5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Kurnool TDP: కర్నూలు టీడీపీలో నిప్పు..!? మూడు ఫ్యామిలీలు అలక..!

Share

Kurnool TDP: వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి టీడీపీలో చేరనున్నారు.  నారా లోకేష్ తో మాట్లాడారు అంటూ వస్తున్న వార్తలపై స్పష్టమైన సమాచారంతో “న్యూస్ ఆర్బిట్” మంగళవారం ఇచ్చిన కథనాన్ని చదివే ఉంటారు. బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి టీడీపీలో చేరడం లేదు. నారా లోకేష్ తో మాట్లాడలేదు. వైసీపీలో అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమే అని స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఒక వేళ బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరితే ఆ పార్టీకి వచ్చే ముప్పు ఏమిటి…? ఇప్పటికే కర్నూలు టీడీపీలో నివురు గప్పిన నిప్పులా ఏమైనా ఉందా..? అనే విషయాలను పరిశీలిస్తే..కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంట్ పరిధిలో రాజకీయంగా బలమైన కుటుంబాలు కొన్ని ఉన్నాయి. కోట్ల ఫ్యామిలీ..వీరికి జిల్లా వ్యాప్తంగా పట్టు ఉంటుంది. కొన్ని నియోజకవర్గాల్లో స్ట్రాంగ్ బేస్‌మెంట్ ఉంది. కర్నూలు ఎంపిగా కోట్ల సూర్యప్రకాశరెడ్డి, ఆలూరు అసెంబ్లీ నుండి కోట్ల సుజాతమ్మ పోటీ చేస్తారు. అలానే గౌరు చరితా రెడ్డి, గౌరు వెంకట రెడ్డి. చరితా రెడ్డి పాణ్యం నియోజకవర్గం, వెంకట రెడ్డి ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. మరో పక్క కేఇ సోదరులు. వీరు పత్తి కొండ, డోన్ నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. అయితే డోన్ నుండి సుబ్బారెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నందున వేరే నియోజకవర్గాన్ని చూసుకుంటారు.

Kurnool TDP politics
Kurnool TDP politics

Read More: Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి టీడీపీలో చేరుతున్నారా..? ప్రచారంలో వాస్తవం ఎంత..!? ఇదీ నిజం..!!

Kurnool TDP: నంద్యాల పార్లమెంట్ మొత్తం డిస్ట్రబెన్స్

ఈ మూడు కుటుంబాలకు బలమైన వర్గం ఉంది. పార్టీలోనూ మంచి పట్టు ఉంది. ఇప్పుడిప్పుడే గ్యాప్స్ నుండి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. కోట్ల, కేఇ కుటుంబాలకు పడదు,  దశాబ్దాల వైరం ఉంది. అటువంటిది 2019లో బలవంతంగానైనా కలిసి పని చేయాల్సి వచ్చింది. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఆ బలవంతంగా పని చేయడం కాస్త పోయి బలహీనతలను సరి చేసుకుని కలిసి పని చేయాలి. వచ్చే ఎన్నికల్లో కఛ్చితంగా పార్టీ అధికారంలోకి రావాలి అన్న ధోరణిలోకి వచ్చారు. అందుకే ఒకరి నియోజకవర్గంలో మరొకరు వేలు పెట్టడం లేదు. ఒకరినొకరు డిస్ట్రప్ చేసుకోవడం లేదు. పాణ్యం, శ్రీశైలం, ఆలూరు, డోన్, పత్తికొండ లాంటి నియోజకవర్గాల్లో ఇప్పుడిప్పుడే ఒక క్లారిటీ వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి, బైరెడ్డి రాజశేఖరరెడ్డిలు  టీడీపీలో చేరితే పాణ్యం, శ్రీశైలం అసెంబ్లీ సిగ్మెంట్ లతో పాటు నంద్యాల పార్లమెంట్ మొత్తం డిస్ట్రబెన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

గౌరు దంపతులు సిగ్నెల్ ఇచ్చేశారు

బైరెడ్డి రాజశేఖరరెడ్డి కంటే దూకుడైన వ్యక్తి సిద్ధార్ధ రెడ్డి. సిద్ధార్ధ రెడ్డికి వైసీపీలో తన పెత్తనం సాగడం లేదు కాబట్టే టీడీపీలోకి రావాలి అనుకుంటున్నప్పుడు టీడీపీలో కశ్చితంగా పెత్తనం కోసం ప్రయత్నించే అవకాశాలు ఉంటాయి. సిద్ధార్ద్ రెడ్డి పార్టీలో చేరితే తాము పార్టీలో ఉండము అని గౌరు వెంకటరెడ్డి, చరితా రెడ్డిలు ఇప్పటికే తెగేసి చెప్పినట్లు సమాచారం. సిద్ధార్ధ్ రెడ్డి టీడీపీలో చేరేది లేదు. లోకేష్ ను కలిసింది లేదు అదంతా ఉత్తుత్తి పుకారు. ఎప్పుడో ఎన్నికలకు ముందు చేరతారో..? లేదో..? అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో..? తెలియదు కానీ ఈ లోగా వీళ్లు (గౌరు కుటుంబం) అనుచరుల ద్వారా పార్టీలో ఉండము అని సిగ్నల్స్ ఇచ్చేశారు. ఇప్పుడిప్పుడే టీడీపీలో గ్యాప్స్ సర్దుకుంటున్న సమయంలో సిద్ధార్ధ రెడ్డిని ఆహ్వానించడం ద్వారా ఉన్న నాయకత్వాన్ని వదులుకోవడం టీడీపీకి అంత మంచిది కాదు. సిద్ధార్ధ రెడ్డి టీడీపీలోకి రావాలని కర్నూలులోని టీడీపీ నేతలు కోరుకోవడం లేదు. కేవలం టీడీపీ అనుకూల మీడియా మాత్రం కోరుకుంటోంది. ఇది అంత మంచి పరిణామం కాదు.


Share

Related posts

‘విశాఖ భూకుంభకోణంపై సిబిఐ దర్యాప్తు చేయాలి’

somaraju sharma

అమరావతి లో మరొక వివాదం .. ఉలిక్కిపడ్డ ఏపీ ??

sridhar

Pakka commercial : ‘పక్కా కమర్షియల్’ హిట్ ఇస్తానంటున్న మారుతి..!

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar