NewsOrbit
5th ఎస్టేట్ Featured న్యూస్

“చంద్రబాబుని కొట్టబోయిన నారా లోకేష్”..!? అంతేగా ఏబీఎన్ ఆర్కే వారు..!?

“YS Jagan Mohan Reddy జగనన్న నువ్వి YS Rajasekhar Reddy రాజన్న రాజ్యం తెస్తావనుకుంటే.. రాజారెడ్డి రాజ్యాంగం తెచ్చావు (అంటే రాజన్న YS Sharmila షర్మిల తండ్రి.. రాజారెడ్డి షర్మిల తాత కాదా..? కథనం రాసిన ABN Radhakrishna ఆర్కేకే తెలియాలి)..! నువ్వు జైల్లో ఉన్నప్పుడు నేను వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే.., నువ్వు అధికారంలోకి వచ్చి నన్ను పట్టించుకోలేదు. అందుకే నీ పతనం నాకు కావాలి. తెలంగాణాలో పార్టీ పెడతా..? అక్కడ సీఎం అయిపోతా..! నీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా (ఏపీలో సీఎంగా ఉన్న YSRCP జగన్ కి వ్యతిరేకంగా, జగన్ పై కోపంతో తెలంగాణాలో పార్టీ పెట్టడం ఏమిటో ఆర్కేకే తెలియాలి.)…….” ఇంకా చాలా సోది ఉంది. ఇవే లైన్లలో.., ఇదే తరహాలో ఒక స్క్రిప్ట్ ప్రకారం.., ఒక ప్లాన్ ప్రకారం ఈరోజు ఏబీఎన్ ABN Channel ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. ఏపీలో Andhra Pradesh ఇప్పుడున్నా రాజకీయ విధానాలు, ఫేక్ ప్రచారాలకు ఈ కథనం ఏమి కొత్త కాదు, ఆశ్చర్యం అంతకన్నా కాదు..!!

సాక్షి కూడా ఉంది.. తొందరెందుకు..!!

పత్రికల రాతల్లో అబద్ధాలు, అవాస్తవాలు ఉంటాయి అది సహజం. కాకపోతే అవి అతికినట్టు ఉండాలి. ఫేక్ ప్రచారం కూడా కాస్త వాస్తవాలకు దగ్గరగా ఉండాలి. కానీ ఒక పెద్ద బాంబుని పీల్చితే.. జనం నమ్మితే మంచిది.., లేకపోతే ఒకరోజు పత్రికలో పేజీ వేస్ట్ అంతేగా..! ఇటువంటి జర్నలిజం చాలా సులువు. రేపో, ఎల్లుండో సాక్షిలో కూడా
* “నారా లోకేష్ కి చంద్రబాబుకి పడట్లేదు. రెండు రోజుల కిందట చాలా పెద్ద గొడవ జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. తాను ఇలా తయారవ్వడానికి.., పార్టీ దారుణ స్థితిలో ఉండడానికి కారణం తన తండ్రి చంద్రబాబే అని గుర్తించిన లోకేష్ అలిగి, గోల చేసినట్టు సమాచారం. ఇంట్లో టీవీలు పగలకొట్టి.., నాన్నని మెడ పట్టుకుని గెంటేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారంతో అప్పటికే 70 ఏళ్ళు పైబడిన చంద్రబాబు కోపంలో నీ కోసం నేను నందమూరి వారి నుండి పార్టీని లాక్కుంటే.., నువ్వు నన్ను నిందిస్తావా అంటూ నాటి వాస్తవాలను చెప్పేసినట్టు.. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదంతో 1995 నాటి కుట్ర సంగతులను చంద్రబాబు బయటపెట్టేసినట్టు ప్రచారం జరుగుతుంది..” అంటూ సాక్షి కూడా రాసుకోవచ్చు. ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ద్వారా పసుపు కళ్ళు చల్లబడతాయేమో.., రేపో, మాపో సాక్షిలో వచ్చే కథనం వలన బ్లూ కళ్ళు చల్లబడతాయేమో.., కానీ ఫేక్ కి వికృత రూపం దాల్చుతుంది..!!

ఏమో భారతి కూడా తిరుగుబాటు..!?

ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం లోతుగా వెళ్లాల్సిన అవసరం లేదు. షర్మిల జగన్ పై ఆగ్రహంతో ఉన్నట్టు.. ఒకవేళ షర్మిల జగన్ కి వ్యతిరేకంగా మారితే అమ్మ విజయమ్మ కూడా షర్మిల వెంట ఉంటారని.., రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు షర్మిల అంటేనే ఎక్కువగా ఇష్టపడేవారిని.. మొత్తానికి రాజశేఖర్ రెడ్డి నిజమైన వారసురాలు షర్మిల అనే అర్ధం వచ్చేలా., జగన్ అంటే మూర్ఖుడు.., ఎవరితో పడట్లేదు అనేలా రాసుకొచ్చారు. ఇవి ఒక స్ట్రాటజీ రాతలు. రాజకీయాల్లోకి, మీడియాలోకి పీకే (ప్రశాంత్ కిషోర్) రాబిన్ శర్మ వంటి స్ట్రాటజిస్టులు వస్తే ఇటువంటి రాతలే వస్తుంటాయి. ఆశ్చర్యం అవసరం లేదు.

ఏమో ఈరోజు షర్మిల కథనం వర్కవుట్ కాకపోతే భవిష్యత్తులో “భారతికి జగన్ కి పడడం లేదు. సీఎం అయ్యాక జగన్ భారతిని పట్టించుకోవడం లేదు. జగన్ జైలుకి వెళ్తారని.., భారతికి సీఎం పదవి వస్తుందని ఆశ పడిన ఆమెకు నిరాశ ఎదురవడంతో జగన్ పై తిరుగుబాటు చేశారు” అంటూ మరో కథనం ఈ ఏబీఎన్ రాధాకృష్ణ వారు రాస్తారేమో. ఆ అక్షరాలకు అడ్డు అదుపు లేదు. మారుతున్న మీడియా వైఖరి, మీడియా స్ట్రాటజీ, సోషల్ మీడియా పైత్యానికి ఇటువంటి రాతలు పెద్ద పట్టించుకోవాల్సిన పనిలేదు. ఈ గేమ్.. ఈ ఫ్యామిలీలను కెలికేసి రాజకీయాన్ని వాడుకునే గేమ్ ఇప్పుడు ఆర్కే మొదలు పెట్టారు. దీనికి అంతం ఏముంది. అందరికీ ఫ్యామిలీలు ఉన్నాయిగా.. కెలికేయండి. ఆ ఇంట్లో, ఆ గోడల్లో మీరు దూరినట్టు రాసేయండి. కమాన్… రేపు సాక్షిలో చంద్రబాబు – లోకేష్ వార్ గురించి.., మళ్ళీ ఎల్లుండి ఆంధ్రజ్యోతిలో జగన్ – భారతి వార్ గురించి పుంఖాను పుంఖాలుగా రాసుకోండి..!!

 

 

 

 

author avatar
Srinivas Manem

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju