NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Mekapati Goutham: ఆ విషయంలో టీడీపీ తప్పులు..! బాబు పెద్దరికం..నేతల అత్యుత్సాహం..!

Mekapati Goutham: ఏపి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నిన్న మరణించారు. ఆయన మరణం నిజానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలకు తీరనిలోటు. ఎందుంటే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ కేబినెట్ మంత్రులు అందరిలో కాస్త హుందాగా, పద్ధతిగా, చాలా నిక్కచ్చిగా, తక్కువ మాట్లాడి తక్కువ వివాదాల్లోకి వెళ్లి ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తి మేకపాటి గౌతమ్ రెడ్డి. ఆయన ప్రతిపక్షాలను మరీ ఇబ్బందికరంగా మాట్లాడిన సందర్భాలు లేవు. ఇతర మంత్రులతో పోలిస్తే గౌతమ్ రెడ్డి చాలా హుందాగా ప్రవర్తించే వారు. అలాగే ఎప్పటికప్పుడు విదేశీ పర్యటనలు చేస్తూ పరిశ్రమల కోసం సంప్రదింపులు, మాట్లాడటం వంటి ఆయన ప్రయత్నాలు ఆయన చేసే వారు. ఆయన మరణం అన్ని రాజకీయ పార్టీలను కలచివేసింది. అందుకే అన్ని పార్టీల నాయకులు వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇదే సందర్భంలో మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం విషయంలో టీడీపీ కొన్ని తప్పులు చేసింది. ఆ తప్పులను కప్పిపుచ్చేలా చంద్రబాబు పెద్దరికం, హుందాతనం చూపించారు.

 

Mekapati Goutham: సోషల్ మీడియాలో వైరల్ అయిన కొలికపూడి శ్రీనివాసరావు ట్వీట్

విషయంలోకి వెళితే…గౌతం రెడ్డి మరణం తరువాత అమరావతి జేఏసి నేత కొలికపూడి శ్రీనివాసరావు ఒక ట్వీట్ పెట్టారు. “ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహనరెడ్డి పరిపాలన వల్ల పరిశ్రమలు రావడం లేదు. ఉన్న పరిశ్రమలు పోతున్నాయి. సో.. ఆ మనసిక ఒత్తిడి తట్టుకోలేక జగన్ పరిపాలన నచ్చక పరిశ్రమలు రావడం లేదు. ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుకు గురైయ్యారు” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టీడీపీ సర్కిల్ లో చాలా మంది ఆ ట్వీట్ ను షేర్ చేసుకున్నారు. అయితే ఆ ట్వీట్ పై తీవ్ర విమర్శలు రావడంతో కొలికపూడి శ్రీనివాసరావు ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు. అది నిజమా అబద్దమా అనేది అప్రస్తుతం. ఇప్పుడు అలా మాట్లాడకూడదు. కానీ దాన్ని తటస్థ వర్గాలు అంగీకరించవు. టీడీపీ దృష్టితో చూస్తే అది కరెక్టు కావచ్చు. వైసీపీ యాంగిల్ లో చూస్తే ముమ్మాటికీ తప్పు కావచ్చు. తటస్థ యాంగిల్ లో నూట్రల్ కోణంలో చూసినా దాన్ని తప్పుబడతారు. ఒక మంత్రి, రాజకీయ నాయకుడు చనిపోయిన రోజే దాన్ని రాజకీయంగా చూసి రాజకీయ విమర్శ చేయడం అనేది ఎవరూ అంగీకరించరు.

 

మేకపాటి ఫ్యామిలీని వెంటనే పరామర్శించిన చంద్రబాబు

గౌతమ్ రెడ్డి హుందాతనంగా వ్యవహరించారు కాబట్టి ఆయన మరణాన్ని గౌరవించాలి. విలువను ఇవ్వాలి. ఆ ట్వీట్ ను ఈ రోజు రేపో పెట్టుకుంటే అంతగా రాజకీయ చర్చ జరగదు. ఆయన చనిపోయిన గంట వ్యవధిలోనే కొలకపూడి శ్రీనివాసరావు ట్వీట్ పెట్టడం వివాదాస్పదం అయ్యింది. టీడీపీ దొరికిపోయింది. అయితే చంద్రబాబు దీన్ని కాస్త కప్పిపుచ్చే ప్రయత్నం చేశారంటే.. ఆయన గౌతమ్ రెడ్డి మరణం తెలిసిన వెంటనే వెళ్లారు. సీఎం జగన్మోహనరెడ్డి కంటే ముందే చంద్రబాబు గౌతమ్ రెడ్డి ఇంటికి వెళ్లారు. మేకపాటి రాజమోహన్ రెడ్డిని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. నివాళులర్పించారు. నిజానికి మేకపాటి ఫ్యామిలీ రాజకీయం మొదలైంది టీడీపీలోనే. టీడీపీ నుండి రాజమోహన రెడ్డి గతంలో ఎంపీగా పోటీ చేశారు. ఆ ఉన్న చనువు, పరిచయంతో టీడీపీ నాయకులు చాలా మంది గౌతమ్ రెడ్డి నివాసానికి వెళ్లారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా వెంటనే వెళ్లారు. చంద్రబాబుతో పాటు చాలా మంది టీడీపీ నేతలు వెళ్లారు.

టీడీపీ పట్ల వ్యతిరేకత రాకుండా..

కొలకపూడి శ్రీనివాసరావు గానీ ఇంకా కొంత మంది టీడీపీ వారు కావచ్చు, టీడీపీ సోషల్ మీడియా వారు కావచ్చు ఆ ట్వీట్  చేసి, ఆ కామెంట్స్ చేసి తప్పు చేశారు. చంద్రబాబు హందాతనం, ఆయన రాజకీయ అనుభవంతో దాన్ని కొంత వరకు కవర్ చేశారు. న్యూట్రల్ వర్గాల్లో టీడీపీ పట్ల వ్యతిరేకత రాకుండా చంద్రబాబు చూసుకోగలిగారు. ఇటువంటి మరణాలు జరిగినప్పుడు ఒకటి రెండు రోజులు ఆగాలి. ఉదాహరణకు చెప్పుకుంటే..వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయినప్పుడు ఆయన భౌతికకాయం ఉన్నప్పుడే జగన్మోహనరెడ్డి 155 మంది ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ చేయించారు అనే విమర్శ ఇప్పటికీ ఉంది. 13 సంవత్సరాలు అవుతున్నప్పటికీ జగన్మోహనరెడ్డిని విమర్శించాలంటే ఆ మాట చెబుతారు. అటువంటి విమర్శలు, మచ్చలు చరిత్రలో ఉండిపోతాయి. రాజకీయ నాయకులు గానీ, పార్టీలు గానీ నేతల మరణాల సందర్భంలో కామెంట్స్ చేసే సమయంలో సంయమనం పాటించాలి.

author avatar
Srinivas Manem

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!