Krishnapatnam Telugu Media: ఒక మందు – వంద వార్తలు..! తెలుగు మీడియాకి కృష్ణపట్నం బు(దు)రద..!!

Krishnapatnam Telugu Media: Three Days Three types of news
Share

Krishnapatnam Telugu Media: “నిన్న బాగుందని చెప్పిన ఛానెల్ ఈరోజు బాగులేదని” చెప్తుంది.. “నిన్న బాగులేదని చెప్పిన ఛానెల్ ఈరోజు బాగుంద”ని చెప్తుంది..! అక్కడితో ఊరుకోవడం లేదు.. “నిన్న ఎవ్వరికీ సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని చెప్పిన ఛానెల్.. ఈరోజు సైడ్ ఎఫెక్ట్ తో ఇద్దరు ఆసుపత్రిలో చేరారు” అని చేప్తుంది.. “నిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయట అని చెప్పిన ఛానెల్ ఈరోజు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేవు.. ప్రభుత్వ కుట్ర” అని చెప్తుంది..! ఎవరు ఎప్పుడు ఏం వార్త ప్రసారం చేస్తున్నారో.. ఎవరు ఏ ఉద్దేశంతో వార్తలు ఇస్తున్నారో తెలుగు మీడియాలో ఏ ఒక్క పత్రికకూ.., ఛానెల్ కీ అర్ధం కావడం లేదు.. అందుకే ఇక్కడి వరకు బహుశా మీకు కూడా అర్ధం కాకపోయి ఉండవచ్చు. ఇప్పుడు స్పష్టంగా పాయింట్ కి వచ్చేద్దాం..!!

Krishnapatnam Telugu Media: Three Days Three types of news
Krishnapatnam Telugu Media: Three Days Three types of news

Krishnapatnam Telugu Media: జ్ఞానం ఎక్కడకు పోతున్నాయి..!

తెలుగు మీడియాకు బుద్ధి, జ్ఞానం ఎక్కడకు పోతున్నాయో అర్ధం కావడం లేదు. హైప్ ఇవ్వడం.. మళ్ళీ నీరు గార్చేయడం..! స్పష్టత లేకుండా, ఒక శాస్త్రీయత రాకుండానే హైలైట్ చేసేయడం.. మళ్ళీ వెనకడుగు వేసెయ్యడం.. లైవ్ పెట్టేది వాళ్ళే… అతనిపై కేసులు పెట్టమని వార్తలు వేసేది వాళ్ళే.. కేసులు పెడితే పెద్ద వార్తలు రాసేది వాళ్ళే..! నిన్న, ఈరోజు ఏబీఎన్, టీవీ 9, టీవీ 5, ఎన్టీవీ ఛానెళ్లలో కృష్ణపట్నం నుండి వార్తల కవరేజీ చూస్తే వాళ్ళు ఎంత గందరగోళంలో ఉన్నారో అర్ధమవుతుంది.. బాగుందో లేదో.. పని చేస్తుందో లేదో తెలియదు.. పని చేస్తుందో లేదో స్పష్టత లేదు.. అయినా విపరీత కవరేజీ ఇచ్చేసి ఆ ఆయుర్వేదం ఆనందయ్యలో నిర్వేదం నింపుతున్నారు. ఆనందం లేకుండా చేస్తున్నారు. “మందు పనితీరుపై ఎంత గందరగోళంలో వార్తలు ఇచ్చారో.. మందు వలన కలుగుతున్న దుష్పరిణామాలపై కూడా అంతే కంగాళీ వార్తలు ఇస్తున్నారు.

Krishnapatnam Telugu Media: Three Days Three types of news
Krishnapatnam Telugu Media: Three Days Three types of news

కరోనా వంటి సున్నిత మందుపై అనవసర..!!

కరోనా ఇప్పుడు అత్యంత సున్నితమైన రోగంగా మారింది. వేల మందిని బలితీసుకుంటుంది. ఇటువంటి సమయంలో కరోనాకి మందు అంటే సాధారణంగానే జనం ఎగబడతారు. ఆ ప్రభావం కృష్ణపట్నం లో బాగా చూసాము. ఈ విషయంలో మీడియా సంయమనం పాటించాల్సింధీ. శాస్త్రీయత, స్పష్టత వచ్చే వరకు కవరేజికి కొన్ని పరిమితులు పాటిస్తే బాగుండేది. కానీ.. సోషల్ మీడియాకి పగ్గాలు లేవు. మీడియా కూడా అవేమి లేకుండా ఉంది. ఆ ఫలితమే… రెండు రోజుల కిందట వీడియోలో ఓ హెడ్ మాస్టర్ “నేను ఆ చుక్కల మందు వేసుకున్నాను. నాకు వెంటనే ఆక్సిజన్ లెవల్స్ పెరిగాయి. బాగుంది.” అని చెప్పారు. ఆ వీడియో ఆనందయ్యకి మంచి బ్రాండ్ ఇమేజి తెచ్చిపెట్టింది. ఇప్పుడు అదే హెడ్ మాస్టర్ “తనకి ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. కళ్ళు ఇన్ఫెక్షన్ సోకింది. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉన్నారు. మొదటి వీడియో చూసిన ఇదే మీడియా, సోషల్ మీడియా “ఆనందయ్య మందుని ఎత్తేసింది.. ఇప్పుడు రెండో వీడియో చూసాక.. ఇదే మీడియా ఆనందయ్య మందుపై అనుమానాలు కలిగేలా రకరకాల ప్రచారం చేస్తుంది. ఇటువంటి సున్నితమైన వ్యవహారాల్లో స్పష్టత వచ్చే వరకు కాస్త వెనక్కు తగ్గి వార్తలు ఇస్తే కొంచెమైనా విజ్ఞత మిగిలేది..! ఈ అతి వలన ఒక్కరోజులో స్టార్ అయిపోయిన ఆనందయ్య.. ఇప్పుడు కష్టాల్లో పడ్డారు..!


Share

Related posts

ఇది టీడీపీ – బీజేపీ చేతకాని తనమే తప్ప జగన్ గొప్ప కాదు ??

siddhu

జగనన్న మరో పిడుగు ; బడుగులకు దెబ్బ

Special Bureau

పెళ్ళి అయిన పక్కరోజే షాకిచ్చిన కాజల్..! ఇక నా వల్ల కాదంటూ ‘బై’ చెప్పేసింది

siddhu