NewsOrbit
5th ఎస్టేట్

జగన్ కి ఎవ్వరూ చేయలేని మేలు చేసిన డిల్లీ పెద్దలు – తమకి తెలియకుండానే .. !!

అసలు జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి చాలామంది మదిలో తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే. బీజేపీ విషయంలో జగన్ దారెటు? చంద్రబాబు లాగా కలిసిమెలిసి ఉంటారా లేదా కేంద్రం పై పోరులో కేసీఆర్ కు సహకరిస్తారా? మొత్తానికి కొద్ది నెలలకే విషయం అర్థం అయిపోయింది. జగన్ బీజేపీతో  సఖ్యత కొనసాగించడానికే మొగ్గు చూపారు అని. అయితే మోదీ కూడా అటువైపు నుండి జగన్ పట్ల సానుకూలంగా స్పందించడం మొదలుపెట్టారు. చంద్రబాబు పై ఉన్న కోపమో లేదా జగన్ భవిష్యత్తులో తనకు అవసరం పడతాడో అన్న అవకాశవాదంతోనో తెలియదు కానీ ఇప్పటివరకు అయితే మోడీ జగన్ కు వ్యతిరేకంగా చేసింది ఏమీ లేదు.

మరి అలాంటప్పుడు మండలి రద్దు విషయంలో బిజెపి వారు జగన్ ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టిన బిల్లును ఎందుకు ఆమోదించలేదు? నిజం చెప్పాలంటే బిజెపి తలుచుకుంటే కరోనా…. మరొకటి అసలు అడ్డుకానే కావు. అంతెందుకు మార్చి వరకు బడ్జెట్ సెషన్స్ కొనసాగాయి కూడా. అలాంటిది వైసిపి పంపించిన మండలి రద్దు బిల్లును పార్లమెంటులో పెట్టి ఆమోదించడం కమలనాథులకు చిటికెలో పని. కానీ ఇక్కడ అలా చేయకపోవడానికి ఒకటే కారణం. జగన్ కి ఎందుకు ఇంత ఫేవర్ చేయాలి? జగన్ దూకుడు నిర్ణయాలకు వత్తాసు పలకడం దేనికని వారి ఆలోచన. అందుకే అసలు వారు బిల్లు ఊసే ఎత్తడం లేదు. అదీ కాకుండా ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల పదవుల్లోనుంది అర్ధాంతరంగా తొలగించడం  వారికి ఇష్టం లేదు.

అయితే అదే ఇప్పుడు వైసీపీ నేతలకునెత్తిన పాలు పోసినట్లు అయింది. జగన్ శాసన మండలి  రద్దు అంటే ఏదో మంత్రం వేసినట్లు కౌన్సిల్ రద్దు అయిపోతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. చూస్తుండగానే ఆరు నెలల కాలం గడిచిపోయింది. మరొక ఆరు నెలలు కళ్లు మూసుకుంటే పెద్ద ఎత్తున టీడీపీ ఎమ్మెల్సీలు 2021 మార్చి నాటికి రిటైర్ అయిపోతారు. సీట్లన్నీ కూడా వచ్చి వైసీపీ ఖాతాలో పడతాయి. దాంతో టీడీపీ మెజారిటీ బలం కూడా తగ్గిపోతుంది. దానికితోడు ఉన్న వారు తగ్గి కొంతమంది వైసీపీకి మౌనంగా మద్దతు పలికినా కౌన్సిల్ సజావుగా సాగి వైసిపి బిల్లు పెడితే బిల్లు పాస్ అయిపోతుంది.

ఇక కరోనా తగ్గిన తరువాత ఎన్నో బిల్లులు బీజేపీవే ఉన్నాయి. అవన్నీ పాస్ చేయించుకోవడం వారి ముఖ్య ప్రాధ్యాన్యతలు. తరువాత మండలి రద్దు ప్రతిపాదనను స్టాండింగ్ కమిటీకి అప్పగించాలన్న ఆలోచన  కూడా ఒకటి ఉంది. అంటే అటూ ఇటూ తిరిగి 2024 ఎన్నికలు వచ్చినా తేలని సమస్యగా ఇది ఉంటుందని, ఉండాలని బీజేపీ పెద్దల ఆలోచనగా ఉంది. సరే ఇపుడు జగన్ ఎటూ ఏమీ చేయలేరు కాబట్టి జాప్యంలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ సీట్లను తన వారితో భర్తీ చేసుకుంటూ ఆనందపడడమే మిగిలింది. . ఇపుడు డొక్కా మాణిక్యప్రసాద్ సీటు ఖాళీ అయింది, నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. సీటు వైసీపీనే వరిస్తోంది. ఇలా ఎన్ని ఖాళీలు వస్తే అవన్నీ మరో నాలుగేళ్ళ పాటు వైసీపీవే అవుతాయి. ఇలా బిజెపి వారు మండల రద్దు బిల్లు తమ స్వప్రయోజనాల కోసం ఆలస్యం చేసిన వారికి తెలియకుండానే వైసీపీకి మద్దతు మేలు చేసినట్లే అయింది.

Related posts

Nagari: రోజా చుట్టూ ముళ్లు.. భానుకి కూడా ఔట్ ..!? నగరి మళ్లీ కష్టమే..!?

Special Bureau

Munugode Bypoll: టీడీపీ ఓట్లు పక్కా లెక్క ..! గెలుపునీ డిసైడ్ చేసేది వీళ్లే.. కానీ..?

Special Bureau

Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!

Special Bureau

Amaravati Clarity: క్లారిటీ మిస్ అయిన రాజధాని రాజకీయం ..! లీగల్, లాజికల్ అనాలసిస్..

Special Bureau

అమిత్ షా – జూనియర్ ఎన్టీఆర్ భేటీలో కొత్త కోణం ..? తెర వెనుక జగన్ ఉన్నట్లా..!?

Special Bureau

ఆ ఇన్ చార్జిలకు బాబు సీరియస్ క్లాస్ ..!? రెండు నెలల్లో టీడీపీ లో భారీ మార్పులు..!

Special Bureau

చిరంజీవి తప్పు చేశారు..పవన్ షాకింగ్ కామెంట్స్..!? ప్రజారాజ్యం ఉంటే వేరేలా ఉండేది..!

Special Bureau

మోడీ కబురు..రామోజీ.. జూనియర్ ఎన్టీఆర్ చెవిలో..అమిత్ షా మీటింగ్ సీక్రెట్స్ ఇదేనా..!?

Special Bureau

గంజి చిరంజీవికి బిగ్ ఆఫర్..!? నారా లోకేష్ కి ఇక కష్టమేనా..!?

Special Bureau

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

Special Bureau

క్యాజినో ఆట – బీజేపీ వేట..! “పొలిటికల్ హవాలా”లో బలయ్యేది వైసీపీ/ టీఆరెస్ ప్రముఖులు!?

Special Bureau

పోలవరం ముంపు – వైసీపీకి ముప్పు..!

Special Bureau

చంద్రబాబు – మోహన్ బాబు: కమ్మ తనం ఇద్దరినీ కలిపిందా..!?

Special Bureau

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు – ఆర్కే ఏం రాశారు..!?

Special Bureau

కేశినేని కుటుంబంలో చిచ్చు..! అసలు కారణం, చిన్ని సైలెంట్ వర్క్ ఎందుకు..!?

Special Bureau