NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: బీజేపీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..!? కేసిఆర్ – ఉండవల్లి: మేథావుల “కల – కళ”..!

KCR: భగవంతుడి కొందరికి కొన్ని శక్తులు ఇస్తుంటారు..! కొందరికి లోపాలు ఇస్తుంటాడు..! కొంత మంది వేగంగా పరుగెత్తగలరు. కొంత మంది చక్కటి దుస్తూరితో రాయగలరు. కొంత మంది షార్ప్ గా ఆలోచించగలరు. కొంత మంది అనర్గళంగా మాట్లాడగలరు. ఎలా ఎవరికి ఉండే శక్తి యుక్తులు, ప్రత్యేకతలు వారికి ఉంటాయి. కానీ షార్ప్ గా ఆలోచించి, దాన్ని విడమర్చి ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పడం మంచి కళ. రాజకీయాలకు ఈ కళ చాలా బాగా పనికి వస్తుంది. ఈ కళాకారుల జాబితాలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసిఆర్. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లు ఉన్నారు. మేథావి వర్గంగా గుర్తింపు పొందడమే కాక మంచి మాటకారులు కూడా. వీరి ఇద్దరికి మరో మేథావి కలిశారు. ఆయనే ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ (పీకే). దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయి రాజకీయాలకు కేసిఆర్ ఎదిగేందుకు పీకే, ఉండవల్లి సహకరించాలని భావిస్తున్నారు. ఉండవల్లికి రాజకీయ తెలివితేటలు ఉండగా, ప్రశాంత్ కిషోర్ కన్నింగ్ తెలివితేటలు ఉన్నాయి. వీరిద్దరి తెలివితేటలకో ఢిల్లీలో బీజేపికి వ్యతిరేకంగా రాజకీయ చక్రం తిప్పేందుకు కేసిఆర్ ను తీసుకువెళ్లాలని చూస్తున్నారు. ఇది సాధ్యమవుతుందా…? కేంద్రంలో బీజేపీకి కేసిఆర్ ప్రత్యామ్నాయ శక్తి అవుతారా..?ఊహించుకోలమా..?

KCR National Politics PK Undavalli Strategy
KCR National Politics PK Undavalli Strategy

KCR: కేంద్రంలో ఓ శక్తిగా బీజేపీ

దేశంలోని రాజకీయాల్లో ఇప్పుడు బీజేపీ ఒక పెద్ద శక్తిగా ఉంది. 2014 లో బీజేపీ, మిత్ర పక్షాలతో కలిసి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికలు వచ్చే సరికి మిత్ర పక్షాలతో పని లేకుండానే బీజేపీకే మ్యాజిక్ ఫిగర్ వచ్చేసింది. దేశ రాజకీయాల్లో బీజేపీ ఒక శక్తిగానే కొనసాగుతోంది. ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపియే గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల దెబ్బ నుండి కోలుకోలేదు. 135 సంవత్సరాలు చరిత్ర కల్గిన కాంగ్రెస్ పార్టీయే బీజేపీకి ప్రత్యామ్నాయం. ఇంత పెద్ద చరిత్ర కల్గిన కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉండాల్సింది కానీ పాత కాలపు సిద్ధాంతాలు, పాత కాలపు రాజకీయాలు, రాజకీయం లేకపోవడం, వ్యూహాలు లేకపోవడం, నాయకులు పార్టీని వీడి వెళ్లిపోతుండటం, కొత్త తరం నాయకత్వాన్ని నిలబెట్టలేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ చతికిలపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి ఒంటరిగా కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ తరుణంలో ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ జత కడితేనే బీజేపీకి ప్రత్యామ్నాయం అయ్యే అకాశం ఉంది. కానీ లెఫ్ట్ పార్టీల సిద్దాంతం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం. వీళ్లు కాంగ్రెస్ పార్టీతో జత కట్టే అవకాశం లేదు.

KCR: ప్రాంతీయ పార్టీల్లో ఎవరి రాజకీయం వాళ్లదే

ప్రాంతీయ పార్టీల్లో ఎవరి విదివిధానాలు వాళ్లకు ఉంటాయి. ఎవరి రాజకీయం వాళ్లదే. మన దేశంలో బలమైన ప్రాంతీయ పార్టీలు చూసుకుంటే.. వైఎస్ఆర్ సీపీ, టీఎంసీ, టీఆర్ఎస్, ఆమ్ అద్మీ పార్టీ, ఎన్సీపీ, డీఎంకే, బీజేడీ, జేడీయు ఇలా చాలా పార్టీలు ఉన్నాయి. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక విధివిధానం, లక్ష్యం ఉన్నాయి. అయితే ప్రస్తుత తరుణంలో బీజేపీని ఎగర్తించే పరిస్థితుల్లో వైఎస్ఆర్ సీపీ లేదు. టీఎంసీ బీజేపీకి వ్యతిరేకంగానే ఉంది. టీఆర్ఎస్ కు వ్యకిగత లక్ష్యాలు, ఎజెండాలు ఉన్నాయి. ప్రధాన ప్రాంతీయ పార్టీల్లో ఎవరి లక్ష్యాలు వాళ్లకు ఉన్నాయి. టీఎంసీతో డీఎంకే కలుస్తుంది. ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ తో కలవడానికి ఇబ్బందులు లేవు. కానీ టీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ తో కలవడానికి సిద్ధంగా లేదు. వైసీపీ కూడా కాంగ్రెస్ తో కలిసే పరిస్థితి లేదు. సో…దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలిసి రాజకీయం చేసే అవకాశం కనిపించడం లేదు. ప్రాంతీయ పార్టీల మధ్య ఐక్యత కష్టమే. ప్రాంతీయ పార్టీలు అన్నీ కలవలేవు. ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిసి కాంగ్రెస్ తో జత కడితే బీజేపీకి ప్రత్యామ్నాయం అవుతుంది. ప్రాంతీయ పార్టీల్లో ఎవరి వ్యక్తిగత ఎజెండాలు వాళ్లవే, ఎవరి వ్యూహాలు వాళ్లవే అన్నట్లుగా ఉంటుంది. ఈ క్రమంలోనే వాళ్ల వ్యక్తిగత ఎజెండాకు అనుగుణంగా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ (భారతీయ రాష్ట్రాయ సమితి) పార్టీగా రూపాంతరం చెందుతోంది. ఈ బీఆర్ఎస్ పేరుతో కేసిఆర్ జాతీయ స్థాయి రాజకీయాలను ప్రారంభిస్తున్నారు.

KCR: కొండకు వెంట్రుక సామెతగా..

జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పుతా అని కేసిఆర్ చెప్పడం ఇప్పుడేమీ కొత్త కాదు.  2009 ఎన్నికలకు ముందు. 2014 ఎన్నికలకు ముందు తాను జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పుతా, ఫెడరల్ ఫ్రంట్ అంటూ మాట్లాడారు. ఇప్పుడే మళ్లీ జాతీయ స్థాయి రాజకీయాలు అని కేసిఆర్ ఎందుకు అంటున్నారు అంటే.. కేసిఆర్ రెండవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఎంపిగా, కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు.  ఇక ముఖ్యమంత్రి పదవిపై మోజు తీరింది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో సీఎం పదవిని ఆయన తనయుడు కేటిఆర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇక కేసిఆర్ టార్గెట్ పదవులు ప్రధాన మంత్రి లేదా రాష్ట్రపతి మాత్రమే. కానీ కేసిఆర్ బీఆర్ఎస్ పార్టీ తరుపున పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోనే మూడు ఎంపీ స్థానాలు గెలిచే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితి ఉన్న బీఆర్ఎస్ బీజేపీకి ప్రత్యామ్నాయం అవుతుంది అనుకోవడం కలే. కాకపోతే కొండకు వెంట్రుక వేయడం అన్న చందంగా కేసిఆర్ జాతీయ స్థాయి రాజకీయాలకు ఎంట్రీ ఇస్తున్నారు. వస్తే కొండ (రాష్ట్రపతి, లేదా ప్రధాన మంత్రి పదవి) వస్తుంది. లేకపోతే పోయేది ఏమీ లేదు. ఈ స్ట్రాటజీలో భాగంగా ఇద్దరు మేథావులు పీకే, ఉండవల్లిలతో కీలక చర్చలు జరిపారు కేసిఆర్.

author avatar
Special Bureau

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?