NewsOrbit
5th ఎస్టేట్

కుప్పం నుంచి కుప్పలు కుప్పలు గా లెక్కలు బయటకొస్తున్నాయ్ ?  

 

రాష్ట్ర రాజకీయాలలో కుప్పం నియోజకవర్గానికి చాలా ప్రాధాన్యత ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన అక్కడ ఆయన ఇప్పటివరకు ఓడింది లేదు. అయితే ప్రస్తుతం జగన్ అధికారంలోకి రావడం…. వెంటనే కుప్పం నియోజకవర్గాన్ని గట్టిగా టార్గెట్ చేసి దానిని పురపాలక సంఘంగా మార్చడం త్వరత్వరగా జరిగిపోయాయి. కుప్పం పురపాలక సంఘంగా చంద్రబాబు హయాంలోనే మారకపోగా.. కుప్పం నియోజకవర్గ ప్రజలు కూడా ఇప్పడు ఉన్న ప్రభుత్వ పనితీరుపై ఫుల్ గా హ్యాపీ అయిపోయారు.

తొలిమెట్టు విజయవంతంగా వేసిన జగన్ ఇప్పుడు తర్వాత అసలైన వ్యవహారంలోకి వచ్చాడు. సొంత నియోజకవర్గపు వ్యవహారాల్లో బాబు గురించి ఏదైనా గుట్టు బయటపడుతుందేమో అని విపరీతంగా ప్రయత్నించడం మొదలుపెట్టాడు. ఎంతైనా చంద్రబాబు తెలివి మెచ్చుకోవాలి. ఎక్కడా దొరకడు…. ఫైళ్లను ఉండడు అందుకే అప్పట్లో వైఎస్ కు చిక్కలేదు జగన్ కు తొమ్మిది నెలల నుండి విపరీతంగా ప్రయత్నిస్తున్నా దొరకట్లేదు.  ఇక జగన్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా చంద్రబాబుని వీలైనన్ని కేసులు బుక్ చేసి బీటలు వారిన తెలుగుదేశం స్థంబాలను కూల్చేయాలని మంచి కసి మీద ఉన్నాడు.

దీనిలో భాగంగా జరిగిన అనేక తవ్వకాల్లో కుప్పం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. అయితే బాబు గారు ఏమైనా సామాన్యుడా…? డైరెక్ట్ గా అతను ఎందులో తలదూర్చడన్న విషయం కొంచెం లోతుగా వెళితే తెలిసింది. అయితే ఏమి ఎన్నో ఏళ్లుగా కుప్పంలో చంద్రబాబు తరఫున అతని అన్ని వ్యవహారాలను చూసుకునే అతని పర్సనల్ అసిస్టెంట్ అనగా పిఎ మనోహర్ ఇరుక్కున్నాడు. ఒక్క మనోహర్ మాత్రమే కాదు బాబు కి సపోర్ట్ గా ఇన్ని రోజులు ఉన్న అందరినీ టార్గెట్ చేసి ఒక్కసారిగా కుప్పం కుప్పలో నుంచి బయటికి లాగారు.

టౌన్ బ్యాంకు లో దాదాపు రెండు కోట్ల వరకు స్కామ్ జరిగిందని లెక్కలు వేశారు. ప్రత్యేకంగా టీమ్స్ ను ఏర్పాటు చేసి…. అసలు దాని కథాకమామిషు ఏంటో తేలుస్తున్నారు. వీటిలో ప్రభుత్వం సక్సెస్ అవుతుందా లేదా అన్న విషయం పక్కన పెడితే మనోహర్ ఇందులో బుక్ కావడం బాబు కి చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి, చిటారుకొమ్మన అందుకోవాలంటే కష్టపడి చెట్టు ఎక్కాల్సిన పని లేదు అన్న విషయం ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి బోధ పడినట్లు ఉంది. ఇక ఈ స్కామ్ విషయమై ప్రస్తుత బ్యాంకు చైర్మన్ ఫిర్యాదు చేయడం మరొక విశేషం.

దీనితో పోలీసులు కేసు బుక్ చేసి చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు. ఇక త్వరలోనే స్కామ్ పై పూర్తి వివరాలు బయట పడతాయి కానీ ప్రాథమికంగా బయటకు వచ్చిన ఒక అభియోగం మాత్రం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అది ఏమిటంటే ప్రత్యేకంగా ఆడిటింగ్ మరియు జువెలరీ పరిశీలన జరిగినప్పుడు 30 బంగారు ప్యాకెట్లు కనిపించలేదట. ఇది ఏంటి రా బాబు అని ఆరాతీస్తే మేనేజర్ నవీన్ బాబు మరియు క్యాషియర్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అసలు బంగారం మాయం కావడం ఏమిటి?

ఈ వ్యవహారం అంతా పక్కనపెడితే మరొక ఒక 20 లక్షల 25 వేలు లెక్క తేలడం లేదు. ఇదేమిటని మేనేజర్ ను ప్రశ్నిస్తే.. 2015లో శ్రీనివాసులు తీసుకొని పోయాడు…. ఆయన మనోహర్ మనిషి అంటాడు. ప్రసన్న తిరుపతి గంగమ్మ గుడి యొక్క 16 బాండ్లను కుదువపెట్టి డబ్బు తీసుకొని పోయాడు అని అన్నాడట. అసలు గుడి ఏమిటి? గుడి బాండ్లు కుదువపెడితే డబ్బులు ఎలా ఇస్తారు? దీనికి చంద్రబాబు పిఏ రికమండేషన్ ఏమిటి? ఇప్పుడు వైసిపి కింకర్తవ్యం చంద్రబాబు పిఎ మనోహర్ ను లాక్ చేయడం. ఇక అతను అప్రూవర్ గా మారాలేకాని కుప్పంలో చంద్రబాబు లింక్స్ కత్తిరించడం వైసీపీకి పెద్ద పనేం కాదు. ఇప్పుడు అసలైన ఆట మొదలైంది.

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau

Leave a Comment