగురు కార్మికులు మృతి..పలువురు పరిస్థితి విషమం

somaraju sharma